Role of Gandhi in Indian freedom movement

 

స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ పాత్రను వివరించండి?

Role of Gandhi in Indian freedom movement

2 అక్టోబర్ 1869న గాంధీ గుజరాత్ పోర్ బందర్ లో జన్మించారు. ఇంగ్లండ్ లో ఆయన లా చదివి 1891లో ఇండియాకు తిరిగివచ్చారు. ఒక కేసు విషయమై దక్షిణాఫ్రికా కు వెళ్లి అక్కడ నల్లజాతీయులకు వ్యతిరేకంగా ఉన్న జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు.

1915లో ఇండియాకు తిరిగి వచ్చిన గాంధీ భారత జాతీయోధ్యమంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. బీహార్ లోని చంపరాన్ లో నీలిమందు చెట్ల రైతులపై జరిగే యూరోపియన్ దోపిడీకి వ్యతిరేకంగా 1917లో, 1918లో గుజరాత్ లోని ఖేదాలో పంట నష్టం వల్ల, ప్లేగు వల్ల పన్నులు చెల్లించే పరిస్ధితిలో లేని రైతులకు సహాయంగా సత్యాగ్రహ ఉధ్యమాలు చేసి విజయాన్ని సాదించారు.

1918లో అహ్మదాబాద్ మిల్లు వర్కర్లకు న్యాయం కోసం గాంధీ ఆమరణ నిరాహార ధీక్షను చేపట్టారు. మిల్లు ఓనర్లు కార్మికుల డిమాండ్లను అంగీకరించారు.

చంపరాన్, ఖేదా, అహ్మదాబాద్ ఉధ్యమాల వల్ల గాంధీ సామాన్య జనానికి చేరువయ్యాడు.

జాతీయోధ్యమంలో నిమగ్నమవడానికి ముందు భారతదేశమంతటా పర్యటించి దేశ పరిస్ధితులను అర్ధం చేసుకున్నారు.

గోపాల క్రిష్ణ గోఖలే గాంధీ రాజకీయ గురువు.  ఖేదా సత్యాగ్రహం సమయంలో వల్లభాయ్ పటేల్ గాంధీ అనుచరుడయ్యాడు.

జలియన్ వాలాభాగ్ దురంతం 13 ఏప్రిల్, 1919

1919 రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు ఉధ్యమించారు. 6 April 1919 దేశ వ్యాప్తంగా నిరసన సమావేశాలు జరిగాయి. గాంధీని డిల్లీలో అరెస్టు చేయగా, పంజాబు కు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు డా. సత్యపాల్, డా. సైఫుధ్ధీన్ కిచ్లూ అమ్రిత్ సర్ లో అరెస్టు చేయబడ్డారు. 

దీనికి వ్యతిరేకంగా ప్రజలు పంజాబ్ లోని జలియన్ వాలా భాగ్ లో 13 ఏప్రిల్, 1919న నిర్వహించిన శాంతియుత సమావేశాన్ని చెదరగొట్టడానికి జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించాడు. ఆ దుర్ఘటనలో 379 మంది మరణించారు, 1137మంది గాయపడ్డారు. 13 ఏప్రిల్ 1919 పంజాబీల కొత్త సంవత్సర దినం కావడంతో సమావేశానికి ప్రజలు ఎక్కువ మంది హాజరయ్యారు. ఈ దుర్ఘటనతో బ్రిటీష్ వారిపే దేశ వ్యాప్తంగా నిరసన పెల్లుభికింది. రవీంద్రనాద్ ఠాగూర్ తనకు బ్రిటీష్ వారు ఇచ్చిన నైట్ హుడ్ ను తిరిగి ఇచ్చేసాడు.

 

 

ఖిలాఫత్ ఉధ్యమం 1920

Khilafat Udhyamamu notes in Telugu

1920 సెవర్స్ సంధి ద్వారా టర్కీకి జరిగిన అన్యాయం, మొదటి ప్రపంచ యుధ్ధానంతరం టర్కీమీద ఆంక్షలు, ఖలీఫా వ్యవస్ధను రద్దుచేయాలనే ఆలోచన వల్ల ఖిలాఫత్ ఉధ్యమం ప్రారంభమైంది. గాంధీ ఖిలాఫత్ ఉధ్యమానికి మధ్ధతునిచ్చాడు. గాంధీ పిలుపుతో హిందు ముస్లింలు ఖిలాఫత్ ఉధ్యమంలో పాల్గొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఎం.ఎ. అన్సారి, సైఫుద్దీన్ ఖిచ్లూ, అలీ సోదరులు ఖిలాఫత్ ఉధ్యమ ప్రముఖ నాయకులు. ఖిలాఫత్ కమిటీలు ఏర్పరచబడి 19 అక్టోబర్ 1919 ఖిలాఫత్ దినంగా నిర్వహించబడింది. ఖిలాఫత్ ఉధ్యమం తదనంతరం వచ్చిన సహాయ నిరాకరణ ఉధ్యమంలో భాగమైంది.

 

సహాయ నిరాకరణోధ్యమం (1920-1922)

రౌలత్ చట్టం, జలియన్ వాలాభాగ్ దురంతానికి వ్యతిరేకంగా, ఖిలాఫత్ ఉధ్యమానికి కొనసాగింపుగా మహాత్మాగాంధీ సహాయనిరాకణ ఉధ్యమాన్ని నిర్వహించాలని యోచించాడు. 1920 డిసెంబర్ లో నాగ్ పూర్ లో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు.

సహాయ నిరాకరణ కార్యాచరణ

బ్రిటీష్ వారు భారతీయులకు ఇచ్చిన బిరుదులు, గౌరవ సూచక పదవులను త్యజించడం.

స్ధానిక సంస్ధల సభ్యత్వాలకు రాజీనామా చేయడం.

1919 చట్టం ద్వారా నిర్వహించే ఎన్నికలలో పాల్గొనకపోవడం.

ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొనక పోవడం.

కోర్టులు, కళాశాలలు, సూళ్ళను బహిష్కరించడం.

విదేశీ వస్తువుల బహిష్కరణ.

ప్రైవేట్ పంచాయతీ కోర్టులు, జాతీయ స్కూళ్ళు, కాలేజీల స్ధాపన.

స్వదేశీ వస్తువులు, ఖాదీ ని ప్రోత్సహించడం.

గాంధీ తనకు బ్రిటీష్ వారు ప్రధానం చేసిన బిరుదులను త్యజించాడు. మిగతా నాయకులు ఆయన బాటను అనుసరించారు. ప్రభుత్వ విధ్యాసంస్ధలను వదిలి జాతీయవాదులు స్దాపించిన విధ్యాసంస్ధలలో విధ్యార్ధులు విధ్యను కొనసాగించారు. కాశీ విధ్యాపీఠం, బీహార్ విధ్యాపీఠం, జామియా మిలియా ఇస్లామియా వంటి విధ్యాసంస్ధలు స్ధాపించబడ్డాయి. లాయర్లు తమ వృత్తిని వదిలివేసారు. ఏ కాంగ్రెస్ నాయకుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

 

1921లో ప్రజలు వేల్స్ రాకుమారుడి పర్యటనకు వ్యతిరేకంగా నిరసనను తెలిపారు. ప్రభుత్వం నాయకులను అరెస్టు చేసి కఠిన చర్యల ద్వారా ఉధ్యమాన్ని అణచడానికి ప్రయత్నించింది. కాంగ్రెస్ మరియు ఖిలాఫత్ కమిటీ చట్టవ్యతిరేక సంస్ధలని ప్రకటించబడ్డాయి. పలు చోట్ల విదేశీ వస్త్రాలను తగులబెట్టారు.

 

5 ఫిబ్రవరి 1922న ఉత్తరప్రదేష్ లోని ఘోరఖ్ పూర్ జిల్లాలో ని చౌరాచౌరీ పోలిస్ స్టేషన్ ను ప్రజలు తగులబెట్టడంతో 10 మార్చి 1922న గాంధీ అరెస్టు చేయబడ్డాడు. 11 ఫిబ్రవరి 1922న గాంధీ సహాయ నిరాకరణ ఉధ్యమాన్ని నిలుపుచేసాడు.

సహాయ నిరాకరణ ఉధ్యమ ప్రాముఖ్యత

1. రైతుకూలీలు, కార్మికులు, విధ్యార్ధులు, ఉపాధ్యాయులు, లాయర్లు, మహిళలు వంటి వివిధ వర్గాల ప్రజలు సహాయనిరాకణ ఉధ్యమంలో పాల్గొన్నారు.

2. దేశ వివిధ మూలలకు ఉధ్యమం వ్యాపించింది.

3. హిందు ముస్లింలు ఉధ్యమకాలంలో ఐఖ్యత కనబరిచారు.

4. సామాన్య ప్రజలు కూడా త్యాగాలు చేయడానికి సిధ్ధంగా ఉన్నారని ఈ ఉధ్యమం నిరూపించింది.

3 ఫిబ్రవరి 1928న సైమన్ కమిషన్ భారత్ కు వచ్చింది. ప్రజలు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. ఈ సందర్బంగా జరిగిన లాఠీ చార్జీలో గాయపడి లాలాలజపత్ రాయ్ మరణించారు.

1930 మే నెలలో సైమన్ కమిషన్ తన రిపోర్టును ప్రచురించింది. ద్వందపాలన విఫలమైనందున స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పరచాలని సైమన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. సైమన్ కమిషన్ రిపోర్టే 1935 చట్టానికి మూలం.

నెహ్రూ రాజ్యాంగం – సంపూర్ణ స్వరాజ్య తీర్మాణం

మోతీలాల్ నెహ్రూ వ్రాసిన రాజ్యాంగాన్ని బ్రిటీష్ వారు అంగీకరించలేదు. 1929 డిసెంబర్ లో లాహోర్ లో భారత జాతీయ కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేసంలో సంపూర్ణ స్వాంతత్ర్య తీర్మాణం చేసారు. దీని ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 26ను స్వాతంత్ర్య దినం గా జరుపుకున్నారు. స్వాతంత్ర్యానంతరం రాజ్యంగం అమలులోకి వచ్చిన సంవత్సరం 1950 నుండి జనవరి 26ను రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాము.

దండి యాత్ర 12 th March 1930

Dandi Yathra March notes in Telugu

12 మార్చి 1930న మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉధ్యమాన్ని ప్రారంభించారు. తీర ప్రాంతంలో ఉప్పును స్వంతంగా తయారు చేసి ఉప్పుపై బ్రిటీష్ వారు విదించిన పన్నును చెల్లించకుండా ఆ శాసనాన్ని ఉల్లంఘించాలని గాంధీ నిర్ణయించారు.  మొదట 78మంది అనుచరులతో ప్రారంభమై వేలమంది గాంధీని అనుసరించారు. 200 మైళ్ళ నడక అనంతరం 5 ఏప్రిల్ 1930న దండి గ్రామాన్ని చేరుకుని ఏప్రిల్ 6న ఉప్పును తయారు చేయడం ద్వారా గాంధీ శాసనోల్లంఘన చేసారు.

ఆల్కహాల్, నల్లమందు, విదేశీ వస్త్రాలను విక్రయించే దుకాణాలను మూసివేయించడం, విదేశీ వస్త్రాలను దహించివేయడం, స్వంతంగా నూలును వడికి బట్టలు తయారుచేయడం, ప్రభుత్వ ఉధ్యోగాలు, స్కూళ్ళను వదిలివేయడం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం ఉధ్యమ కార్యాచరణగా నిర్ణయించారు. ప్రభుత్వం ఉద్యమాన్ని అణచడానికి ముఖ్య నాయకులందరిని అరెస్టుచేసింది.

 

రౌండ్ టేబుల్ సమావేశాలు

ప్రభుత్వం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించుకుంది. మొదటి రౌండ్ టేబుల్ సమావేసం 1930లో లండన్ లో జరిగింది. కాంగ్రెస్ పై నిషేధం విధించడం వలన కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. గాంధీ సమావేశానికి హాజరుకాలేదు.

1931 సెప్టెంబర్ లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గాంధీ-ఇర్విన్ ఒప్పందం ప్రకారం  కాంగ్రెస్ పై నిషేధాన్ని ఎత్తివేసి, నాయకులందరినీ విడుదల చేయడంతో గాంధీ శాసనోల్లంఘన ఉధ్యమాన్ని విరమించి ఈ సమావేశానికి హాజరయ్యారు.  పూర్ణ స్వరాజ్యానికి బ్రిటీష్ వారు అంగీకరించకపోవడంతో గాంధీ నిరాశకు గురయ్యారు.

1932 జనవరిలో గాంధీ తిరిగి శాసనోల్లంఘన ఉధ్యమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం గాంధీ, సర్ధార్ పటేల్ వంటి నాయకులను అరెస్టు చేసి, కాంగ్రెస్ పై నిషేధాన్ని విధించింది.

 

కమ్యూనల్ అవార్డ్ – పూనా ఒప్పందం (1932)

Communal Awar – Poona Oppandam notes in Telugu

అణచివేయబడ్డ వర్గాల ప్రతినిధిగా అంబేధ్కర్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నాడు. దీని ఫలితంగా బ్రిటన్ ప్రధాని రాంసే మెక్ డోనాల్డ్ అణచివేయబడ్డ వర్గాలకు ప్రత్యేక ఎలొక్టరేట్లను ఇచ్చాడు. దీనికినే కమ్యూనల్ అవార్డ్ అంటారు. ఆ సమయంలో పూనాలోని ఎరవాడ జైలులో ఉన్న గాంధీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ఆమరణ నిరాహారధీక్షకు పూనుకున్నాడు. దీనితో అంబేద్కర్ కమ్యూనల్ అవార్డును వదులుకోవాల్సివచ్చింది.

1932లో జరిగిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదు.

ఇండియా నాయకులుని సంప్రదించకుండా భారత్  ను కూడా రెండవ ప్రపంచ యుధ్ధంలో బ్రిటీష్ భాగం చేశారు. దీనిని గాంధీ వ్యతిరేంకించాడు.

రెండో ప్రపంచ యుధ్ధంలో భారతీయుల సాయంకోసం 8 ఆగస్టు 1940న ఒక ప్రకటన చేసింది. దీనినే ఆగస్టు ఆఫర్ అంటారు. దీని ప్రకారం యుద్దానంతరం భారత ప్రతినిధులచే రాజ్యాంగ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తారు. ఆగస్టు ఆఫర్ తో సంతృప్తి చెందని గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహ ఉధ్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉధ్యమం పదిహేను నెలలు కొనసాగింది.

 

క్రిప్స్ మిషన్ (1942)

Crips Mission notes in Telugu

రెండో ప్రపంచ యుధ్ధానికి భారతీయుల మధ్ధతు కూడగట్టడానికి బ్రిటీష్ వారు 23 మార్చి 1942న క్రిప్స్ మిషన్ ను పంపారు. ఇండియాకు డొమినియన్ స్టేటస్, మైనార్టీలకు హక్కుల రక్షణ, రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభ ఏర్పాటును గూర్చి భారతీయులకు భరోసా ఇచ్చారు.“దివాళా తీసిన బ్యాంకుకు చెందిన ముందు తేదీ వేసిన బ్యాంక్ చెక్ గా గాంధీ క్రిప్స్ మిషన్ ను అభివర్ణించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు క్రిప్స్ మిషన్ ను వ్యతిరేకించాయి.

క్విట్ ఇండియా ఉధ్యమం (1942-1944)

Quit India udhyamamu notes in Telugu

క్రిప్స్ మిషన్ విపలమవడంతో గాంధీ బ్రిటీష్ వారిని దేశం విడిచి పోవాలని “క్విట్ ఇండియా ఉధ్యమాన్ని

 ప్రారంభించాడు. బ్రిటీష్ వారు దేశం విడిచి వెళ్ళిన అనంతరం ఆపధ్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పరచి, ప్రత్యేక దేశం కోసం ముస్లింల కోరిక విషయాన్ని పరిష్కరించాలని అనుకున్నాడు.

8 ఆగస్టు 1942న కాంగ్రెస్ నాయకులందరూ బొంబాయిలో సమావేశం అయ్యారు. అదేరోజు గాంధీ ‘డూ ఆర్ డై అనే పిలుపునిచ్చారు.

8th మరియు 9th ఆగస్టు 1942న బ్రిటీష్ ప్రభుత్వం గాంధీ తో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్టు చేసింది. అరుణా అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్, ఎస్.ఎమ్. జోషి, ఉధ్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. 1944లో మహాత్మాగాంధీ జైలు నుండి విడుదల చేయబడ్డారు.

క్విట్ ఇండియా ఉధ్యమం భారత స్వాతంత్ర్యానికి చివరి ప్రయత్నం. ఉధ్యమ సందర్భంగా 7,000 మంది చనిపోయారు. 60,229 మంది అరెస్టు చేయబడ్డారు. ఎలాంటి త్యాగానికైనా వెనకాడకుండా ధైర్యంగా భారతీయులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు.

గాంధీ సౌతాఫ్రికా నుండి తిరిగి వచ్చి దేశమంతా పర్యటించి, దేశ పరిస్ధితులను అర్ధం చేసుకున్న అనంతరమే తన స్వాతంత్ర్య పోరాట ప్రణాళికను సిధ్దం చేసుకున్నారు. అంతకు ముందు జరిగిన ఉధ్యమాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమై, దేశం మంతా ఒకే సారి జరగక విఫలమయ్యాయని గ్రహించి దేశమంతా తన ప్రసంగాలతో ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందిచాడు. ప్రపంచంలో ఎక్కడా హింసాత్మక తిరుగుబాట్లు వెంటనే అణచివేయబడతాయని గ్రహించి శాంతియుత ఉధ్యమం ద్వారా దేశం మొత్తాన్ని ఒకే తాటికి తీసుకువచ్చాడు. చివరికి 15th ఆగస్టు 1947న ఇండియాకు స్వాతంత్ర్యం సిధ్ధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *