Role of Lenin in Russian Revolution and Development of Russia

రష్యా విప్లవం – అభివృధ్ధిలో లెనిన్ పాత్ర?

Role of Lenin in Russian Revolution and Development of Russia

లెనిన్ పూర్తి పేరు వ్లాదిమిర్ ఉల్యిచ్ ఉల్యనోవ్ లెనిన్. లెనిన్ మార్క్స్ ఆలోచనను అమలులో పెట్టి రష్యా విప్లవానికి మేధోసారధ్యం వహించి, రష్యాలో సామ్యవాదాన్ని విజయవంతం చేసాడు. 22 ఏప్రిల్ 1870న లెనిన్ జన్మించాడు. లెనిన్ సోదరునిపై మూడవ అలెగ్జాండర్ పై హత్యాప్రయత్న నేరం మోపబడటంతో ఉల్యనోవ్, లెనిన్ అనే మారుపేర్లను పెట్టుకున్నాడు.

1887లో కజన్ విశ్వవిధ్యాలయంలో విప్లవ కార్యక్రమాలను చేపట్టడంతో లెనిన్ ను కజన్ విశ్వవిద్యాలయం నుండి తొలగించారు. లెనిన్ ప్రైవేటుగా చదివి సెయింట్ పీటర్స్ బర్గ్ నుండి న్యాయశాస్త్ర పట్టాను సంపాదించాడు.

మార్క్స్ సిధ్ధాంతాల అద్యయనం గురించి లెనిన్ యూరప్ దేశాలలో పర్యటించాడు.

రష్యాలో కార్మిక హక్కులకోసం ఉధ్యమాలను లెనిన్ ప్రారంభించాడు. జార్ ప్రభుత్వం లెనిన్ ను శిక్షపై సైబీరియా ప్రవాసానికి పంపింది. అక్కడి నుండి తప్పించుకుని లెనిన్ యూరప్ దేశాల్లో తలదాచుకన్నాడు. ఆ కాలంలో ‘ఇస్క్రా’ అనే పత్రికను నడిపాడు. ఇస్క్రా అంటే అర్ధం నిప్పుకణం. ఇస్క్రా రష్యాలో విప్లవాన్ని రగిల్చింది. ప్రవాస జీవితానికి ముగింపు పలికి లెనిన్ ఫిన్లాండ్ నుండి పెట్రోగ్రాడ్ చేరుకున్నప్పుడు ప్రజలు అతన్ని ఘనంగా స్వాగతించారు.

లెనిన్ ఏప్రిల్ థీసిస్ ను ప్రకటించాడు.

అనంతరం కెరెన్ స్కీ ప్రభుత్వాన్ని కూలదోసి సోవియట్ ప్రభుత్వ మండలిని ఏర్పరచాడు.

లెనిన్ దృష్టిలో విప్లవ మంటే ఆరంభం. విప్లవమంటే రక్తపాతం కాదు. వికృత భీభత్సాల అనంతరం ఎగిరే శాంతి కపోతం. లెనిన్ ప్రయత్నాల్లో ట్రాట్ స్కీ, స్టాలిన్ లు సాయంగా నిలిచారు.

రష్యా విప్లవం అనంతరం లెనిన్ మొదటి ప్రపంచ యుద్దం నుండి రష్యాను విరమింపజేసి శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేశాడు. రష్యా సైన్యం ఎర్రసైన్యంగా, శతృసైన్యం తెల్ల సైన్యంగా పిలువబడింది.

 

రష్యాలో శాంతి నెలకొల్పడానికి లెనిన్ జర్మనీతో బ్రెస్ట్ లిటావ్ స్క్ సంధి చేసుకొని యుధ్ధం విరమించాడు. ఈ ప్రయత్నాల్లో రష్యా అనేక సారవంతమైన భూముల్ని, ఫ్యాక్టరీల్ని కోల్పోయింది.

లెనిన్ ప్రపంచవ్యాప్త బోల్ష్ విక్ విప్లవానికి పిలుపునివ్వడం, క్రొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విదేశాలనుండి రష్యా తీసుకున్న రుణాలు, పెట్టుబడులను తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకోవడం తో మిత్ర రాజ్యాలు రష్యాపై దాడి జరిపినా ఉడ్రోవిల్సన్ 14 సూత్రాల అమలులో భాగంగా యుధ్ధం విరమించడంతో రష్యా స్ధిమిత పడింది.

 

1919 – ఫ్రాన్స్ ప్రేరణతో రష్యాపై పోలెండ్ దాడిని రష్యా విజయవంతంగా తిప్పికొట్టింది.

1917-1920 మధ్య లెనిన్ ప్రభుత్వం విప్లవ వ్యతిరేక జారిస్ట్ మరియు మెన్ష్ విక్ సైన్యాలను సమర్ధవంతంగా అణచివేసాడు.

1919 – విదేశీ సహకారంతో కొల్చక్ నాయకత్వంలో జరిగిన తిరుగబాటు, ఆక్రమణ యుధ్ధాన్ని ఎర్రసైన్యం సమర్ధవంతంగా అణచివేసింది. కొల్చక్ ను ఉరితీయడంతో బోల్ష్ విక్ లకు ఎదురులేకుండా పోయింది.

 

రోమనోవ్ వంశ రెండో నికొలస్ కుటుంబం ఎప్పటికైనా రష్యాకు ప్రమాదమని భావించి అతని కుటుంబాన్ని రహస్యంగా మట్టుబెట్టారు.

విభిన్న జాతులు కలిగిన రష్యాలో జాతికొక సోవియట్ ఏర్పడింది. సోవియట్ ల కలయికతో రష్యా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా అవతరించింది. 1918లో లెనిన్ నూతన రాజ్యాంగం ద్వారా సోవియట్ లకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చాడు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ వయోజన ఓటుహక్కు ఇచ్చాడు.

1918 లో బోల్ష్ విక్ పార్టీ రష్యా కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించింది. రాజకీయ పార్టీలన్నీ రధ్ధయ్యాయి.

తొమ్మిది మంది సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరో పార్టీ విధానాల్ని రూపొందించి అమలుపరుస్తుంది. పార్టీ – ప్రభుత్వం రెండూ పూర్తి అవగాహన తో పనిచేస్తాయి.

 

కమ్యూనిస్ట్ నియంతృత్వం

పత్రిలకు, సినిమా, రేడియో వంటి ప్రచార సాధనాలు సామ్యవాధ భావనల్ని ప్రచారం చేస్తాయి. ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాల ప్రకారం నడవడం వల్ల రష్యాలో కమ్యూనిస్ట్ నియంతృత్వం సాధ్యపడింది.

  • అంతరంగిక శతృవులను అణచివేయడానికి రష్యాలో ‘చెకా’ (అగ్ పూ) అనే రహస్య సైన్యాన్ని ఏర్పరచారు.
  • భూమి ప్రజలందరి సొత్తని భూస్వామ్యాన్ని రద్దుచేశాడు.
  • భూములను పేద రైతులకు పంచి ఇచ్చాడు.
  • వ్యక్తిగత ఆస్థి రధ్ధైంది.
  • ధనిక వర్గాన్ని రూపుమాపి వర్గరహిత సమాజాన్ని సాకారం చేశాడు.
  • రాత్రి  పాఠశాలతో కార్మికుల్లో నిరక్షరాస్యతను రూపుమాపాడు.

 

నూతన ఆర్ధిక విధానం

లెనిన్ ఆర్ధిక విధానాల వల్ల ఆర్ధిక వ్యవస్ధపై వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. కార్మికుల సంఘాలు ఫ్యాక్టరీను నిర్వహించడంలో విఫలమయ్యాయి. కర్షకులు ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో కరువు చోటుచేసుకుంది. దీనితో లెనిన్ కొంత వెనక్కి తగ్గి, తీవ్రతను తగ్గించి కొత్త ఆర్ధిక విధానాన్ని అమలు చేశాడు.

అనుభవం కొద్దీ మార్క్స్ విధానాల్లో స్వల్ప మార్పులు చేసి నూతన ఆర్ధిక విదానాన్ని రూపొందించాడు. నూతన ఆర్ధిక విదానంలో లెనిన్ సామ్యవాద-పెట్టుబడి దారీ ఆర్ధిక విదానాల్ని కలిపి ఆనుమతించాడు. భారీ పరిశ్రమలు, గనులు వంటి వాటిని ప్రభుత్వ ఆదీనంలో కొనసాగిస్తూ చిన్న పరిశ్రమలను ప్రైవేట్ ఆధీనంలో కొనసాగించాడు. ‘నెప్ మెన్’ అనబడే నూతన వర్తక వాణిజ్యవేత్తలు అభివృధ్ది చెందారు. రైతులకు పంటను మార్కెట్ లో అమ్ముకునే అవకాశాలన్ని ఇచ్చాడు. కానీ వారు పన్నులు చెల్లించిన అనంతరమే పంటను మార్కెట్ లో అమ్ముకోవచ్చు. రైతుల్లో ఉత్సాహం పెంపొంది కష్టించి పనిచేశారు. ఉత్పత్తి పెరిగింది.

ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఇటలీ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. విదేశీ పెట్టుబడులను అనుమతించాడు.

ద్రవ్యోల్బనం తగ్గించడానికి నూతన కరెన్సీని ప్రవేశపెట్టాడు.

 

లెనిన్ రష్యా అభివృధ్ధి గురించి చేసిన అన్వేషణలో భాగంగా మార్క్స్ రచనల ఆసరా తీసుకున్నాడు. రష్యా విప్లవానికి నాయకత్వం వహించి మార్క్స్ ఆలోచనలతో ముందుకు సాగాడు. నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆచరణలో మార్క్స్ ప్రణాళిక యధాతధంగా అమలు పరచడం సాధ్యం కాదని గ్రహించి, వివేకంతో సమయానుకూలంగా స్వల్ప మార్పులు ప్రవేశపెట్టి రష్యా అభివృధ్ధికి తోడ్పడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *