Write about Treaty of Versailles

వర్సైల్స్ సంధి గురించి కూలంకశంగా చర్చించండి.

Write about Treaty of Versailles

మొదటి ప్రపంచ యుద్దం అప్పటివరకూ మానవ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న యుధ్ధం. ఈ యుధ్ధం ఇరు పక్షాలవారికి తటస్ధ దేశాలకూ నష్టాన్ని మిగిల్చింది.

జర్మనీ చక్రవర్తి రెండవ విలియం రాజ్యాన్ని వదిలి హాలండ్ కు పారిపోయాడు. జర్మనీ సామ్యవాద రిపబ్లిక్ గా అవతరించింది. క్రొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యుధ్ధంనుండి విరమించుకోవాలని నిర్ణయించుకుంది. 11 నవంబర్ 1918న యుధ్ధం విరమించబడింది.

అగ్రరాజ్యాలు యుద్దం పరిష్కరించలేని సమస్యల పరిష్కారానికి పూనుకున్నాయి.

* యుద్ద సమయంలో జరిగిన ధన, ప్రాణ, ప్రాంత నష్టాలను అంచనా వేయడం.

* వివిద దేశాల మధ్య సంధులు ఏర్పరచడం.

* భవిష్యత్ యుద్దాలను నివారించడానికి శాశ్వత శాంతి ప్రణాళిక

* మిత్ర రాజ్యాల నష్టాన్ని పూడ్చడం వంటి సమస్యల పరిష్కారానికి అగ్రరాజ్యాలు నడుం కట్టాయి.

 

వర్సైల్స్ సంధి 1919 లో మిత్ర రాజ్యాలకు జర్మనీకి మధ్య జరిగింది. ఇది అత్యంత కీలకమైన, పెద్ద సంధి. వెర్సైల్స్ సంధిలో 15 ఆధ్యాయాలు, 439 నిబంధనలు, 8000 పదాలు ఉన్నాయి. ఇంగ్లిష్, ఫ్రెంచ్ రెండు భాషల్లో వెర్సైల్స్ సంధి వ్రాయబడింది. ప్రాదేశిక, వలస, ఆర్ధిక, సైనిక, యుద్ధ నేర షరతుల గురించి క్షుణ్ణంగా వెర్సైల్స్ సంధిలో పొందుపరచబడింది.

ప్రాదేశిక షరతులు

* జర్మనీ ఆధీనంలో ఉన్న ఆల్సేస్, లోరైన్ ప్రాంతాలు ఫ్రాన్స్ స్వాధీనం చేయబడ్డాయి.

* జర్మనీ ఆధీనంలోని మూపెన్, మాల్మడీ, మోరిస్ నెట్ ప్రాంతాలను బెల్జియం కి ఇవ్వబడ్డాయి.

* పోసెన్, పశ్చిమ ప్రష్యాలోని అధికభాగం, ఎగువ సైలీషియాలు పోలాండ్ కు ఇవ్వబడ్డాయి.

* ప్లెగ్ విష్ ఉత్తర ప్రాంతం డెన్మార్క్ కు ఇచ్చారు.

* పోలాండ్ స్వతంత్ర్య దేశంగా అవతరించింది. జర్మనీ, ఆస్ట్రియా, రష్యా ఆధీనంలోని పోలాండ్ ప్రాంతాలు తిరిగి పోలాండ్ కు ఇవ్వబడ్డాయి.

* పోలిస్ కారిడార్ పోలాండ్ స్వాధీనం చేయబడింది.

* డాన్జింగ్ నౌకాకేంద్ర జర్మనీ నుండి తీసుకుని నానాజాతి సమితి రక్షణలో ఉంచబడింది.

* బెల్జియం, పోలేండ్, జెకోస్లోవేకియా జాతీయ రాజ్యాలను జర్మనీ గుర్తించింది.

* చైనా, టర్కీ, ఈజిప్ట్, మొరాకో, బల్గేరియాల్లో జర్మనీ తన హక్కును కోల్పోయింది.

వలసలకు సంబంధించిన షరతులు

* జర్మనీ తన వలసలన్నింటినీ మిత్రరాజ్యాలకు ఇచ్చివేసింది. ఆ వలసలను ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జియం, జపాన్ దేశాలు ఆక్రమించుకున్నాయి.

 

ఆర్ధిక షరతులు

* యుద్ద సమయంలో జరిగిన నష్టాన్ని జర్మనీ భరిచాల్సిందిగా మిత్ర రాజ్యాలు తీర్మానించాయి.

జర్మనీ నష్టాన్ని భరించే పరిస్ధితిలో లేదు. అందువల్ల మిత్రరాజ్యాలు వస్తురూపంలో తమకు పరిహారం చెల్లించమని జర్మనీకి సంబంధించిన నౌకలను తీసుకున్నారు.

* జర్మనీ ఆధీనంలోని సార్ లోయపై పదిహేను సంవత్సరాలపాటూ ఫ్రాన్స్ కు అధికారాన్ని ఇవ్వడం జరిగింది.

* జర్మనీ లోని నదులన్నీ అంతర్జాతీయ నదులుగా ప్రకటించబడ్డాయి.

* జర్మన్ బొగ్గు, ఇనుప గనులను మిత్ర రాజ్యాలు ఉపయోగించుకుంటాయి.

సైనిక షరతులు

జర్మనీ సైనిక విధానమే మొదటి ప్రపంచయుద్దానికి మూలకారణమని భావించిన మిత్ర రాజ్యాలు జర్మనీ సైన్యాన్ని చిన్నాభిన్నం చేయాలనుకున్నాయి.

* జర్మనీ లో నిర్భంద సైనిక విధానం రద్దుచేయబడింది.

* జర్మనీ ఆయుధ కర్మాగారాలను మూసివేయించారు.

* జర్మనీ సైనిక, నౌక, వైమానిక దళాల సంఖ్యను తగ్గించారు.

* ఫ్రాన్స్ కి భరోసాకోసం రైన్ ప్రాంతంలో జర్మనీ ఏవిధమైన సైనిక కార్యకలాపాలు జరపొద్దు.

* జర్మనీ నౌకాశ్రయం హెలిగోల్యాండ్ ధ్వంసం చేయబడింది.

* జర్మనీ సబ్ మెరైన్లను కలిగి ఉండరాదు.

పై షరతులతో జర్మనీని పూర్తిగా నిర్వీర్యం చేసి రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ ను యుద్దనేరగాడిగా ప్రకటించి శిక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *