Sun Yat Sen History in Telugu

సన్ యట్ సెన్

జననం: November 12, 1866                 మరణం: March 12, 1925

Sun Yat Sen History in Telugu

How Sun Yat Sen developed China?

సన్ యట్ సెన్ చైనా రిపబ్లిక్ విప్లవ సాయకుడు. సన్ యట్ సెన్ చైనాను మూడువందల ఏళ్ళు పాలించిన మంచూ రాజవంశ పాలనను అంతం చేశాడు. కొమింటాంగ్ పార్టీ చైనా ఏకీకరణకు కృషి చేసింది.

చిన్నతనం నుండే సన్ యట్ సెన్ లో విప్లవ భావాలున్నాయి. తమ గ్రామంలోని మత నమ్మకాలన్నీ మూఢనమ్మకాలే అని నిర్దారణకు వచ్చిన సన్ యట్ సెన్ ప్రజలకు మూఢ నమ్మకాల గురించి తెలియాలని గ్రామంలోని దైవ విగ్రహాన్ని పగలగొ్ట్టి చూపించాడు.

1892లో వైధ్య విధ్యను అభ్యసించిన అనంతరం మకావు కి వెళ్ళి ప్రాక్టీస్ మొదలుపెట్టాలనుకున్నాడు. కానీ పోర్చుగీస్ అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించారు.

1893లో హాంకాంగ్ కు తిరిగి వచ్చిన సన్ యట్ సెన్ వైధ్య వృత్తిలోకంటే రాజకీయాలలోనే ఎక్కువ ఆసక్తిని కనబరిచాడు. మంచూ రాజవంశ అసమర్ధత, లంచగొండితనం, సైన్య బలహీనత పట్ల అసహ్యం పెంచుకున్న సన్ యట్ సెన్ ‘రివైవ్ చైనా’ ఉధ్యమాన్ని ప్రారంభించాడు. జపాన్ చైనా పై యుధ్ధం ప్రకటించినప్పుడు సన్ యట్ సెన్ మంచూ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ‘రివైవ్ చైనా’ సంఘాన్ని రహస్య సంఘంగా నిర్వహించాడు. 1895లో కాంటన్ లో తిరుగుబాటుకు సన్ యట్ సెన్ ప్రణాళిక రచించాడు. కానీ ప్రభుత్వానికి ముందుగానే తెలిసి ‘రివైవ్ చైనా’ సభ్యులను హతమార్చింది. సన్ యట్ సెన్ కోసం ప్రభుత్వం వెతకడం ప్రారంభించగానే జపాన్ వెళ్ళి తలదాచుకున్నాడు.

 

విప్లవకారుడిగా

సన్ యట్ సెన్ ను చైనా ప్రభుత్వం గుర్తించకుండా గడ్డం మీసాలు పెంచి, పాశ్చాత్య వేశధారణతో జపాన్, హవాయి, సాన్ ఫ్రాన్సిస్కో, ఇంగ్లాండ్ లను సందర్శించాడు. ఇంగ్లండ్ లోని బ్రిటీష్ మ్యూజియంలో కార్ల్ మర్క్స్ రచనలను అధ్యయనం చేసి ప్రభావితుడయ్యాడు.

 

1905 జలైలో సన్ యట్ సెన్ జపాన్ కి తిరిగివచ్చి జాతీయభావంతో రగిలిపోతున్న చైనా విద్యార్ధులను కలిసాడు. ఇక్కడే సంగ్ చియావో జెన్, యువాన్ సింగ్ లను సన్ యట్ సెన్ కలిసాడు. జపాన్ లోనే చైనా రివల్యూషనరీ అలియన్స్ కి డైరెక్టర్ గా ఎన్నుకోబడ్డాడు. మంచి విధ్యావంతులు, సాంకేతిక నిపుణులు రివల్యూషనరీ అలియన్స్ లో సభ్యులుగా చేరారు.

సన్ యట్ సెన్ జాతీయత, ప్రజాస్వామ్యం, ప్రజాజీవనం మీద రచనలు చేసాడు. 1906 వరకల్లా రివల్యూషనరీ అలియన్స్ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చైనా ప్రభుత్వ ఒత్తిడితో సన్ యట్ సెన్ ను జపాన్ నుండి వెళ్ళగొట్టారు. ప్రారంభంలో సరైన ప్రణాళిక లేకుండా కొన్ని తిరుగబాట్లను లేవదీసి విపలమయ్యాడు. చైనాలోని తన ప్రత్యర్ధులకు వ్యతిరేకులు అమెరికాలో అధికమయ్యారని తెలుసుకుని అమెరికాలో వారిని ఏకం చేసాడు. ఇదేకాలంలో చైనాలోని యాంగ్ ట్సె లోయలో తిరుగుబాటు విజయవంతం అయింది.

 

చైనీస్ రిపబ్లిక్ కు అధ్యక్షుడిగా సన్ యట్ సెన్

25 డిసెంబర్ 1911న సన్ యెట్ సెన్ చైనాకు తిరిగివచ్చాడు. 1 జనవరి 1912న చైనాలోని పద్నాలుగు ప్రావిన్స్ ల ప్రతినిధులు నాన్ కింగ్ లో ఏర్పాటు చేసిన తాత్కాలికి ప్రభుత్వానికి సన్ యట్ సెన్ ను ఆధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీనితో చైనాలో రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పడింది.

చైనాలో రెండవ విప్లవం సంభవించి 15 సెప్టెంబర్ 1913న యువాన్ సన్ యట్ సెన్ ను అధికారం నుండి తొలగించాడు. దీనితో సన్ యట్ సెన్ జపాన్ కు పారిపోవలసి వచ్చింది.

సన్ యట్ సెన్ యువాన్ ని అధికారంలో నుండి తొలగించాలని ప్రయత్నించినా యువాన్ తన స్వంత తప్పిదం వల్లే అధికారాన్ని కోల్పోవలసివచ్చింది. యువాన్ రాచరికాన్ని తిరిగి పునరుద్ధరించాలనుకున్నాడు. దీనితో ప్రజలు తిరుగుబాటు చేశారు. 1916 ఏప్రిల్ లో యువాన్ మరణానికి రెండు నెలల ముందు సన్ యట్ సెన్ షాంగై కు తిరిగి వచ్చాడు.

సన్ యట్ సెన్ విప్లవానికి జపాన్ మధ్ధతు కూడగట్టడంలో విఫలమయ్యాడు. షాంగై లో ఉన్న కాలంలో ప్రజాస్వామ్య విఫలనానికి కారణం ప్రజలు రాజకీయాల్లో పాల్గొనకపోవడం అని, చైనాను విదేశీ పెట్టుబడులతో పారిశ్రామికంగా అభివృధ్ది చేయాలనే అభిప్రాయాలను వెలువరిస్తూ రచనలు చేశాడు.

 

సన్ యట్ సెన్ చైనీస్ కొమింటాంగ్ అనే పార్టీని స్ధాపించాడు. కాంటన్ లో చెన్ చియుంగ్ మింగ్ నాయకత్వంలో జరిగే తిరుగుబాటుకు మధ్ధతిచ్చాడు. 26 అక్టోబర్ 1920లో కాంటన్ ను చియుంగ్ ఆక్రమించినప్పుడు సన్ యట్ సెన్ చియుంగ్ ను క్వాంగ టుంగ్ గవర్నర్ గా ప్రకటించాడు. పెకింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సన్ యట్ సెన్ కాంటన్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దానికి సన్ యట్ సెన్ అధ్యక్షుడు.

చియుంగ్ తిరుగుబాటు చేసి సన్ యట్ సెన్ ను అధికారం నుండి తొలగించాడు. ఇదే కాలంలో చియాంగ్ కై షెక్ తో సన్ యట్ సెన్ కు పరిచయం ఏర్పడింది.

కమ్యూనిస్టులతో ఒప్పందం

26 జనవరి 1923న సన్ యట్ సెన్ సోవియట్ యూనియన్ మధ్ధతు సంపాదించగలిగాడు. మిలటరీ సాయంతో సన్ యట్ సెన్ కాంటన్ కు తరిగి వచ్చాడు. 1923 ఫిబ్రవరిలో మిలటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సన్ యట్ సెన్ మరోసారి అధ్యక్షుడయ్యాడు. 1924 జనవరిలో కొమింటాంగ్ నేషనల్ కాంగ్రెస్ కమ్యూనిస్టు సూత్రాలతో కూడిన క్రొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది. సన్ యట్ సెన్ నాయకత్వంలో విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు.

ఎంత క్రమశిక్షణ గల పార్టీ ఉన్నా మిలటరీ బలం లేకపోతే అది బలహీనమని గుర్తించిన సన్ యట్ సెన్ సోనియట్ లో లాగా పార్టీ సైన్యాన్ని ఏర్పరచాడు. సోవియట్ మిలటరీ శిక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. దీనికోసం చియాంగ్ కై షెక్ సోవియట్ కు వెళ్లాడు.

చైనా లోని సాంప్రదాయ సైనిక నాయకుల వ్యవస్ధ ఇంకా బలంగానే ఉంది. వారి సాయం చాలా అవసరమని సన్ యట్ సెన్ భావించాడు. కానీ సైనిక నాయకులతో చేసిన చర్చలు విపలం అయ్యాయి.

సన్ యట్ సెన్ చైనా పై పాశ్చాత్యుల ఆధిపత్యాన్ని అరికట్టడానికి సాయం చేస్తూ ఉండాలని రష్యాతో ఒప్పందం చేసుకున్నాడు. 12 మార్చి 1925న తను చనిపోడాని ముందురోజు సన్ యట్ సెన్ విజయం సాధించేవరకు విప్లవాన్ని విరమించవద్ధని తన సహచరులకు సూచించాడు.

అధికార లాంచనాలతో సన్ యట్ సెన్ అంత్యక్రియలు జరిగాయి. తన జీవిత కాలంలో విమర్శలను ఎదుర్కున్నా, మరణానంతరం సన్ యట్ సెన్ చైనా ప్రజలచే దేవుడిగా కొలవబడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *