Political Science Practice Test2 - Fundamental Rights
Quiz
- 1. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఎక్కడ పొందుపర్చారు?
- 1) పార్ట్-3, ఆర్టికల్ 13 నుంచి 35 వరకు
- 2) పార్ట్-3, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు
- 3) పార్ట్-4, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు
- 4) పార్ట్-4, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు
- 2. ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం లాంటివి అని ఎవరు పేర్కొన్నారు?
- 1) హెచ్‌జే లాస్కీ
- 2) అంబేద్కర్
- 3) పతంజలి
- 4) తిలక్
- 3. ప్రాథమిక హక్కుల వికాసానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది.
ఎ) 1895లో తిలక్ స్వరాజ్ అనే బిల్లును ప్రతిపాదించి భారతీయులకు వాక్ స్వాతంత్య్రం, ఆస్తి సంరక్షణ హక్కు గురించి తొలిసారిగా డిమాండ్ చేశారు
బి) 1925లో అనిబీసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఐరిష్ రిపబ్లిక్కు ఇచ్చిన హక్కులనే భారతీయులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు
సి) 1927లో మద్రాస్ భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్ చేసింది
డి) 1931లో మహాత్మాగాంధీ రెండో రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రాథమిక హక్కులను డిమాండ్ చేశారు.- 1) ఎ, బి, సి
- 2) బి, సి, డి
- 3) ఎ, బి
- 4) పైవన్నీ
- 4. 1935లో భారత ప్రభుత్వ చట్టంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు అందిస్తుండగా అడ్డుపడినవారు ఎవరు?
- 1) సైమన్, రీడింగ్
- 2) సైమన్, వేవెల్
- 3) రీడింగ్, వేవెల్
- 4) వేవెల్, షోర్
- 5. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) ఏర్పాటు చేసిన ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘానికి అధ్యక్షులు ఎవరు?
- 1) మోతీలాల్ నెహ్రూ
- 2) తేజ్‌బహదూర్ సక్రు
- 3) నౌరోజీ
- 4) కృపలానీ
- 6. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు?
- 1) నెహ్రూ
- 2) జేబీ కృపలానీ
- 3) సర్దార్ పటేల్
- 4) హెచ్‌సీ ముఖర్జీ
- 7. మాతృక రాజ్యాంగంలో ఎన్నిరకాల ప్రాథమిక హక్కులను పొందుపర్చారు?
- 1) 6
- 2) 5
- 3) 7
- 4) 8
- 8. సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు
బి) ప్రస్తుతం 6 రకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 9. ప్రాథమిక హక్కుల ప్రాథమిక ఉద్దేశం ఏది?
- 1) రాజకీయ ప్రజాస్వామ్యం అందించడం కోసం
- 2) సంక్షేమ రాజ్యస్థాపన
- 3) సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల్ని అందించడం
- 4) ఏదీకాదు
- 10. ప్రాథమిక హక్కుల్ని ఏ దేశం నుంచి గ్రహించారు?
- 1) బ్రిటన్
- 2) ఫ్రెంచ్
- 3) జపాన్
- 4) అమెరికా
- 11. కింది వాటిలో ప్రాథమిక హక్కుల లక్షణాలేవి?
ఎ) ప్రాథమిక హక్కులు న్యాయ సమ్మతమైనవి
బి) ప్రాథమిక హక్కులు శాశ్వతమైనవి
సి) ప్రాథమిక హక్కులు కొన్ని నకారాత్మక ధోరణి కలిగి ఉంటాయి
డి) ప్రాథమిక హక్కులు విదేశీయులు, స్వదేశీయులకు సమానంగా వర్తిస్తాయి- 1) ఎ, బి, సి
- 2) బి, సి, డి
- 3) ఎ, బి, సి, డి
- 4) బి, డి
- 12. కింది వాటిలో సరైనదాన్ని ఎంపిక చేయండి.
ఎ) ఆర్టికల్ 20, 21లు జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో రద్దయ్యాయి
బి) ఆర్టికల్ 19 మాత్రం బాహ్య జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రద్దవుతుంది- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 13. కింది వాటిలో సరైన దాన్ని ఎంపిక చేయండి.
ఎ) దేశంలో ఏ ప్రాంతంలో అయినా మార్షల్ లా అమల్లో ఉంటే అక్కడ ప్రాథమిక హక్కులు వర్తించవు
బి) కొన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించి శాసనాలు చేసే అధికారం పార్లమెంట్‌కి ఉంది- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 14. జతపర్చండి.
ఎ. ఆర్టికల్ 18 1. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ
సమాన అవకాశాలు
బి. ఆర్టికల్ 17 2. అంటరానితనం నిషేధం
సి. ఆర్టికల్ 16 3. బిరుదులు నిషేధం
డి. ఆర్టికల్ 15 4. కుల, మత, లింగ వివక్షతకు
తావులేదు- 1) ఎ-1, బి-2, సి-3, డి-4
- 2) ఎ-3, బి-2, సి-1, డి-4
- 3) ఎ-3, బి-2, సి-4, డి-1
- 4) ఎ-2, బి-1, సి-3, డి-4
- 15. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఏ ప్రాథమిక హక్కులు ఉన్నాయి?
- 1) సమానత్వపు హక్కు
- 2) స్వేచ్ఛ హక్కు
- 3) ఆస్తి హక్కు
- 4) పీడనాన్ని నిరోధించే హక్కు
- 16. చట్టం ముందు సమానత్వం అనే భావనను ప్రతిపాదించింది ఎవరు?
- 1) అంబేద్కర్
- 2) డీడీ బసు
- 3) ఫైలి
- 4) ఏవీ డైసీ
- 17. కింది వాటిలో భారతీయులతో సమానంగా విదేశీయులకు వర్తించే ప్రాథమిక హక్కులు?
- 1) ఆర్టికల్ 14, 20, 21, 23, 25, 26, 28
- 2) ఆర్టికల్ 14, 20, 21, 23
- 3) ఆర్టికల్ 14, 20, 21, 23, 25, 27, 28
- 4) ఆర్టికల్ 14, 20, 21, 23, 24, 25, 26, 27
- 18. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లవు అనే భావన ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
- 1) 12
- 2) 13
- 3) 14
- 4) 15
- 19. కింద పేర్కొన్నవారిలో ఆర్టికల్ 14 పరిధి నుంచి మినహాయించినవారు?
ఎ) రాష్ట్రపతి బి) గవర్నర్
సి) సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు
డి) విదేశీ రాయబారులు ఇ) రాష్ట్ర ముఖ్యమంత్రులు- 1) ఎ, బి, సి
- 2) ఎ, బి, సి, ఇ
- 3) ఎ, బి, సి, డి
- 4) పైవన్నీ
- 20. రాజ్యాంగంలో న్యాయ సమీక్ష భావనను ఏ ఆర్టికల్‌లో అంతర్భాగంగా పొందుపర్చారు?
- 1) 13 (1)
- 2) 13 (2)
- 3) 13 (సి)
- 4) 13 (డి)