Write about Fascism in Italy Write a brief biographical notes about Mussolini

Write about Fascism in Italy

Write a brief biographical notes about Mussolini

Rise and Fall of Mussolini

ఇటలీలో ఫాసిజం గురించి వ్రాయండి?

రెండు ప్రపంచయుధ్ధాల మధ్య కాలంలో (1918-1939) ఐరోపా యుద్ధ నీడల్లో గడిపింది. పేరుకి యుధ్ధం ముగిసినా, వివిధ దేశాల మధ్య వేల సంఖ్యలు ఒప్పందాలు జరిగినా ప్రపంచ దేశాలు సుఖసంతోషాలతో లేవు. యుధ్ధంలో పాల్గొన్న దేశాలతో పాటూ తటస్ధ దేశాలపై కూడా యుధ్ధ ప్రభావం ముగిసింది. అంతర్జాతీయ శాంతికై ఏర్పడిన నానాజాతి సమితి కొన్ని అగ్ర రాజ్యాలను, రాచరికాలను మాత్రమే సంతృప్తి పరచగలిగింది. ఆ దేశాలు కూడా తీవ్ర ఆర్ధిక మహా సంక్షోభం నుండి బయటపడలేక పోయాయి. ప్రజలు అధికారంలో మార్పు కోరుకున్నారు. ఐరోపా అంతటా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉధ్యమాలు చేశారు. తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న ప్రజలు నియంతల పై నమ్మకం పెంచుకున్నారు.

 

పై పరిస్ధితుల్లో ఇటలీలో ముస్సోలినీ అనే నియంత ప్రజాధరణను పొందాడు. ముస్సోలినీ ప్రకారం “రాజ్యానికి మించి ఏదీ లేదు”. ఈ మాటల్లో వ్యక్తి స్వేచ్చకు స్దానం లేదు. రాజ్యానికి సేవచేయడమే వ్యక్తి జీవిత పరమార్ధం. రాజ్యమే సర్వస్వం. దానిని ప్రశ్నించరాదు. మతం, నైతికత, విధ్య వంటివన్నీ రాజ్యానికే సహాయకారిగా ఉంటాయి.

 

ఫాసిజం

ఫాసిజం అనే పదం ఫాసిస్ అనే రోమన్ పదం నుండి పుట్టింది. పాసిస్ అంటే అర్ధం కట్టెల మోపు.

ప్రాచీన రోమ్ లో న్యాయాధికారుల ముందువైపు కట్టెల మోపు, గొడ్డలి తీసుకువెళ్ళేవారు. కట్టెల మోపు ఐక్యతకు, గొడ్డలి అధికారానికి చిహ్నం. నియంతృత్వ ప్రభుత్వాలను ఫాసిస్ట్ ప్రభుత్వాలుగా వ్యవహరిస్తారు. ఇటలీలో ముస్సోలిని, జర్మని లో హిట్లర్ నాజీ ప్రభుత్వాలు ఈ కోవకే చెందుతాయి.

ఇటలీలోని గొప్పదేశభక్తులు అనేకులు మధ్యతరగతివారే. యువత కమ్యూనిజం ను అదుపుచేయాలని కూడా కోరుకున్నారు. బలప్రయోగం ద్వారా ఐనా కమ్యూనిజం ప్రభావం నుండి దేశాన్ని రక్షించాలనుకున్నారు.  ఇలాంటి భావాలు కలిగిన యువకులను పాసిస్టులు అని, నల్లచొక్కా దళం అని అన్నారు. వారు నల్లచొక్కాలు ధరించడం వల్ల వారిని నల్లచొక్కా ధళం అన్నారు. నల్లచొక్కా దళం స్వచ్చంద సైనిక దళం.

నల్లచొక్కా దళం మూడు సూత్రాలు

* రాజ్యం అత్యంత శక్తివంతంగా ఉండాలి.

* ప్రైవేటు ఆస్థి రక్షింపబడాలి.

* ప్రతిభావంతమైన విదేశీ విధానంతో ఇటలీని అంతర్జాతీయంగా బలమైన దేశంగా రూపొందించాలి.

బెనిటో ముస్సోలిని – ఫాసిజం

ఫాసిజం సిద్ధాంత కర్త బెనిటో ముస్సోసిని. సామ్యవాది అయిన ముస్సోలిని సైనిక సర్వీసును తప్పించుకోడానికి స్యిట్జర్లాండు వెళ్లి సామ్యవాద పత్రికలో పనిచేశాడు. అక్కడ కార్మిక సంఘాలను ఐక్యం చేసి అనేక నిరసన ప్రదర్శనలు చేయించాడు. స్విట్జర్లాండ్ ప్రభుత్వం చే బహిష్కరింపబడ్డాడు. ఆస్ట్రియాలో కూడా విప్లవ భావాలను ప్రచారం చేసి బహిష్కరించబడ్డాడు. ముస్సోలిని ఇటలీకి తిరిగి వచ్చి ‘అవాంటి’ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు.

 

మొదటి ప్రపంచ యుధ్ధం లో ఇటలీ పాల్గొనాలనే ముస్సోలినీ ఆలోచనకు సామ్యవాదులు వ్యతిరేకించడంతో ముస్సోలిని సామ్యవాద పార్టీని వదిలివేసాడు.

ముస్సోలిని ‘పోపోలో డి ఇటాలియా’ అనే పత్రికను స్ధాపించాడు.

మొదటి ప్రపంచానంతరం ఇటలీలో పేదరికం, నిరుధ్యోగం, నిరసన ప్రధర్శనలు అధికమవడంతో ముస్సోలిని ఫాసిస్ట్ అనే దేశభక్తి గ్రూపులను ఏర్పాటు చేశాడు.

1921 – ముస్సోలిని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై సైనిక నియంతృత్వం ఆవశ్యకత గురించి చర్చించడం మొదలుపెట్టాడు.

27 అక్టోబర్ 1922 అధికారంలో ఉన్న ప్రభుత్వం పడిపోవడంతో ఇటలీ రాజు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ ముస్సోలిని ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాడు.

31 అక్టోబర్ 1922 ముస్సోలిని దేశాధ్యక్షుడయ్యాడు. ఫాసిస్ట్ గ్రాండ్ కౌన్సిల్ చేతిలో అధికారాలు కేంద్రీకృతం అయ్యాయి. ప్రతిపక్ష పార్టీల్ని, పత్రికా స్వేచ్ఛను రద్దుచేశాడు.

 

ఇటలీ ప్రధానిగా ముస్సోలిని

నేపుల్స్, సిసిలీలలో దొంగలను అంతం చేశాడు.

కార్మికుల సాంఘిక, ఆర్ధిక స్ధితిగతులను మెరుగుపరచాడు.

విశ్వాసపాతృలనే ఉన్నత పదవుల్లో నియమించాడు.

ఎన్నికల విధానంలో మార్పుతెచ్చి మూడింట రెండువంతుల బలం ఫాసిస్టులకు ఉండేలా చర్యలు తీసుకున్నాడు.

ఫాసిస్ట్ న్యాయవాదులు మాత్రమే న్యాయవాద వృత్తిని కొనసాగించేలా చర్యలు తీసుకున్నాడు.

1924 ఎన్నికల్లో ఫాసిస్టులకు అధిక మెజార్టీ వచ్చింది.

ప్రజలకు స్వచ్చమైన పాలనను అందించడానికి కృషి చేశాడు.

రాజు నామమాత్రమయ్యాడు.

పోలిస్ శాఖకు పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి.

1926 అన్ని రాజకీయ పార్టీలు రధ్ధు చేయబడ్డాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేశాడు.

ఆర్ధిక, పారిశ్రామిక, రవాణా, విధ్యా రంగాల్లో అభివృధ్ధికి కృషి చేశాడు. నిర్భంద విధ్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు.

అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకున్నాడు.

సామాన్యుల అవసరాలకు తగిన సౌకర్యాలు కల్పించాడు. ఇటలీ ప్రజలు కూడా అధిక సంఖ్యలో ముస్సోలిని కి మధ్ధతు తెలిపారు.

ఇటలీ ఆర్ధిక వ్యవస్ధ

ముస్సోలిని అధికారం చేపట్టేనాటికి ఇటలీ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంది. నిరుధ్యోగం అధికంగా ఉంది.

ఉధ్యోగ కల్పనకు విద్యాసంస్ధలు, రోడ్లు, అతిధి గృహాలు, వంతెనలు వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేసి, నౌకాశ్రయ నిర్మాణాలు చేపట్టి ఉధ్యోగ అవకాశాలను పెంచాడు.

1926 నాటికి బడ్జెట్ లో సమతౌల్యత సాధించాడు.

విదేశీ ఋణాలును తీర్చేశాడు.

1930 అనంతరం ఉధ్యోగుల వేతనాలను తగ్గించాడు.

 

వ్యవసాయం

వ్యవసాయోత్పత్తులు పెంచడం ద్వారా విదేశాలపై ఆధారపడకుండా చేయాలనుకున్నాడు. గోధుమ, పత్తి, పొగాకు, బియ్యం, బార్లీ, మొక్కజొన్న పంటలను ప్రోత్సహించాడు. “గోధుమ కోసం యుద్దం” అనే పిలుపునిచ్చి గోధుమ ఉత్పత్తిని పెంచాడు. గోధుమను ఎక్కువగా పండించినవారికి బహుమతులనిచ్చాడు. వ్యవసాయ సహకార సంఘాలను ప్రోత్సహించి, వ్యవసాయ పరపతి బ్యాంకులను ఏర్పాటు చేసి, వ్యవసాయ విజ్ఞానాన్ని అందించాడు.  1933లో గోధుమ దిగుమతిని నిరత్సాహపరచడానికి దానిపై దిగుమతి సుంకం పెంచాడు. ఈ విధానం వల్ల వ్యవసాయోత్పత్తులు పెగిగి, విదేశామారక ద్రవ్యలోటు తగ్గిపోయింది.

 

పారిశ్రామికాభివృధ్ధి

ఇటలీ దేశ భూభాగంలో కొండలు గుట్టలతో నిండి ఉండి ఖనిజ సంపద చాలా తక్కువగా ఉంది. పారిశ్రామికంగా అభివృధ్ధి చెందడానికి వీలు లేదని గ్రహించి కొత్త పరిశ్రమలను స్ధాపించకుండా, అప్పటికే ఉన్నవాటిని విస్తరించాడు.

పారిశ్రామికవేత్తలకు దీర్ఘకాలిక ఋణాలను ప్రవేశపెట్టాడు.

బొగ్గు వనరులు లేకపోవడంతో జలవిధ్యుత్ పై దృష్ఠి సారించాడు.

రైళ్లు, నౌకలు, విమానాలు, మోటర్లు, ఇంజన్లు వంటివాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలను ప్రోత్సహించాడు.

నౌకా రంగంలో ఆధిక్యతను సాధించేందుకు నౌకలను తయారుచేసే కర్మాగారాలకు సబ్సిడీలు ఇచ్చాడు. బాల్కన్, టర్కీ, సోవియట్ యూనియన్, ఈజిప్ట్, ఇండియాలకు నౌకా రహదారి మార్గాలను ఏర్పరచాడు. ఇతర దేశాలకు కూడా యుద్ద నౌకలను తయారుచేసి ఇచ్చేవారు.

సిల్క్, రేయాన్ ఉత్పత్తులను అధికం చేసేందుకు ప్రోత్సాహకాలను అంధించాడు.

కార్మికుల పనిగంటను తగ్గించి, వేతనాల స్ధిరీకరణ చేశాడు.

ఈ విధంగా ముస్సోలినీ విధానం వల్ల ఇటలీ పారిశ్రామికంగా స్వయం సమృధ్ధిని సాధించింది.

వర్గపోరాటాన్ని నిరోధించాడానికి ముస్సోలిని జాతీయ పార్టీలు, పెట్టుబడిదారులు, కార్మికులు సభ్యులుగా ఉండే సిండికేట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశాడు. సిండికేట్లు పరిశ్రమలను పర్యవేక్షిస్తాయి. సమ్మెలను నిషేధించాడు.

 

విద్యావిధానం

14సంవత్సరాల లోపు వారందరికీ నిర్బంద ఉచిత విద్యను అందించాడు. చిన్నతనం నుండే విధ్యార్ధులకు ఫాసిస్ట్ సూత్రాలను నేర్పి 18సంవత్సరాలు వచ్చాక వారికి ఫాసిస్ట్ ప్రజా సైన్యంలో స్ధానం కల్పించాడు. దీన్నే ‘ఫాసిస్ట్ మిలిషియా’ అనేవారు.

 

పోప్ తో సంధి (లాటరిన్ ఒప్పందం)

చర్చి దేశాన్ని నాశనం చేసేందుకు కాకుండా తమ అదుపులో ఉండి దేశానికి మేలు చేయాలని భావించి ముస్సోలిని పోప్ తో లాటరిన్ ఒప్పందం చేసుకున్నాడు. స్కూళ్ళలో మత బోధన తప్పనిసరైంది. మతాధికారుల జీతాలను కూడా పెంచారు.

ప్రాచీన్ రోమ్ గౌరవాన్ని ముస్సోలిని తిరిగి సాధించాలనుకున్నాడు. దానికి ముస్సోలిని దురాక్రమణ విధానాన్ని అనుసరించాడు. ఫాసిస్ట్ లు యుద్దాన్ని దేశానికి ప్రతిష్టగా భావించారు.

వలసల విస్తరణకు ముస్సోలిని పూనుకున్నాడు.

ట్యునీషియా, కార్సికా దీవులను ఆక్రమించానికి ప్రయత్నం చేయడంతో ఫ్రాన్స్ తో సంబంధాలు చెడిపోయాయి.

ఇటలీ తూర్పు ఐరోపాపై తన దృష్ఠిని కేంద్రీకరించాడు.

ఇథియోపియా ఆక్రమణ ముస్సోలిని విజయాల్లో ముఖ్యమైనది.

1935లో అబిసీనియాను ఆక్రమించింది. దీనివల్ల జర్మనీకి కూడా దగ్గరైంది. ఫలితంగా రోమ్-బెర్లిన్ కూటమి ఏర్పాటైంది.

రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభంలో ఇటలీ జర్మనీ పక్షాన చేరి ఇంగ్లండ్, ఫ్రాన్స్ లపై యుధ్ధాన్ని ప్రకటించింది.

మొదట విజయాన్ని చవిచూసినా అనతికాలంలోనే ఇంగ్లండ్ ఇటలీని ఓడించడం ప్రారంభించింది. ఇటలీ మొదట తన వలసలను కోల్పోయింది. చివరిగా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ప్రజల్లో ముస్సోలిని పట్ల వ్యతిరేకత వచ్చింది. ముస్సోలని వ్యతిరేకులకు ప్రజల మధ్ధతు పెరిగింది. అనేకమార్లు ముస్సోలిని అరెస్టు చేయబడ్డా జర్మనీ ముస్సోలినీని రక్షించింది. చివరకు డోంగో అనే ప్రాంతంలో ఇటలీ దేశభక్తుల చేతిలో ముస్సోలిని హత్యగావించబ్డడాడు.

ముస్సోలినీ నియంతే అయినా ఆయన ప్రాజ్ఞనిరంకుశుడు. ఇటలీని ఎంతగాలో అభివృధ్ధి చేశాడు. ముస్సోలిని విదేశీ విధానమే అతని పతనానికి దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *