Second World War Reasons and Results

రెండవ ప్రపంచ యుధ్ధానికి కారణాలు వివరించండి?

రెండవ ప్రపంచ యుధ్ధానికి దారితీసిన పరిస్ధితులను వివరించండి?

Second World War Reasons and Results

What are the reasons for Second World War

మొదటి ప్రపంచ యుధ్ధకారణంగా గెలిచిన దేశాలు ఓడిన దేశాలు రెండూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. తీవ్ర ఆర్ధిక మాంధ్య పరిస్దితులు నెలకొని ప్రపంచ దేశాలన్నీ సతమతమయ్యాయి. ప్రపంచయుధ్దాలు మళ్ళీ జరగకూడదని ఏర్పరచిన నానాజాతి సమితి యుధ్ధంలో గెలిచిన దేశాల పక్షాన చేరి ఓడిన దేశాలను ఒప్పందాల పేరుతో దోచుకున్నాయి. ప్రపంచ యుధ్ధం అనంతరం జరిగిన సంధుల ప్రకారం జరిగిన పంపకాలలో ఇటలీకి తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తుండేది. జర్మనీ పై సైనిక ఆంక్షలు విధించి, పెధ్ధ మొత్తంలో యుధ్ధ నష్టపరిహారం చెల్లింపజేసి, జర్మనీ భూభాగాలను మిత్ర రాజ్యాలు ఆక్రమించాయి. జర్మనీ గనులున్న సార్ లోయను పేరుకు నానాజాతి సమితి తన ఆధీనంలో ఉంచుకున్నా దానిలోని గనులను ఫ్రాన్స్ వాడుకునేది. ఇలాంటి పరిస్ధితుల్లో నియంతలకు ప్రజాబలం పెరిగింది. ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లర్ ను ప్రజలు ఎన్నుకున్నారు. ఐరోపా దేశాల్లో జాతీయభిమానం పెరిగింది. ఇటలీ, జర్మనీ విషయంలో జాతీయభిమానం మితిమీరి రెండో ప్రపంచ యుధ్ధానికి దారితీసింది.

అవమానకరమైన వెర్సైల్స్ సంధి

మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిన జర్మనీ 500మిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. జర్మనీ అర్ధిక ఆయువుపట్టులుగా భావించే ప్రాంతాలను మిత్రరాజ్యాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, లగ్జెంబర్గ్ లకు తన బొగ్గు గనులను ఇవ్వాల్సివచ్చింది. జర్మనీ తక్కువ సైన్యాన్ని ఆయుధాల్ని కలిగివుండాలని షరతు విధించారు. మిత్రరాజ్యాల సైన్యం జర్మనీలో ఉండి జర్మనీని క్షీణింపజేసాయి. ఇలాంటి అవమానకరమైన పరిస్ధితినుండి జర్మనీ ఆత్మగౌరవాన్ని పెంపొందిచడానికి హిట్లర్ కృషి చేసాడు. ఈ చర్యలు రెండో ప్రపంచ యుధ్ధానికి దారితీసాయి.

 

నియంతృత్వ ప్రభుత్వాల ఆవిర్బావం

ఇటలీ మిత్రరాజ్యాల హామిల వల్ల మొదటి ప్రపంచయుధ్ధంలో పాల్గొంది. ఆరు లక్షల సైన్యాన్ని కోల్పోయింది. ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయింది. కానీ మిత్రరాజ్యాలు అగ్రరాజ్యాలలో ఒకటైన ఇటలీకి పంపకాల విషయంలో తీవ్ర అన్యాయం చేశాయి. 1922లో ఇటలీలో ముస్సోలిని నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ప్రాచీన రోమ్ వైభవాన్ని పునరుధ్ధరించాలని ముస్సోలిని భావించాడు. ఇటలీ ప్రజల ఆకాంక్ష కూడా అదే.

స్పెయిన్ లో రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ఫ్రాంకో నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఇటలీ సాయపడింది.

ముస్సోలిని ఫాసిస్ట్ భావాల్ని, హిట్లర్ నాజీ భావాల్ని స్కూలు దశనుండే పాఠ్యాంశాల్లో చేర్చి ప్రజల్లో విస్తృతంగా పాతుకుపోయేలా చేశారు.

మొదటి ప్రపంచ యుధ్ధానంతరం జర్మనీలో ఏర్పడిన రిపబ్లిక్ ప్రభుత్వం విపలమవడంతో చాకచక్యంగా హిట్లర్ తన నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు.

జర్మనీ అభివృధ్ధికి ఆటంకంగా నిలిచిన వెర్సైల్స్ సంధి, నానాజాతి సమితి, జెనీవా నిరాయుధీకరణ ఓప్పందాలను హిట్లర్ ఉల్లంఘించి సైనిక సంపత్తిని పెంచకుని తమ దేశం కోల్పోయిన ప్రాంతాలను తిరిగి సంపాధించాడానికి యుధ్ధాలు చేశాడు.

ప్రజాస్వామ్యం – నిరంకుశ రాజ్యాల మధ్య సంఘర్షణ

బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పాలనలో ఉండగా జర్మీ, ఇటలీ, జపాన్ దేశాల్లో నిరంకుశత్వం అమలులో ఉంది. నిరంకుశ వ్యవస్ధలో వ్యక్తికి ప్రాధాన్యం ఉండదు. నిరంకుశరాజ్యాల్లో  రాజ్యం అభివృద్దికి వ్యక్తి ఒక పనిముట్టుగానే పరిగణించబడతాడు. ప్రజాస్వామ్య దేశాలు రాజ్య విస్తరణను కాంక్షించవు. నిరంకుశ రాజ్యాలు రాజ్యవిస్తరణను కాంక్షించాయి.

జాతి వైశమ్యం

ఇటాలియన్లు గతించిన రోమ్ ఖ్యాతిని తిరిగి నిలబెట్టాలని కాంక్షించారు. జనాభాను వృధ్ధి పరుచుకోవడం ద్వారా సైన్యన్ని వృధ్ధిచేసుకోవాలని, కొత్త కాలనీలను ఆక్రమించుకొని ముడి సరుకులను సంపాధించాలని ఇటలీ జర్మనీలు భావించాయి. జర్మనీ తమది ఆర్య జాతి అని, తమ జాతి అత్యుత్తమమైనదని, తమ జాతే ప్రపంచాన్ని పాలించడానికి అర్హురాలని భావించింది. మితిమీరిన జాతీయ భావం జాతి విధ్వేషానికి దారితీసి చివరిగా రెండవ ప్రపంచయుధ్ధానికి కారణమైంది.

ఒప్పందాలు

నానాజాతి సమితి సభ్యదేశాలు ఇతర దేశాలతో సంధులు చేసుకోవడం నిషేధం. కానీ అనేక దేశాలు రహస్య, బహిరంగ సంధులు చేసుకున్నాయి.

ఇటలీ-జర్మనీలు దగ్గరయ్యాయి. కమ్యూనిజం భయంతో జపాన్ వాటికి తోడైంది. మూడు దేశాలు కలిసి రోమ్-బెర్లిన్-టోక్యో పక్షం ఏర్పడింది.

నానాజాతి సమితి వైఫల్యం

సుడెట్లాండ్ విషయంలో మిత్రదేశాలు జర్మనీ కోరిక ప్రకారం జర్మన్ లకు స్వయంప్రతిపత్తిని అంగీకరించాయి. సుడెట్లాండ్ యుగోస్లేవాకియా లో భాగం.

1930వ దశకంలో చాలా చిన్నదేశాలు నానాజాతి సమితి నుండి వైదొలగాయి.

జపాన్ మంచూరియా పై దాడిచేసిన సందర్భంలో చైనా నానాజాతి సమితికి పిర్యాదు చేసినా నానాజాతి సమితి ఏమీ చేయలేకపోయింది. ఇటలీ, జర్మనీ, జపాన్ లు నానాజాతి సమితి నుండి వైదొలగాయి.

సామ్రాజ్యవాదం

ఇటలీ, బ్రిటన్ మొదలైన దేశాలు పెధ్దదేశాలు, ఘనకీర్తి ఉన్న దేశాలైనా వాటికి వలసల ముడిసరుకుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విషయంలో బ్రిటన్, బెల్జియం, పోర్చుగల్, రష్యా, అమెరికాలు లాభపడ్డాయి. హిట్లర్ మధ్య ఐరోపాపై జర్మన్ ఆధిపత్యం కోరుకుంది. జపాన్ చైనా పై దండెత్తింది. ఇటలీ అబిసీనియా (ఇథియోపియా)ను ఆక్రమించుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మెడిటరేనియన్ పై ఆదిపత్యం ఇటలీ ఆకాంక్ష.

 

మిత్ర రాజ్యాల మధ్య విభేధాలు

జర్మనీ సైనిక, ఆయుధ బలాన్ని తగ్గించి తన సైనిక, ఆయుధ బలాన్ని మాత్రం ఫ్రాన్స్ పెంపొందించుకుంది. జర్మనీ విషయంలో వ్యాపార సంబంధాల దృష్ట్యా బ్రిటన్ సానుకూలంగా ఉంది. జర్మనీ కమ్యూనిజానికి వ్యతిరేకం. బ్రిటన్ కు తమ దేశంలో కమ్యూనిజం బలపడటం ఇష్టం లేదు. అందుకే కమ్యూనిజానికి వ్యతిరేకి అయిన జర్మనితో స్నేహం చేసింది. వెర్సైల్స్ సంధిని అమెరికా అంగీకరించనందున అమెరికా ఫ్రాన్స్ కు దూరమైంది. శాంతి కోరుకొనే దేశాలమధ్యే సఖ్యత లోపించింది.

 

తక్షణ కారణం

పోలిష్ కారిడార్ ను జర్మని ఏర్పరచింది. కానీ మిత్రరాజ్యాలు దాన్ని జర్మని నుండి స్వాధీనం చేసుకున్నాయి. హిట్లర్ అధికారంలోకి వచ్చాక జర్మని స్వతంత్ర రాజ్యంగా ఉన్న పోలండ్ పై 1 సెప్టెంబర్ 1939న దాడి చేసింది. వెంటనే పోలండ్ కు సాయంగా ఇంగ్లండ్ జర్మని పై యుధ్ధం ప్రకటించింది. దీనితో రెండవ ప్రపంచ యుధ్ధం మొదలైంది.

రెండవ ప్రపంచ యుధ్ధ ఫలితాలు వివరించండి?

రెండవ ప్రపంచ యుధ్ధం నిర్విరామంగా 1939 నుండి 1945వరకు ఆరు సంవత్సరాలపాటూ సుధీర్ఘంగా జరిగింది. ప్రపంచ చరిత్రలోనే ఇధి అత్యంత వినాశనకరమైన యుధ్ధం.

* మొదటి ప్రపంచ యుధ్ధంలో అగ్రరాజ్యాలు ఘోరపరాజయం పొందాయి.

* ప్రపంచాధిపత్యం ఇంగ్లండ్ చేతినుండి అమెరికా, రష్యాలకు మార్పిడి అయింది. బలహీన దేశాలకు రష్యా పెద్దన్నలా వ్యవహరించడం ప్రారంభమైంది. అమెరికా ప్రపంచ శాంతి స్ధాపకురాలిగా మారింది.

* పశ్చిమ ఐరోపా దేశాలతో పాటూ పాకిస్తాన్, ఈజిప్ట్, అరేబియా, ఆఫ్రికా దేశాలు అమెరికా ప్రభావానికి లోనయ్యాయి.

* తూర్పు ఐరోపా దేశాలు మరియు ఇండియా, బ్రిటన్ వల్ల బాధపడ్డ దేశాలు రష్యాకు దగ్గరయ్యాయి.

* ప్రపంచవ్యాప్తంగా ఈ యుధ్ధం మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.

* అధికారాల మార్పిడి భారీగా జరిగింది. యుధ్ధం వలన అన్ని దేశాలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయి, ప్రాణ నష్టం వంటి పలు సమస్యలను ఎదుర్కున్నాయి. తన అంతర్గత సమస్యలపై దృష్టిసారించడానికి సామ్రాజ్యవాద దేశాలు వలసలపై దృష్టి తగ్గించాయి. దీనివ్లల భారతదేశం, సిలోన్ (శ్రీలంక), బర్మా(మయన్మార్), ఈజిప్ట్ వంటి పలు దేశాలకు స్వాతంత్ర్యం లభించింది.

* దాదాపు 15మిలియన్ల మంది సైనికులు చనిపోయారు.

* జాతీయ ఆస్తుల నష్టం తీవ్రంగా జరిగింది. లక్షకోట్లకు పైగా ఆస్తుల నష్టం సంభవించింది. బ్రిటన్ రెండువేల కోట్ల ఆస్తులను నష్టపోయింది.

* ఆసియా ఖండంలో ఫ్రాన్స్, హాలండ్, పోర్చుగల్ దేశాల ప్రాభవం తగ్గింది. ఆదేశాలు ఆసియాను విడిచి వెళ్ళాల్సివచ్చింది.

* అమెరికా అన్నిటిని మించి అగ్రరాజ్యంగా అవతరించింది.

* అగ్ర రాజ్యాలుగా చలామణి అయిన జర్మనీ, ఇటలీ, జపాన్ ల ఓటమి వల్ల తూర్పు ఐరోపాలో రష్యా ప్రాభల్యం పెరిగింది. రష్యా ఇస్టోనియా, లిటేవియా, లిథుయేనియా లతో పాటూ, పోలండ్ మరియు ఫిన్లాండ్ లలో కొన్ని ప్రాంతాను పొందింది.

* పశ్చిమ ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలు అమెరికాతో రాజకీయ సంబంధాలను ఏర్పరచుకున్నాయి.

 

* రెండవ ప్రపంచ యుధ్ధం నేర్పిన పాఠాల వల్ల అంతర్జాతీయ భావం ఆవిర్భవించింది. ప్రపంచ దేశాలు పరస్పరం సహకారం చేసుకోవడం ప్రారంభించాయి. సమస్యల పరిష్కారానికి యుధ్ధం మార్గం కాదనే అభిప్రాయానికి వచ్చాయి.

* 1945లో అంతర్జాతీయ శాంతికోసం, పరస్పర సహకారం కోసం ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *