The Great Economic Depression of 1929-1932 Reasons and Social Economic Political results

ఆర్ధిక మహా సంక్షోభానికి కారణాలు దాని ప్రభావాన్ని గూర్చి వ్రాయండి?

The Great Economic Depression of 1929-1932: Reasons and Social Economic Political results

ఆదునిక ప్రపంచ చరిత్రలో ఎన్నో ‘ఆర్ధిక సంక్షోభాలు’ ఏర్పడినప్పటికీ 1929-32 ఆర్ధిక సంక్షోభం కనీ వినీ ఎరుగనంత వినాశకరమైనది. ఈ అర్ధిక సంక్షోభం వల్ల వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా మాంధ్యం ఏర్పడింది.

 

ఆర్ధిక మహాసంక్షోభానికి కారణాలు

 1. ఆదాయ పంపిణీలో తీవ్ర అసమానతలు ఆర్ధిక మహా సంక్షోభానికి దారితీసాయి.
 2. కంపెనీల సొమ్మును అక్రమ మార్గాలు పట్టించడం.
 3. భ్యాంకులకు స్వతంత్ర కేంద్రాలు ఎక్కువై, ఏ శాఖ తప్పుచేసినా ఆ ప్రభావం మొత్తం బ్యాంకు వ్యవస్ధమీద వ్యతిరేక ప్రభావం చూపడం.
 4. అమెరికా ఋణాలనిస్తూ, అవివేకంగా ఆ దేశాల ఎగుమతులను అడ్డుకుంది. ఎగుమతులపై విపరీతమైన పన్నులు విదించింది, అమెరికా తన ఎగుమతులను పెంచుకోడానికి ప్రయత్నించింది. ఈ అవివేకమైన చర్య ఋణగ్రహీతలకు అప్పుతీర్చే మార్గం లేకుండా చేసి వాటి పతనానికి దారితీసింది.

 

 1. ఆర్ధిక గూఢచర్యం విఫలమవడం.
 2. మొదటి ప్రపంచ యుధ్ధ అనంతరం జరిగిన ఒప్పందాలతో ఆర్ధిక వ్యవస్ధలో అసమానతలు ఎక్కువయ్యాయి. యూరోప్ నుండి పెట్టుబడులు అమెరికాను చేరినా, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలపడుతూ ఒక్కసారిగా కుప్పకూలింది.
 3. వర్ధమాన దేశాలు అమెరికానుండి పొందిన రుణాలతో తమ మడిపదార్ధాలను, ఉత్పత్తి సామర్ధ్యాన్ని అవసరానికి మించి పెంచుకున్నాయి.
 4. ఫ్రెంచ్ కరెన్సీ విలువ పడిపోవడం కార్మికుల ఏమాత్రం లాభం జరగలేదు.
 5. బ్రిటన్ దేశీయ ఆదాయాలను నియంత్రించి, విదేశీ పెట్టుబడులతో ఉత్పత్తి సాగించినా అదీ వారికి లాభాన్ని చేకూర్చలేదు.
 6. మొదటి ప్రపంచ యుధ్ధ బకాయీల కోసం అమెరికా ఇతర దేశాల్ని వత్తిడి చేసింది. ముందే యుద్దం వల్ల ఆర్ధికంగా చితికిపోయిన దేశాలు యుద్దబకాయిల వల్ల ఇంకా ఆర్దికంగా దిగజారిపోయాయి.
 7. పెట్టుబడుల ఎగుమతులు పొంచి ఉన్న ప్రమాదాన్ని తాత్కాలికంగా కప్పి ఉంచాయి.

 

ఆర్ధిక మాంధ్య ప్రభావం

* బకాయిలు రాబట్టడానికి, సుంకాలు విధించడానికి వినాశకర విదానాలు ఏర్పడి, అడ్డూ అదుపూ లేకుండా ప్రైవేట్ యాజమాన్యంలో పారిశ్రామిక విస్తరణ పెరిగింది.

* అమెరికాలో పెట్టుబడి ఊహాగానాలతో యూరప్ నుండి భారీగా పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.

వాల్ స్ట్రీట్ పతనమైంది.

* అమెరికా సంకుచిత పధ్ధతుల వల్ల బకాయీల వసూలు కష్టమైంది.

* అమెరికా సంపన్నుల అవసరాలను తీరుస్తూ సాధారణ ప్రజలను నిర్లక్ష్యం చేసింది.

* కొేద్దికాలంలోనే సంపన్నులు పెట్టుబడులు పెట్టడం ఆపేసారు. అనతికాలంలోనే ప్యాక్టరీలు, మిల్లులు, నౌకా నిర్మాణ కేంద్రాలు మూతపడ్డాయి. ఆమ్ముడు పోని కార్లు, విలాస వస్తువులు కుప్పలుగా పేరుకుపోయాయి. ధనికులు కూడా వీధుల్లో పండ్లు అమ్ముకునే పరిస్ధతి దాపురించింది.

* రైతులు దివాలా తీసారు. వారి భూములు బీడువారాయి. 1933కల్లా రెండుకోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటించారు.

* ఆస్ట్రియాలో అనేక పరిశ్రమలకు ఋణాలు అందించిన ‘క్రెడిట్ ఆన్ సాల్’ అనే ముఖ్యమైన బ్యాంకు దివాళాతీసింది.

క్రెడిట్ ఆన్ సాల్ రక్షణకు ప్రయత్నించిన ఫ్రాన్స్ పెట్టుబడుల ఉపసంహరణతో యూరప్ లో ప్రఖ్యాత ఆస్ట్రియన్ క్రెడిట్ ఆన్ స్టాల్ కూడా పతనమైంది. అంతరంగిక వినిమయం, ఎగుమతులు రెండూ పడిపోయాయి.

* జర్మనీలో అమెరికా పెట్టుబడులు ఆగిపోయాయి.

* ఆ కాలంలో ఋణాలివ్వగలిగే దేశాలు ప్రధానంగా అమెరికా, ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఋణాలివ్వదు. ఋణాలిచ్చే అమెరికా బ్రిటీష్ విదేశీవిధానంలో, నిరుధ్యోగ భృతిని తగ్గించాలని సవరణలు సూచించింది. దీనికి అంగీకరించని లేబర్ పార్టీ అధికారం కోల్పోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కన్సర్వేటివ్ పార్టీ అమెరికా షరతులను అంగీకరించినా పౌండు విలువ పతనం మాత్రం ఆగలేదు. లండన్ ప్రపంచ ఆర్ధిక కేంద్రం స్ధానాన్ని కోల్పోయింది.

* ఆధునిక కాలంలో వినాశనం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. అనాడు ప్రపంచంలో యూరప్ లోని ప్రతి దేశం ఆర్ధికంగా వ్యతిరేక ప్రభావానికి లోనయ్యాయి. పశ్చిమ దేశాలతో ఆర్ధిక వాణిజ్య సంబంధాలు లేని సోవియట్ యూనియన్ మాత్రమే ఆర్ధిక సంక్షోభ ప్రభావానికి లోనుకాలేదు.

సామాజిక, రాజకీయ రంగాలపై ఆర్ధిక మహాసంక్షోభం ప్రభావం ఏవిధంగా ఉంది?

ఆర్ధిక రంగంలో మార్పులు తప్పకుండా సామాజిక ఆర్ధిక రంగాలపై ప్రభావాన్ని చూపుతాయి. నిరుధ్యోగిత, పేదరికం పెరుగుదల,  పునరావాస చర్యలను ప్రైవేట్ సంస్ధలకు అప్పగించడం, ప్రజలు హిట్లర్ వంటి నియంతల ప్రభావానికి లోనవడం జరిగాయి.

 1. అమెరికాలో 1933కల్లా మొత్తం కార్మిక జనాబాలో నాల్గోవంతు మంది (కోటి నలభై లక్షలు)నిరుధ్యోగిత భారినపడ్డారు.
 2. బ్రిటన్ లో 30లక్షల మంది నిరుధ్యోగులయ్యారు.
 3. జర్మనీ పరిస్ధితి ఇంతకన్నా దిగజారింది.
 4. దేశాల్లో ప్రజలజీవన స్ధాయి పడిపోయింది.
 5. అమెరికా వంటి సంపన్న దేశాల్లో కూడా ప్రజలు ఆకలితో అలమటించారు. సహాయక చర్యలుకూడా తీసుకోలేక ప్రైవేట్ సంస్ధలకు అప్పగించారు.
 6. బ్రిటన్ లో ఒక తరం నిరుధ్యోకిత లోనే బ్రతుకీడ్చింది.
 7. నిరుధ్యోగం అధికంగా ఉండే జర్మనీలో పరిస్థితి దిగజారి హిట్లర్ వంటి వారి విజయానికి నిరుధ్యోగులు తోడ్పడ్డారు.

 

రాజకీయ ప్రభావం

రాజకీయ రంగాన్ని కూడా ఆర్ధిక మహా సంక్షోభం కుదిపేసింది. అప్పటికి అదికారంలో ఉన్న ప్రభుత్వాలు కూలిపోవడానికి, నియంతలకు అధికారం రావడానికి ఆర్దిక మహాసంక్షోభం కారణమైంది.

 1. అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఆర్ధిక మహాసంక్షోభం గండంగా పరిణమించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ పడిపోయాయి.
 2. అభ్యుదయ కారక ప్రభుత్వాల స్ధానంలో తిరోగమన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
 3. తీవ్రవాదులు, నియంతలు అధికారంలోకి వచ్చారు.
 4. జర్మనీలో రిపబ్లికన్ల స్ధానంలో అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది.
 5. అమెరికాలో రిపబ్లికన్ల స్ధానంలో డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చారు.
 6. స్పెయిన్ రాజు రిపబ్లికన్లకు అధికారాన్ని అప్పగించి దేశం వదిలిపోయాడు.
 7. బ్రిటన్ లో లేబర్ పార్టీ స్ధానంలో కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
 8. జపాన్ రిపబ్లిక్ పతనం అన్నింటికన్నా తీవ్రమైంది.జపాన్ లో మిలటరిస్టులు తమ పూర్వపు పాలకులను అధికారం నుండి తొలగించి, తమకు నచ్చని వారిని ఒక్కొక్కరినీ హత్య చేశారు.

 

ఆర్ధిక మాంద్య పరిస్ధితులు ఆర్ధిక రంగాన్నే కాక సమాజికంగా, రాజకీయంగా వ్యతిరేక ప్రభావం చూపాయి. పరిణామాలు అంతర్జాతీయ స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలకు వినాశకరంగా పరిణమించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *