Unification of Italy Mazzini Garibaldi Count Cavour Victor Immanuel contribution to Unification of Italy

Unification of Italy

Mazzini, Garibaldi, Count Cavour and Victor Immanuel contribution to Unification of Italy

ఇటలీ ఏకీకరణ గురించి వ్రాయండి?

1815కు ముందు ఇటలీలో రాజకీయ పరిస్థితి

ఎనమిదవ శతాబ్ధంలో ఇటలీ రోమ్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. రోమన్ సామ్రాజ్య ప్రాభవం క్షీణించడంతో ఇటలీ చాలా చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 15వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం మద్య ఆస్ట్రియా, ప్రాన్స్ మరియు ఇతర రాజ్యాలు ఇటలీకి సంబంధించిన భూభాగాలపై తమ అధికారాన్ని స్ధాపించాలని ప్రయత్నాలు చేశారు. నెపోలియన్ బోనపార్టీ పద్దెనిమిదో శతాభ్ధి చివరి దశకంలో ఇటలీ ఉత్తర భాగాల్ని ఆక్రమించి వాటిలో రిపబ్లికన్ ప్రభుత్వాలను ఏర్పరచాడు. నెపోలియన్ ప్రాన్స్ చక్రవర్తి అయిన అనంతరం పోప్ రాజ్యాన్ని, ఇటలీ భాగాల్ని ఇటలీ లో కలిపాడు. ఈ విధంగా ఇటలీ అనే భావన రావడానికి నెపోలియన్ కారణమయ్యాడు. తనకు తెలియకుండానే ఇటలీ జాతీయత అనే భావనకు నెపోలియన్ కారణమయ్యాడు. నెపోలియన్ ఇటాలియన్ భూభాగాల్లో నెపోలియన్ కోడ్ ను ప్రవేశపెట్టాడు. భూస్వాములుకు ప్రత్యేక సౌకర్యాలను నిషేధించాడు. వారిపై కూడా పన్నులను విధించాడు. సామాన్య జనానికి వాక్ స్వాతంత్ర్య హక్కును ప్రసాధించాడు. చర్చికు బదులుగా రాజ్యం ప్రజలను విద్యావంతులను చేసే భాద్యత తీసుకుంది. ఈ విధంగా నెపోలియన్ ఇటాలియన్ జాతీయ, రాజకీయ ఏకత్వానికి తోడ్పడ్డాడు.

వియన్నా ఒప్పందం – ఇటలీ

వాటర్లూ యుద్దంలో నెపోలియన్ బోనపార్టీ ఓడిపోయిన అనంతరం ఇటలీ భౌగోళిక రాజకీయ పరిస్ధితుల్లో చాలా మార్పులు సంభవించాయి. వియన్నా కాంగ్రెస్ లో 1789కి ముందు ఉన్నట్లుగా ఇటలీని విభజించి పంచుకోవాలని నిర్ణయించారు. నెపోలియన్ ఏకం చేసిన ఇటలీ భూభాగాలన్నింటిని విభజించి ఇటలీని ఎనిమిది చిన్నచిన్న రాజ్యాలుగా విభజించారు. పిడమాంట్, లొంబార్డీ, వెనీషియా, పార్మా, మొడెనా, టస్కనీ, పాపల్ రాజ్యాలు, నేపుల్స్ అనబడే ఎనమిది భాగాలుగా ఇటలీ విభజించబడింది. వంశపారంపర్య హక్కు ప్రకారం చాలా ప్రాంతాలకు పాత రాజవంశాల వారి వారసులు రాజులయ్యారు. లొంబార్డీ, వెనీషియా ఆస్ట్రియాకు ఇవ్వబడ్డాయి. మొడెనా, పార్మా, టస్కనీ లు నిరంకుశ ఆస్ట్రియన్ రాకుమారులకు ఇవ్వబడ్డాయి. ఈ విధంగా ఇటలీ మెటర్నిక్ విధానానికి బలైంది. తిరిగి రాజులుగా ప్రకటించబడ్డ అందరు రాజులు నిరంకుశత్వ బాటనే ఎంచుకున్నారు.

“కొన్ని చెక్కముక్కల కుప్ప ఏరకంగా అయితే పడవగా పేర్కొనబడదో, అదే విధంగా ఇప్పుడు ఇటలీని ఒక జాతిగా పేర్కొనలేము” అన్న మెటర్నిక్ మాటల్లో ఇటలీ పట్ల అతని ఉధ్ధేశ్యం మనకు అర్ధం అవుతుంది.

ఇటలీ మరోసారి చిన్న రాష్ట్రాల సముదాయంగా మారిపోయింది. ఇటలీకి సంబంధించిన ఎక్కువ ప్రాంతాలు ఆస్ట్రియా ఆధీనంలో ఉన్నాయి.

నిరంకుశ రాచరికం

పాత రాజవంశాల వారసులకు తిరిగి రాజ్యాలను ఇవ్వడంతో వారు రాజ్యాంగాన్ని నిషేధించారు. నెపోలియన్ ప్రవేశపెట్టిన సంస్కరణలన్నింటిని నిషేధించి తిరిగి నిరంకుశ పాలనను సాగించారు. నేపుల్స్ రాజు విపరీతమైన అభివృద్ధి నిరోదకుడు. నెపోలియన్ బోనపార్టీ కొన్న గృహోపకరణాలు, వస్తువులన్నింటిని ధ్వంసం చేశాడు. నెపోలియన్ వేయించిన రోడ్లు, ఆఖిరికి నెపోలియన్ ప్రవేశపెట్టాడన్న కారణంతో టీకాలను కూడా నిషేధించాడు. పిడమాంట్ రాజు కూడా అభివృద్ది నిరోధకుడిగా వ్యవహరించాడు. నెపోలియన్ ప్రవేశపెట్టిన గ్యాస్ లైట్లను కూడా నిషేధించాడు.

నెపోలియన్ కాలంలో అభివృధ్ధి చెందిన జాతీయతా భావాల్ని రూపుమాపడానికి రాజులు అభివృద్ది నిరోధకులుగా వ్యవహరించారు. రాజులు నిరంకుశత్వం జాతీయతా భావాన్ని ఇంకా పెంపొందించింది.

కార్బోనారి స్ధాపన

ఇటలీ ఏకీకరణ కోసం రహస్య సంఘాలు స్ధాపించబడ్డాయి. అలాంటి సంస్ధల్లో ప్రముఖమైనది కార్బోనారి. పరాయి పాలన నుండి ఇటలీని విముక్తం చేసి, రాజ్యాంగయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కార్బోనారీ లక్ష్యం. అన్ని వర్గాల ప్రజలు సభ్యులుగా ఉండటమే కార్బోనారీ ప్రత్యేకత. కార్బోనారీ శాఖలు ఇటలీ అంతటా స్ధాపించబడ్డాయి.

1820 తిరుగుబాట్లు

1820లో స్పెయిన్ లో ఏడవ ఫెర్డినాండ్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఇటాలియన్ దేశభక్తులు కూడా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి తిరుగుబాటు నేపుల్స్ లో జరిగింది. ప్రజలు ఉదారమైన 1812 రాజ్యాంగాన్ని పునరుద్దరించాలని కోరారు. పిడమాంట్ ప్రజలు కూడా తిరుగుబాటు బాట పట్టారు. మెటర్నిక్ ఈ మార్పుల పట్ల ఏమాత్రం సముఖంగా లేడు. వెంటనే మిత్రరాజ్యాల సమావేశాన్ని లైబాక్ వద్ద ఏర్పాటు చేసాడు. బ్రిటన్ వ్యతిరేకించినా తిరుగుబాటును సైన్యంతో అణచివేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రియన్ సైన్యం మొదట నేపుల్స్ లో అనంతరం పిడమాంట్ లో విప్లవాన్ని అణచివేసింది. ఈ రెండు తిరుగుబాట్ల నాయకత్వం కార్బొనారి ఆద్వర్యంలో జరిగింది.

మాజినీ

మాజినీ ఇటలీ గొప్పనాయకుల్లో ఒకరు. తన జీవతంలో ప్రతివిషయాన్ని ఇటలీ ఏకీకరణ నిమిత్తం మాజినీ త్యాగం చేశాడు. మాజినీ ని ఇటలీ ఆత్మగా పేర్కొంటారు.

తన జీవతంలో ప్రతివిషయాన్ని ఇటలీ ఏకీకరణ నిమిత్తం మాజినీ త్యాగం చేశాడు. మాజినీ ని ఇటలీ ఆత్మగా పేర్కొంటారు.

ఆ కాలంలో కార్బొనారీ మాత్రమే ఏకైన రహస్య విప్లవ సంఘం. చిన్న వయసులోనే కార్బొనారీ లో సభ్యుడిగా చేరి తన తిరుగుబాటు మనస్తత్వం వల్ల అనతి కాలంలోనే అరెస్టు చేయబడ్డాడు. జైల్లో ఉండికూడా విప్లవ భావాల్ని ఉత్తరాల ద్వారా, పాంప్లెట్ల ద్వారా ఇతరులతో పంచుకొనేవాడు. కొంత కాలానికి కార్భొనారికి ఒక ఖచ్చితమైన దిశానిర్ధేశం లేదని తెలుసుకున్నాడు.

మాజినీ ఇటలీని ఏకీకృతం చేసి బలమైన రిపబ్లికన్ సమాఖ్యను ఏర్పాటుచేయాలనుకున్నాడు. విప్లవ కార్యక్రమాల వల్ల మాజినీ ని ఇటలీ నుండి బహిష్కరించడంతో నలభై సంవత్సరాలు వివిధ దేశాలు తిరిగాడు. ఫ్రాన్స్ లో జులై విప్లవం విజయవంతం అవడంతో ఇటలీలో కూడా నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. పార్మా, మొడెనా, టస్కనీ, పాపల్ రాష్ట్రాల రాజులు రాజ్యం విడిచి పారిపోయినా ఆస్ట్రియా జోక్యంతో తిరిగి రాచరికాన్ని చేపట్టారు. మెటర్నిక్ సూచనల ప్రకారం తిరుగుబాటుదారుల్ని చాలా క్రూరంగా అణచివేసారు. విప్లవంలో పాల్గొన్న మాజిని ని దేశ బహిష్కరణ చేసి ఫ్రాన్స్ కు పంపించారు.

తిరుగుబాటు అణచివేత మాజినీని తీవ్రంగా కలచివేసింది. కార్బొనారీ పని విదానం నచ్చని మాజినీ అంతకంటే ఎక్కువ నిబద్దతతో పనిచేసే సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇటలీ యువకులతో ‘యంగ్ ఇటలీ’  అనే సంఘాన్ని స్ధాపించాడు. భౌగోళికంగా, రాజకీయంగా విడగొట్టబడినా సాంస్కృతిక పరమైన ఏకత్వం వల్ల ఇటాలియన్లందరికీ తమ జాతిపట్ల ఏకీకృత భావం ఉండేది.

1848కి ముందు ఇటలీ జాతీయవాదుల్లో ఐక్యత లేదు. ఎజెలియో అనే ఇటాలియన్ దేశభక్తుడు రాచరికానికి, విప్లవానికి కూడా వ్యతిరేకి. ఆయన రిపబ్లికన్ ప్రభుత్వ ఏర్పాటును ఆకాంక్షించేవాడు.

రోమన్ కాథలిక్ లు పోప్ ఆద్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆంకాంక్షించేవారు.

ఫ్రాన్స్ లో 1848 విప్లవానికి ముందే ఇటలీకి సంబంధించిన నేపుల్స్, టస్కనీ, పిడమాంట్, రోమ్ రాజ్యాల్లోని రాజులు ప్రజలకు అనుకూలమైన రాజ్యాంగాన్ని విడుదల చేశారు. 1846లోనే రోమ్ కి రాజైన తొమ్మిదవ పోప్ పయస్ చాలా ఉదారమైన రాజకీయ ఆలోచనలు కలిగి ప్రజారంజకంగా పాలించేవాడు. 1848విప్లవం తరువాత మెటర్నిక్ ప్రాభవం పూర్తిగా క్షీణించింది. ప్రజలు వివిధ ప్రాంతాల రాజులందరూ ఏకమై అస్ట్రియా సైన్యాన్ని, ఆస్ట్రియా ప్రభావాన్ని తమ దేశం నుండి తొలంగించాలని రాజులకు సూచించారు.

అస్ట్రియాకు వ్యతిరేకంగా జరిగిన యుద్దంలో చార్లెస్ ఆల్బర్ట్ మాత్రమే చివరివరకూ పోరాడాడు. మిగతా ఇటాలియన్ రాజులు మద్యలోనే విరమించుకున్నారు. చార్లెస్ అల్బర్ట్ సింహాసనాన్ని తన కుమారుడు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ కు అప్పగించాడు.

మాజినీ రోమ్ లో రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రాజు రాజ్యాన్ని వదిలిపోయేలా చేసాడు. మాజినీ మరియు ఇతరులు రోమ్ లో రిపబ్లికన్ ప్రభుత్వాన్ని ఏర్పరచినా అనతికాలంలోనే లూయీ నెపోలియన్ వారి ప్రభుత్వాన్ని కూల్చివేసాడు.

మాజినీ స్ధాపించిన సంస్ధవల్ల దేశ ప్రజలను ఆదర్శవంతులుగా, జాతీయవాదులుగా, దేశభక్తిపరులుగా తయారుచేసింది. ఇటాలియన్లను అభివృధ్ధి చేసిన నాయకుడిగా ఇటలీ చరిత్రలో మాజినీ స్ధానం చిరస్థాయిగా నిలిచిపోయింది.

కౌంట్ కేవర్ (కౌంట్ కవూర్)

ఐరోపాలోని పంతొమ్మిదవ శతాబ్ధపు గొప్ప రాజనీతిజ్ఞులు, దౌత్యవేత్తల్లో కౌంట్ కేవర్ ఒకరు. పిడమాంట్ ప్రభువర్గానికి చెందిన కుంటుంబంలో 1810లో కేవర్ జన్మించాడు. విధ్యాభ్యాసం పూర్తైన తర్వాత సైన్యంలో ఇంజనీర్ గా చేరాడు. ఆనాటి రాజకీయాల పట్ల, రాజ్యాంగయుత రిపబ్లిక్ పై స్పష్టమైన అభిప్రాయాలు ఉండటం వల్ల కేవర్ సైన్యంలో ఎక్కువకాలం పనిచేయలేకపోయాడు. వారసత్వంగా వచ్చిన ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటూనే  ప్రాన్స్, ఇంగ్లండ్ లను సందర్శించాడు. ఇంగ్లండ్ లోని పార్లమెంటరీ విధానం కేవర్ కు చాలా నచ్చింది.

1842లో కేవర్ ’అగ్రేరియన్ అసోసియోషన్’ అనే సంస్ధను ప్రారంభించాడు.

1847లో ‘రిసార్జ్ మెంటో’ అనే పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు.

 

  1. సార్డీనియా-పిడమాంట్ నాయకత్వంలోనే ఇటలీ ఏకీకరణ సాధ్యమని కేవర్ భావించాడు.
  2. ఇటలీ స్వాతంత్ర్యం, ఏకీకరణ కేవర్ లక్ష్యాలు.
  3. రాజకీయ సమస్యలతో పాటూ కేవర్ సాంఘిక, ఆర్దిక, ఆద్యాత్మిక, మేధోవికాస సమస్యలపై కేవర్ దన దృష్ఠిని సారించాడు.
  4. పిడమాంట్ ను సాంఘిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక విషయాల్లో ఆదర్శ రాజ్యంగా తీర్చిదిద్ది, దాని నాయకత్వంలో ఇటలీ ఏకీరకణ చేయాలని కేవర్ భావించాడు.
  5. ఆస్ట్రియా ఇటలీని అణగదొక్కుతుందని కేవర్ భావించాడు. గత నలభై సంవత్సరాలుగా ఇటలీ దేశభక్తులు ఎదుర్కుంటున్న సమస్యలను కేవర్ క్షుణ్ణంగా అద్యయనం చేశాడు. ఆస్ట్రియాను ఇటలీ నుండి పారద్రోలడం ద్వారానే ఇటలీ ఏకీకరణ సాధ్యమనే అభిప్రాయానికి కేవర్ వచ్చాడు.
  6. ఇటలీ సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువచ్చిన మొదటి వ్యక్తి కేవర్.
  7. మాజినీ ఇటలీ ఏకీకరణక విదేశీ రాజ్యాల సహకారం లేకుండా సాధ్యమని భావించాడు. ఇటలీ సైన్య శక్తిని పరిశీలించిన కేవర్, విదేశీయుల సాయం లేకుండా ఇటలీ స్వతంత్రత, ఏకీకరణ సాధ్యం కాదని కేవర్ భావించాడు.
  8. కేవర్ దౌత్యం వల్లే యూరోప్ లో ఇటలీ సమస్య పరిష్కారం గురించి చర్చ ప్రారంభమైంది.
  9. ఇటలీ ఏకీకరణకై యుద్దం తప్పదని భావించిన కేవర్, పిడమాంట్ సైన్య శక్తిని బలపరచడంపై దృష్టిసారించాడు.

క్రిమియా యుద్దం 1854-56

రష్యా – టర్కీ మధ్య క్రిమియా యుధ్దం సంభవించినప్పుడు కేవర్ అంతర్జాతీయ రాజకీయాలలో తలదూర్చి, టర్కీకి మద్దతిస్తున్న ఇంగ్లండ్, ఫ్రాన్స్ లతో చేయి కలిపాడు. యుధ్దానంతరం సంధికి ఇంగ్లండ్ కేవర్ ను కూడా ఆహ్వానిచింది. ఈ సందర్బంగా కేవర్ అగ్రరాజ్యాల స్నేహాన్ని సంపాదించి ఇటలీ సమస్యను వారి దృష్టికి తీసుకువచ్చాడు.

మూడవ నెపోలియన్ తో ఒప్పందం – 1858

క్రిమియన్ యుద్దం సందర్బంగా ఫ్రాన్స్ చక్రవర్తి మూడవ నెపోలియన్ తో కేవర్ కు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇటలీ సమస్యను తీర్చడానికి మూడవ నెపోలియన్ సరైన వ్యక్తి అని కేవర్ గుర్తించాడు. నెపోలియన్ కూడా కేవర్ కు సాయపడటానికి సంతోషంతో అంగీకరించాడు.

అస్ట్రియాతో యుద్దం 1859 

ఆస్ట్రియా పిడమాంట్ పైన యుద్దం ప్రకటించింది. ఫ్రాన్స్ పిడమాంట్ కు సాయంగా వచ్చింది. అప్పటికే ఐరోపా దేశాల సానుభూతిని సంపాదించి ఉండటంవల్ల ఇతర దేశాలు ఆస్ట్రియాకు సాయంగా రాలేదు.

లొంబార్డీని ఆస్ట్రియా ఆధిపత్యం నుండి తప్పించారు. ఇటలీ ఏకీకరణ జరిగి ఇటలీ బలపడితే ఫ్రాన్స్ కి సమస్యగా మారుతుందని భావించిన నెపోలియన్ తన సైన్య సహకారాన్ని విరమించుకున్నాడు.

ఇదే సమయంలో ఇటాలియన్ ప్రజలు తమతమ దేశాల్లో రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అదృష్టవశాత్తూ బ్రిటన్ ప్రధాని లార్డ్ పామర్ స్టన్ ఇటలీకి మద్దతుగా నిలిచాడు.

ఉత్తర, మధ్య ఇటలీ రాజ్యాలు పిడమాంట్ తో కలిసిపోవడానికి అంగీకరించాయి. కానీ నెపోలియన్ ఇటలీకి వ్యతిరేకిగా మారతాడని గ్రహించిన కేవర్ సవాయ్ మరియు నైస్ రాజ్యాలను ఫ్రాన్స్ కి ఇస్తానని మాట ఇవ్వడంతో మూడో నెపోలియన్ వారి సంధికి అంగీకరించాడు. క్రొత్త సమాఖ్యకు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ రాజయ్యాడు. 2 ఏప్రిల్ 1860న ట్యురిన్ లో ఏకీక్రుత ఇటలీ పార్లమెంట్ సమావేశం జరిగింది.

6 జూన్ 1861న కౌంట్ కేవర్ తీవ్రమైన అలసట వల్ల వచ్చిన జ్వరంతో తన యాభై ఒకటవ ఏటనే ముృతిచెందాడు.

జోసఫ్ గారిబాల్డీ

జోసెఫ్ గారిబాల్డీ గొప్పదేశభక్తుడు. 1807లో నైస్ లో గారిబాల్డీ జన్మించాడు. గారిబాల్డీ స్వతహాగా మంచి సాహసికుడు. సాహసాల్లో ఇష్టంతో గారిబాల్డీ నావికుడిగా మారాడు. మాజినీ ప్రభావంతో గారిబాల్డీ ‘యంగ్ ఇటలీ’లో సభ్యుడిగా చేరాడు. గెరిల్లా యుద్దరీతిలో తన ప్రతిభ కారణంగా గారిబాల్డీ ఇటలీలో చాలా ప్రసిధ్ధుడ్యాయడు.

1834లో మాజినీ సవాయ్ లో తిరుగుబాటు లేవదీసినప్పుడు గారిబాల్డీ అందులో ప్రముఖ పాత్ర పోషించాడు. తత్ఫలితంగా గారిబాల్డీకి మరణ శిక్ష విధించారు. కానీ గారిబాల్డీ తప్పించుకొని దక్షిణ అమెరికాకి పారిపోయి అక్కడే పద్నాలుగు సంవత్సరాలు జీవించాడు. దక్షిణ అమెరికాలో ‘ఇటాలియన్ లీజియన్’ ను స్ధాపించి అక్కడి యుద్దాల్లో పాల్గొన్నాడు.

1848లో ఇటలీ స్వాంత్రత్ర్య పోరాటం గురించి తెలుసుకుని ఇటలీకి వచ్చాడు. ఆస్ట్రియాకు వ్యతిరేకంగా జరిగే యుద్దంలో చురుకుగా పాల్గొన్నాడు. 1849లో రోమ్ లో మాజినీ జరిపే తిరుగుబాటులో కూడా గారిబాల్డీ కీలకపాత్ర పోషించాడు.

1854లో గారిబాల్డీ తిరిగి ఇటలీకి వచ్చాడు. 1859లో ఫ్రాంకో-సార్డీనియా-ఆస్ట్రియా యుద్దంలో ఆస్ట్రియాకు వ్యతిరేకంగా పాల్గొన్నాడు.

1860లో సిసిలీ ప్రజలు నేపుల్స్ రాజు రెండో ఫ్రాన్సిస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు గారిబాల్డీని సాయం కోరారు.  నేపుల్స్ రాజు తనకు మిత్రుడు అయినా గారిబాల్డీ ప్రజలకోసం యుద్దానికి సిధ్ధమయ్యాడు. జెనోవాలో గారిబాల్డీ స్వచ్చంద సేనలను సిధ్ధంచేసుకున్నాడు. వారంతా ఎర్రచొక్కాలు ధరించేవారు. ఆనిదంగా గారిబాల్డీ సేనకు ‘రెడ్ షర్ట్స్’ అని పేరు వచ్చింది.

 

నేపుల్స్ రాజు మొత్తం సైన్యం 1,24,000. గారిబాల్డీ సైన్యం వేలల్లో మాత్రమే ఉంది. అయినా గారిబాల్డీ వెనకాడలేదు. ధైర్యంతో ముందుకు సాగిన గారిబాల్డీని విజయం వరించింది. సిసిలీ ఘోరపరాజయం పాలైంది. గారిబాల్డీ సిసిలీ రాజయ్యాడు. అనంతరం గారిబాల్డీ నేపుల్స్ మీద కూడా దాడి చేసాడు. 6 సెప్టెంబర్ 1860న నేపుల్స్ రాజు రాజ్యాన్ని విడిచి పారిపోయాడు.

 

గారిబాల్డీ రోమ్ పై దాడిచేసి రోమ్ కి విముక్తి కల్పించాలని భావించాడు. కానీ పోప్ కు ఫ్రెంచ్ సైన్యం సహాయాన్ని అందిస్తూ రోమ్ లో తిష్టవేసి ఉండటం వల్ల కౌంట్ కేవర్ గారిబాల్డీని రోమ్ పై దాడి చేయకుండా అడ్డుకున్నాడు. కౌంట్ కేవర్ గారిబాల్డీ గెలిచిన ప్రాంతాలను పిడమాంట్ రాజు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ కు ఇచ్చివేయాల్సిందిగా గారిబాల్డీతో ఒప్పందం చేసుకున్నాడు. కానీ గారిబాల్డీ ఏవిధమైన ధనం, గౌరవాలు స్వీకరించకుండానే విక్టర్ ఇమ్మాన్యుయెల్ కు నేపుల్స్ సిసిలీలను అప్పజెప్పాడు. గారిబాల్డీ ఉద్దేశంలో దేశభక్తికి మించిన గౌరవం మరొకటి లేదు.

కౌంట్ కేవర్, విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఇచ్చిన బహుమానాలేవీ స్వీకరించకుండా కేవలం ఒక సంచిలో ధాన్యాలను తీసుకుని కాప్రెరా దీవికి వెళ్లిపోయాడు.

వెనీషియా ఆక్రమణ 1866

కేవర్ మరణించే సమయానికిక వెనీషియా, రోమ్ తప్ప మిగతా ఇటలీ అంతా ఏకీకరించబడింది. వెనీషియా ఆస్ట్రియాలో భాగంగా ఉంది. రోమ్ పాపాల్ రాజ్యాల రాజధానిగా ఉంది. ఫ్రాన్స్ సైన్యం 1849నుండి రోమ్ ను సంరక్షిస్తూ ఉంది. 1866లో ప్రష్యాకు ఆస్ట్రియాకు మధ్య యుధం సంభవించింది. నిజానికి జర్మనీ ఉత్తర భాగాలను ఆస్ట్రియా నుండి విముక్తం చేయడానికి బిస్మార్క్ యుద్దానికి పథకం రచించాడు. ఆస్ట్రియా నుండి వెనీషియాను సంపాదించడానికి ఇటలీ కూడా జర్మనీకి సాయంగా యుద్దంలో పాల్గొంది. సెడోవా వద్ద ఆస్ట్రియా ఘోరపరాజయం పాలై వెనీషియాను ఇటలీకి అప్పజెప్పింది.

రోమ్ ఆక్రమణ 1870

జర్మనీపై ప్రతీకారాన్ని తీర్చుకోడానికి ఫ్రాన్స్ జర్మనీపై యుద్దం ప్రకటించింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా రోమ్ నుండి తన సైన్యాన్ని విరమించుకుంది. ఇదే అదనుగా విక్టర్ ఇమ్మాన్యుయెల్ రోమ్ పై దాడి చేసి సునాయాసంగా రోమ్ ను ఆక్రమించాడు. దీనితో ఇటలీ ఏకీకరణ పూర్తైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *