Write about 1905 and 1917 revolutions in Russia

1905 విప్లవం గూర్చి వ్రాయండి?

Write about 1905 and 1917 revolutions in Russia

1917లో సామ్యవాదవిప్లవానికి ముందు రష్యాలో రాజ్యాంగబద్ద ప్రభుత్వ నిర్మాణం కోసం ఒక విప్లవం 1905లో సంబవించింది. 1905విప్లవం ప్రజల చైతన్యానికి ప్రతీకగా నిలిచి 1917 విప్లవానికి సూచికగా పనిచేసింది.

1904-05 నాటికి రష్యా ప్రజల్లో మార్పు పట్ల గాఢమైన కాంక్ష వ్యక్తమైంది. దేశవ్యాప్త కార్మికాభివృధ్ధి జరగడం వల్ల రూపొందిన కార్మిక వర్గం నిర్లక్ష్యానికి గురై చైతన్య వంతమై తిరుగుబాటు చేసింది. ఈ తిరుగుబాటు మొదట 1903లో బాకూ చమురు గనుల్లో సమ్మె మొదలై ఇతర నగరాలకు విస్తరించింది.

వారికి కర్షకులు, విశ్వవిధ్యాలయ విధ్యార్ధులు తోడయ్యారు. చిన్న దేశమైన జపాన్ రష్యాను 1905లో ఓడించడంతో జార్ నిరంకుశత్వాన్ని అంతమొందించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే వాదన బలపడింది.

రక్తసిక్త ఆదివారం

22 జనవరి 1905న రెండు లక్షల మంది కార్మికులు వారి కుటుంబాలతో కలిసి జార్జిగేసన్ అనే మతాచార్యుని నాయకత్వంలో జార్ చక్రవర్తిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని జార్ రెండవ నికొలస్ కు వినతి పత్రం ఇచ్చారు. జార్ వినతి పత్రం స్వీకరించక సైన్యంతో వారిపై దాడికి పాల్పడ్డాడు. సైనికుల చేతిలో అనేకమంది కార్మికులూ, ప్రజలు మరణించారు. దీనినే రష్యన్లు బ్లడీ సండే గా పిలుస్తారు. దీనితో రష్యాలోని విద్యావంతులు, భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు కూడా ప్రజలకు మధ్ధతు పలికారు. దేశవ్యాప్త సమ్మెతో ఉత్పత్తులు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. జార్ తలవొగ్గి రాజ్యాంగబద్ద రాచరికానికి సమ్మతించాడు.

 

బులిఘన్ రాజ్యాంగం

30 అక్టోబర్ 1905న జార్ బులిఘన్ రాజ్యాంగం పేరిట పార్లమెంటరీ విధానాన్ని ప్రతిపాదించి, రైతుల పన్ను బకాయీలను రద్దుచేసి, కార్మికులు సంఘాలు పెట్టుకోడానికి సమ్మతించి, భావ ప్రకటనా స్వాతంత్ర్యాన్ని, మత స్వాతంత్ర్యాన్ని అంగీకరించాడు. కానీ జపాన్ తో యుద్దం అనంతరం రష్యా సైన్యం తిరిగి రావడంతో బలం పుంజుకున్న జార్ తిరిగి నిరంకుశ ధోరణిని అవలంబించాడు. డ్యూమా ఏర్పడినా జార్ దానికి వ్యతిరేకంగా ఉండి దానిని రద్దుచేశాడు. చివరికి డ్యూమాను తన అనుకూల వర్గంతో నింపి దానికి అనుమతిచ్చాడు.

 

మొదటి ప్రపంచయుద్దం

సెర్బియా తరపున రష్యా మొదటి ప్రపంచ యుద్దంలోకి దిగింది.  ఇంగ్లండ్ ఫ్రాన్స్ లు కూడా సెర్బియా పక్షం వహించాయి. టానెన్ బర్గ్ యుద్దంలో జర్మనీ చేతిలో రష్యా ఘోరపరాజయం పాలైంది. రష్యా సైనికులకు క్రమశిక్షణ, ఆహారం, దుస్తులు లేనందువల్ల రష్యా ఓడిపోయింది. జార్ ల ప్రతిష్ఠ మంటగలిసింది. ప్రభుత్వాధికారులు కొందరు జర్మనీకి సాయపడ్డారు. దనం అంతా యుద్దానికి ఖర్చై నిత్యావసరాల ధరలు పెరిగాయి. ప్రజల్లో, కార్మిక, కర్షక, సైనికుల్లో అసంతృప్తి తారాస్ధాయికి చేరింది.

 

మార్చి  1917 విప్లవం

1917 మార్చిలో విప్లవం మొదలైంది. పెట్రోగ్రాడ్ లో కార్మికులు సమ్మె చేసారు. మహిళలు మార్చి 8న  భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆహారపదార్దాలకోసం పోలీసులతో తలపడి రొట్టెల దుకాణాల లూటీ చేసారు. తిరుగుబాటుదార్లను అణచివేయడానికి నియమించిన కొసక్కులు అనే సైన్యం కూడా తిరుగుబాటుదార్లతో కలిసిపోయింది. పెట్రోగ్రాడ్ రష్యా విప్లవ ప్రధాన కేంద్రం అయింది. డ్యూమా జార్ ని పదవినుండి తొలగమని ఆదేశాలిచ్చింది. మార్చి 15న నికొలస్ పదవీత్యాగం చేశాడు. మార్చ్ 16న జార్జ్ ల్వవ్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *