Write about 1848 Revolution in French History

Write about 1848 Revolution in French History

1848 విప్లవం గూర్చి వ్రాయండి.

1830 విప్లవం తరువాత ప్రాన్స్ లో రాజ్యాంగయుత రాజరికం ఏర్పరచబడింది. డ్యూక్ ఆఫ్ ఆర్లియాన్స్ లూయీ పిలిప్ రాజుగా ఎన్నుకోబడ్డాడు. 1830 విప్లవ కాలంలో ప్రజలకు అనుకూలంగా వ్యవహరించిన లూయీ పిలిప్ ప్రజల అభీష్టానికి అనుగునంగా పరిపాలిస్తాడని ప్రజలు భావించారు. కానీ లూయీ పిలిప్ అతని ప్రధాన మంత్రి గ్విజాట్ ప్రభావంతో పాత నిరంకుశ పధ్దతులనే అనుసరించాడు. దీనికి తోడు విదేశీ వ్యవహారాల్లో అతని అసమర్ధత ప్రజలను ఇంకా కోపోధ్రికులను చేసింది. చివరికి 1848 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ లో తిరుగుబాటు చోటుచేసుకుంది.

1848 తిరుగుబాటుకు కారణాలు

జులై విప్లవం అనంతరం 1789 ఫ్రెంచ్ విప్లవంలో పాల్గొన్న నాయకుడు, కురువృద్ధుడు అయిన లఫాయెట్ అన్ని రాజకీయ పక్షాలను ఏకంచేశాడు. అతని సలహాల మేరకే ప్రాన్స్ లో రాజ్యాంగయుత రాజరికం ఏర్పరచబడి లూయీ పిలిప్ ను రాజుగా నియమించారు. లూయీ పిలిప్ 1814 చార్టర్ కు సవరణలు చేసి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచాడు. ఓటింగ్ నిబంధనలను కొంత సరళతరం చేశాడు. దీని వల్ల అంతకు ముందుకన్నా రెండింతల మంది ఓటింగ్ కు అర్హులయ్యారు. కానీ ఈ సవరణ ఏమాత్రం ప్రజలను సంతోషపెట్టలేదు. ఈ సవరణ వల్ల క్రొత్తగా కేవలం మద్య తరగతి ధనవంతులకే ఓటుహక్కు దక్కింది. రెండుకోట్ల ఎనభైలక్షల మంది ప్రజల్లో కేవలం రెండు లక్షలమందికే ఓటుహక్కు దక్కింది. చాంబర్ ఆప్ డిప్యూటీస్ లో ధనవంతులైన భూస్వామి వర్గం వారు మాత్రమే మెజార్టీ సాదించారు. సాధారణ ప్రజలకు కనీసం చాంబర్ ఎన్నికలో పాల్గొనే హక్కుకూడా లేదు. ధనికులు తమకు అనుకూలమైన శాసనాలను చేసుకున్నారు. రైతుకూలీలు, శ్రామికులు, చేతివృత్తులవారు వంటి వారి అబిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు.

సామ్యవాద భావ ఆవిర్బావం

ఫ్రాన్స్ ప్రజలలో సామ్యవాద భావాలు ప్రాచుర్యం పొందడం విప్లవానికి ఒక కారణం. పారిశ్రామికీకరణ వల్ల మంచి జరిగినా కొంత చెడుకూడా ఉంది. సమాజంలో పెట్టుబడిదారులు, కార్మికులు అనే వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు నానాటికి ధనవంతులవుతుండగా, యంత్రాల ద్వారా ఉత్తపత్తి చేపట్టడం వల్ల కార్మికులు నిరుద్యోగిత బారిన పడ్డారు. వారి పరిస్ధితి నానాటికీ దిగజారింది. హీనమైన పరిస్దితుల్లో పనిచేస్తూ పెట్టుబడిదారల దయాదాక్షణ్యాలపై ఆదారపడి కార్మికులు జీవించేవారు.

ఇదే సమయంలో రచయితలు, దేశభక్తులు, మేధావులు కార్మికుల ఆర్ధిక పరిస్దితిని మెరుగుపరచడానికి ప్రయత్నించారు. పరిశ్రమలు నడపడంలో, పెట్టుబడిదారుడు, శ్రామికుల మద్య కొత్త సిద్దాంతాలను ప్రతిపాదించారు. ఈ సిధ్దాంతాలన్నీ సామ్యవాదం మీద ఆదారపడినవే. సెయింట్ సైమన్, లూయీ బ్లాంక్ వంటి రచయితలు సామ్యవాద సిధ్ధాంతాల్ని సామాన్యజనంలోకి తీసుకువచ్చారు. శ్రామికులు ట్రేడ్ యూనియన్లు ఏర్పరచుకోవాలని సూచించారు.

సెయింట్ సైమన్ మొదటిసారిగా “రాజ్యం ఆధీనంలో పరిశ్రమలు ఉండాలని” సూచించాడు. “శక్తిని బట్టి పని, పనిని బట్టి వేతనం” అనికూడా సెయింట్ సైమన్ సూచించాడు.

సెయింట్ సైమన్ ఆలోచనా విధానాన్ని లూయీ బ్లాంక్ అనుసరించాడు. లూయీ పిలిప్ ఆర్ధిక విధానాన్ని తీవ్రంగా ఖండించాడు. పరిశ్రమలను శ్రామికులే నిర్వహించాలని కూడా లూయీ బ్లాంక్ అబిప్రాయపడ్డాడు. అతని అభిప్రాయం ప్రకారం ప్రతి మనిషికి ఉపాధిని కల్పించడం రాజ్యం కర్తవ్యం.

శ్రామికులు ట్రేడ్ యూనియన్లను ఏర్పరచుకొని కలసికట్టుగా తమ సమస్యలను యజమానులకు విన్నవించుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా నెమ్మదిగా కార్మికులు తమ సమస్యలగూర్చి పెట్టుబడిదారులను ఎదిరించడం మొదలుపెట్టారు. గ్విజాట్ ప్రభావం వల్ల లూయీ పిలిప్ పెట్టుబడిదారులకు అండగా నిలిచాడు. దీని ఫలితంగా శ్రామికులు, సామాన్య జనం ప్రభుత్వ వ్యతిరేకులుగా మారారు. జులైలో వచ్చిన రాచరికం స్ధానంలో తమ ఆభిలాషలకు అనుగుణంగా ఉండే క్రొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.

రిపబ్లికన్ నాయకుడు లామర్టీన్ “రాచరికం నిషేదించబడింది. గణతంత్రాన్ని ప్రకటిస్తున్నాము. ఇప్పడినుండి ప్రజలు తమ హక్కులను అనుభవిస్తారు”అని ప్రకటణ చేసాడు.

లూయీ పిలిప్ బలహీన స్ధితి

లూయీ పిలిప్ ను రాజుగా ఎన్నుకోడానికి చాంబర్ ఆప్ డిప్యూటీస్ సమావేశమైనప్పటినుండీ లూయీ పిలిప్ కు సరైన మద్దతులేదు. 430 సభ్యులలో 253 సభ్యులే సమావేశానికి హాజరయ్యారు. వారిలో కూడా 219 మంది మాత్రమే ఓటింగ్ పై ఆసక్తి చూపారు. ఎన్నిక అనంతరం కూడా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు లూయీ పిలిప్ కు వ్యతిరేకమయ్యాయి. దీని ఫలితంగా లూయీ పిలిప్ స్ధానం అస్థిరంగా మారింది. నెపోలియన్ బోనపార్టీ మేనల్లుడు లూయీ నెపోలియన్ ను రాజుగా చేయాలనే అభిప్రాయం తెరపైకి వచ్చింది. రిపబ్లికన్లు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు.

చరిత్రలో రెండవ రిపబ్లిక్

ఇరు పార్టీల నాయకులచే ఒక ఆపధ్ధర్మప్రభుత్వం ఏర్పరచబడింది. ప్రముఖ సామ్యవాద నాయకుడు లూయీ బ్లాంక్ సోషలిస్టులకు ప్రాతినిద్యం వహించాడు. రిపబ్లికన్ల నాయకుడు లామర్టీన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పరచబడింది. దీనిని ఫ్రాన్స్ చరిత్రలో రెండవ రిపబ్లిక్ గా పేర్కొంటారు.

ఆర్లియానిస్ట్ రాజవంశాన్ని కొనసాగించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విపలమయ్యాయి. రిపబ్లికన్ల నాయకత్వంలో సామాన్య ప్రజలు పార్లమెంట్ మీద దాడిచేసి డిప్యూటీలందరినీ చెదరగొట్టి ఆపధ్ధర్మప్రభుత్వాన్ని ఏర్పరచారు. ఈ పోరాటంలో సామ్యవాదులు వారికి సాయపడ్డారు. ముఖ్య ప్రభుత్వ భవనాలను సోషలిస్టులు ఆక్రమించుకున్నారు. సోషలిస్టుల నాయకుడు లూయీ బ్లాంక్ కి కొ్త్త ప్రభుత్వంలో స్ధానాన్నిచ్చారు. ఫ్రాన్స్ ఇప్పటినుండీ రిపబ్లిక్ దేశంగా ఉండబోతుందని చారిత్రాత్మక ప్రకటణ చేసారు. ఇదే చారిత్రాత్మక రెండవ రిపబ్లిక్.

రెండవ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం 1848లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోడానికి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. నెపోలియన్ బోనపార్టీ మేనల్లుడు లూయీ నెపోలియన్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీనివల్ల బోనపార్టీ వంశస్తుల ప్రాభవం పెరిగింది. అనతికాలంలోనే లూయీ నెపోలియన్ తన స్ధానాన్ని పదిలపరచుకున్నాడు. ఫ్రాన్స్ ప్రజలు కూడా అతన్ని తమ రాజుగా అంగీకరించారు. 2 డిసెంబర్ 1952న లూయీ నెపోలియన్ ను ప్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ విధంగా రెండో సామ్రాజ్య స్ధాపన జరిగింది. దీనివల్ల రెండవ రిపబ్లిక్ అనతికాలంలోనే అంతమైనట్లైంది.

రిపబ్లికన్ ప్రభుత్వ ఏర్పాటు, మూడవ నెపోలియన్ (లూయీ నెపోలియన్) ఉత్థానం 1848 విప్లవం యొక్క రెండు ముఖ్య ఫలితాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *