UNO how it was formed its organs and victories

UNO how it was formed its organs and victories

ఐఖ్య రాజ్య సమితి ఏవిధంగా ఏర్పడింది?

మొదటి ప్రపంచ యుధ్ధం వల్ల జరిగిన నష్టం నుండి నేర్చుకున్న పాఠాల వల్ల ఏర్పరచుకున్న నానాజాతి సమితి ప్రపంచ శాంతిని కాపాడటంలో విఫలమైంది. దాని సభ్యదేశాల స్వార్ధం వల్ల, ఓడిన దేశాలపై ఆంక్షలు విధించి వాటి వనరులను దోచుకోవాలని చేసిన ప్రయత్నాల వల్ల నానాజాతి సమితి తన లక్ష్యాన్ని సాధించలేక ఘోరంగా విఫలమైంది.

రెండవ ప్రపంచ యుధ్ధం ప్రారంభమైన తరువాత  14 ఆగస్టు 1941న అమెరికా సంయుక్త రాష్ఠ్రాల అధ్యక్షుడు రూజ్ వెల్ట్, బ్రిటన్ ప్రధాని చర్చిల్ న్యూఫౌండ్ ల్యాండ్ వద్ధ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమయ్యారు. రెండో ప్రపంచ యుధ్ధానంతరం ప్రపంచ గమనం ఎలా ఉండాలనే విషయం పై వారు చర్చించారు. ఆ చర్చల ఫలితమే 1942 అట్లాంటిక్ చార్టర్.

ఆ సమావేశంలో వారు ఈ క్రింది ముఖ్య విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అట్లాంటిక్ చార్టర్ లో ఎనమిది ముఖ్యవిషయాలు ఉన్నాయి.

* ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా రాజ్యాల సరిహద్దులలో మార్పులు చేయరాదు.

* ఏ రకమైన పరిపాలనను ప్రజలకు అందిచాలనే విషయంలో ప్రతి దేశానికి హక్కువుంది.

* అన్ని రాజ్యాలకు సార్వభౌమాధికారాన్ని ఇవ్వాలి.

* విదేశీ దాడుల భయం లేకుండా ప్రజలు తమ రాజ్య సరిహద్దుల్లో ప్రశాంతంగా జీవించాలి.

* యుధ్ధంలో గెలిచిన దేశాలు తమ స్వార్ధ ప్రయోజనాలకై ఇతర దేశాల వనరులను వాడుకోరాదు.

* ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా ముడి సరుకులను సమకూర్చుకునే అధికారం అన్నిదేశాలకు ఉంది.

* సముద్ర జలాల్లో ప్రయాణించే హక్కు అన్ని దేశాలకు ఉంది.

* బలప్రయోగానికి తావు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి.

 

ప్రారంభంలో ఇరవై దేశాలు పై విషయాలను అంగీకరించి 2 జనవరి 1942న ఒప్పందంపై సంతకం చేశాయి. ఇదే అట్లాంటిక్ చార్టర్ ప్రపంచ శాంతిని కాపాడటానికి యుధ్ధానంతరం ఒక అంతర్జాతీయ సంస్ధను ఏర్పరచాలని నిర్ణయించింది.

1943 నవంబర్ లో నాలుగు పెధ్ధ దేశాల (అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్) విదేశీ మంత్రులు మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వీలైనంత త్వరగా అంతర్జాతీయ శాంతి సంస్ధలు ఏర్పరచాలని నిర్ణయించారు.

 

1944 అక్టోబర్ లో వాషింగ్టన్ లోని డంబర్టన్ ఓక్ లో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ దేశాల ప్రతినిధులు సమావేశమై అంతర్జాతీయ శాంతి సంఘం గురించి ప్రణాళికను ఇతర దేశాల ముందుంచారు.

1945 ఏప్రిల్ లో సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో జరిగిన సుధీర్ఘ చర్చల అనంతరం 48 దేశాలు అంతర్జాతీయ శాంతి సంఘం ప్రణాళికను ఆమోదించాయి. ఆవిధంగా 24 అక్టోబర్ 1945లో ఐఖ్య రాజ్య సమితి ఏర్పడింది.

ఐఖ్యరాజ్య సమితి అంగాల గురించి వ్రాయండి?

ప్రపంచ శాంతిని కాపాడటానికి, ప్రపంచ దేశాల ప్రజలు జాతి, కుల, మత విభేధాలు లేకుండా ప్రాధమిక హక్కులను అనుభవిస్తూ సుఖశాంతులతో జీవించాలని, ఒక దేశం మరో దేశం అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకుండా నివారించడానికి, అంతర్జాతీయ తగాధాలను శాంతియుతంగా పరిష్కరించుకోడానికి, అంతర్జాతీయ సహకారం కోసం ఐఖ్యరాజ్యా సమితి ఏర్పరచబడింది.  ఐఖ్యరాజ్య సమితి లక్ష్యాలను దాని ప్రవేశికలో విపులంగా వివరించారు.

ఐఖ్యరాజ్య సమితి అంగాలు

ఐఖ్య రాజ్య సమితిలో ఆరు ప్రధాన అంగాలు ఉన్నాయి.

 1. జనరల్ అసెంబ్లీ
 2. భధ్రతా మండలి
 3. సాంఘిక ఆర్ధిక మండలి
 4. ట్రస్టీషిప్ కౌన్సిల్
 5. అంతర్జాతీయ న్యాయస్ధానం
 6. సచివాలయం

 

 1. జనరల్ అసెంబ్లీ

నేటికి దీనిలో 193 సభ్యదేశాలు ఉన్నాయి. దీనిని ప్రపంచ దేశాల పార్లమెంట్ గా వ్యవహరిస్తారు. ప్రతి దేశం నుండి ఐదుగురు ప్రతినిధులు ఉంటారు. కానీ ఓటు మాత్రం ఒకటే ఉంటుంది. జఠిలమైన విషయాలపై నిర్ణయానికి 2/3 వంతు మెజార్టీ అవసరం. జనరల్ అసెంబ్లీ నిర్ణయాలను తీసుకోలేదు. ఇది సెక్యూరిటీ కౌన్సిల్ (భద్రతా మండలి)కు నివేదనలు మాత్రం పంపగలుగుతుంది.

 1. భధ్రతా మండలి

భధ్రతా మండలి ఐఖ్యరాజ్య సమితి ప్రధాన కార్యనిర్వహక సంస్ధ. రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దీనిలో శాశ్వత సభ్యదేశాలు. శాశ్వత సభ్య దేశాలకు వీటో పవర్ ఉంటుంది. ఐఖ్యరాజ్య సమితి ప్రధాన అంగం భధ్రతా మండలి. అంతర్జాతీయ శాంతి గుంరించి భధ్రతా మండలి పాటుపడుతుంది. ప్రపంచ శాంతికి భంగం కలిగించే దేశాలపై భధ్రతా మండలి సైనిక చర్య తీసుకోగలదు లేదా దౌత్యపరమైన, ఆర్ధిక నిబంధనలతో సరిపెట్టవచ్చు.

 1. సాంఘిక ఆర్ధిక మండలి

ప్రస్తుతం (2018)దీనిలో 54 సభ్యదేశాలు ఉన్నాయి. జనరల్ అసెంబ్లీ చేత దీని సభ్యులు ఎన్నుకోబడతారు. జనరల్ అసెంబ్లీ సూచనల ప్రకారం నడుచుకుంటూ, దానికి భాధ్యత వహిస్తుంది. ప్రజల జీవన స్ధాయిని, విధ్య, సాంస్కృతిక స్ధాయిని మెరుగుపరచడం దీని లక్ష్యం. యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంఘం,   U.N.R.R.A.,  ప్రపంచ ఆరోగ్య సంఘ వంటివాటి ద్వారా సాంఘిక ఆర్ధిక మండలి పనిచేస్తుంది.

 1. ట్రస్టీషిప్ కౌన్సిల్

యుధ్ధం అనంతరం స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు, నానాజాతి సమితి ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతాలు, స్వచ్చందంగా ఐఖ్యరాజ్య సమితి రక్షణలో ఉంచబడిన ప్రాంతాల పరిపాలనను ట్రస్టీషిప్ కౌన్సిల్ చూస్తుంది.

భధ్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలు, జనరల్ అసెంబ్లీ చే ఎన్నుకోబడిన దేశాలు దీని కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయి.

 1. అంతర్జాతీయ న్యాయస్ధానం

అంతర్జాతీయ న్యాయస్ధానం నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉంది. ఇది న్యాయపరమైన భాధ్యతలను నిర్వర్తిస్తుంది. దీనిలో జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్ చే నియమించబడిన 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వారి పదవి కాలం 9సంవత్సరాలు.

దేశాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరిస్తుంది. జనరల్ అసెంబ్లీకి, భధ్రతా మండలికి న్యాయపరమైన సలహాలనిస్తుంది.

 1. సచివాలయం

ఐఖ్యరాజ్య సమితి అధికారులు దీనిలో భాగంగా ఉంటారు. సచివాలయం అదికారి సెక్రటరీ జనరల్. సెక్యూరిటీ కౌన్సిల్ సలహాపై జనరల్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ను నియమిస్తుంది.

సచివాలయం అన్ని ఐఖ్యారాజ్య సమితి అంగాలకు సహాయకారిగా ఉంటుంది.

సెక్రటరీ జనరల్ ఐఖ్యరాజ్య సమితి సంవత్సర రిపోర్టును తయారుచేసి జనరల్ అసెంబ్లీ ముందు ప్రవేశపెడుతుంది.

ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఏ విషయాన్నైనా సచివాలయం భధ్రతా మండలి దృష్టికి తీసుకురావచ్చు.

ఐఖ్యరాజ్య సమితి విజయాలను తెలపండి?

ఐఖ్యరాజ్య సమితి ప్రారంభం నుండి వివిధ దేశాల మధ్య తలెత్తిన పలు అంతర్జాతీయ సమస్యలను పరిష్కరిస్తూ వచ్చింది. సెక్యూరిటీ కౌన్సిల్ దేశాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో తన వీటో అధికారాన్ని తరచూ వాడి రష్యా పలు సందర్భాలలో అడ్డుతగిలింది.

1 జనవరి 1946న ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో రష్యా తలదూరుస్తున్న విషయాన్ని ఇరాన్ ఐఖ్యరాజ్యసమితి దృష్టితి తీసుకువచ్చింది. మొదట రష్యా ఈ ఆరోపణ ను నిరాకరించింది. ఈ ఆరోపణకు వ్యతిరేకంగా భధ్రత మండలి నుండి విరమించుకుంది. అయినా భధ్రత మండలి రష్యా పై వత్తిడి తేవడంతో రష్యా ఎన్నో ఏళ్ళుగా ఇరాన్ లో ఉంచిన తన సైన్యాన్ని  ఉపసంహరించుకుంది.

ఇది ఐఖ్యరాజ్య సమితి మొదటి విజయం.

 

సిరియా లెబనాన్ సమస్య

సిరియా లెబనాన్ దేశాలలోని బ్రిటీష్, ఫ్రాన్స్ సైన్యాలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ దేశాలు ఐఖ్యరాజ్య సమితిని సంప్రదించాయి. ఐఖ్యరాజ్య సమితి నియమాల ప్రకారం ప్రతిదేశం సార్వభౌమత్వాన్ని కలిగి ఉంటుంది. ఇతర దేశాలు తమ దేశంలో సైన్యాల్ని ఉంచడం తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తుందని సిరియా, లెబనాన్ లు ఐఖ్యరాజ్య సమితికి వివరించాయి. ఐఖ్యరాజ్య సమితి గట్టి ప్రయత్నాల అనంతరం బ్రిటన్, ఫ్రాన్స్ సైన్యాలను ఆ దేశాలనుండి ఉపసంహరింపజేసింది.

 

ఇండోనేషియా సమస్య

ఇండోనేషియా జాతీయవాదులచే ఇండోనేషియాలో రిపబ్లికన్ ప్రభుత్వం ఏర్పరచబడింది. కానీ జావా, మదుర, సుమత్ర దీవుల్లో ఉండే డచ్ వారు దానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసారు. డచ్ ప్రభుత్వం ఆ పోరాటానికి మధ్ధతిచ్చింది. 1947లో ఇండోనేషియా తమ సమస్యని ఐఖ్య రాజ్య సమితికి నివేధించింది. మొదట డచ్ ఐ.రా.స. సలహాను అంగీకరించినట్లు నటిస్తూనే యుద్దాన్ని కొనసాగించింది. చివరికి హేగ్ లో జరిగిన సమావేశం అనంతరం డచ్ తన సైన్యాన్ని ఇండోనేషియా నుండి విరమించుకుంది.

 

పాలస్తీనా సమస్య

మాండేట్ విధానం ప్రకారం మొదటి ప్రపంచ యుధ్ధం తరువాత పాలస్తీనా బ్రిటన్ ఆదీనంలో ఉంచబడింది. కానీ యూదులు, ఆరబ్ లు పాలస్తీనా కోసం పోరాడారు. రెండో ప్రపంచయుద్దం తరువాత ఈ పోరాటం తీవ్రరూపం దాల్చింది. బ్రిటన్ మాండేట్ విధానం ప్రకారం పాలస్తీనాను తన ఆధీనంలో ఉంచుకోడానికి నిరాసక్తత వ్యక్తపరచింది. ఐఖ్యరాజ్య సమితి పరిస్ధితిని అధ్యయనం చేసి పరిష్కారం చూపడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచన మేరకు పాలస్తీనా అరబ్ రాజ్యం, యూదు రాజ్యం, జెరూసలేం అనే మూడు భాగాలుగా విభజింపబడింది. జెరూసలేం ఐఖ్యరాజ్య సమితి ట్రస్టీషిప్ ద్వారా పాలించబడింది. 1948లో ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పరస్తూ డాక్టర్ చైమ్ విజ్ మాన్ ను దానికి అధ్యక్షుడిగా నియమించారు. అరబ్ లు ఈ ఏర్పాటును వ్యతిరేకించారు. సమస్యను పరిష్కరించడానికి అగ్రదేశాల సూచన ప్రకారం ఎఫ్. బెర్నాండొట్ ను రెండు దేశాలతో చర్చించి సమస్యను పరిష్కరించాడు.

 

కాశ్మీర్ సమస్య

భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య తలెత్తింది. దీనితో రెండు దేశాలు శత్రువులుగా మారాయి. ఐఖ్యరాజ్య సమితి జోక్యంతో ఇరుదేశాల మధ్య యుధ్ధం నివారించబడింది.

 

కొరియా సమస్య

రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి ముందు కొరియా జపాన్ ఆధీనంలో ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన అనంతరం రష్యా ఉత్తర కొరియాను, అమెరికా దక్షిణ కొరియాను తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. 38వ ప్యారలల్ ను విభజన రేఖ గా ఇరుదేశాలు అంగీకరించాయి. కొరియా పై జపాన్ ప్రభావాన్ని తగ్గించడానికి 1945లో పలుదేశాల విదేశాంగ మంత్రులు మాస్కోలో సమావేశమయ్యారు. కొరియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే సూచనను రష్యా ప్రభావంతో ఉత్తర కొరియా కమ్యూనిస్టులు తిరస్కరించారు. ఒక కమిటీని ఏర్పరచి దక్షిణ కొరియాలో మాత్రం రాజ్యాంగయుత ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగారు. ఇరుదేశాలు రెండో దేశాన్ని లొంగదీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాయి. ఉత్తర కొరియా దక్షిణ కొరియా పై దాడిచేసింది. చైనా ఉత్తర కొరియాకు సాయంగా నిలిచింది. ఐఖ్య రాజ్య సమితి జోక్యంతో ఇరుదేశాల మధ్య యుధ్ధం నివారించబడింది.

 

పై విజయాల మూలంగా ఐఖ్యరాజ్య సమితి నానాజాతి సమితికన్నా మెరుగ్గా పనిచేసిందని అర్ధం అవుతుంది. నానాజాతి సమితి కాలంలో తీసుకున్న నిర్ణయాలలో అగ్రరాజ్యాల స్వార్ధం ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఐఖ్యరాజ్య సమితి తన నిర్ణయాల్లో అగ్రదేశాల స్వార్దాన్ని పక్కన పెట్టి పూర్తిగా యుద్దనివారణ, శాంతి స్ధాపన పైనే దృష్టి సారించింది. ఈ విధంగా ఐఖ్య రాజ్య సమితి నానాజాతి సమితికన్నా ఉన్నతంగా పనితీరును కనబరుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *