Role of Count Cavour in the Unification of Italy

Role of Count Cavour in the Unification of Italy

ఇటలీ ఏకీకరణలో కౌంట్ కేవర్ పాత్రను వ్రాయండి?

ఐరోపాలోని పంతొమ్మిదవ శతాబ్ధపు గొప్ప రాజనీతిజ్ఞులు, దౌత్యవేత్తల్లో కౌంట్ కేవర్ ఒకరు. పిడమాంట్ ప్రభువర్గానికి చెందిన కుంటుంబంలో 1810లో కేవర్ జన్మించాడు. విధ్యాభ్యాసం పూర్తైన తర్వాత సైన్యంలో ఇంజనీర్ గా చేరాడు. ఆనాటి రాజకీయాల పట్ల, రాజ్యాంగయుత రిపబ్లిక్ పై స్పష్టమైన అభిప్రాయాలు ఉండటం వల్ల కేవర్ సైన్యంలో ఎక్కువకాలం పనిచేయలేకపోయాడు. వారసత్వంగా వచ్చిన ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటూనే  ప్రాన్స్, ఇంగ్లండ్ లను సందర్శించాడు. ఇంగ్లండ్ లోని పార్లమెంటరీ విధానం కేవర్ కు చాలా నచ్చింది.

1842లో కేవర్ ’అగ్రేరియన్ అసోసియోషన్’ అనే సంస్ధను ప్రారంభించాడు.

1847లో ‘రిసార్జ్ మెంటో’ అనే పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు.

కేవర్ ఉధ్యమ లక్ష్యాలు

* ఇటలీ స్వాతంత్ర్యం.

* ప్రజలు పాలకుల మధ్య సమన్వయం.

* వివిధ రాజ్యాల పాలకుల మధ్య సమన్వయం.

* రాజ్యాంగ, రాజకీయ, సాంఘిక, ఆర్ధిక సంస్కరణలు.

తన స్వతంత్ర ఆలోచనా విధానం వల్ల కేవర్ ప్రజల్లో చాలా ప్రాచుర్యం సంపాధించాడు. 1848లో పిడమాంట్ లో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పరచినప్పుడు ఆనందంతో కేవర్ దానిని స్వాగతించాడు. కేవర్ కు ఉన్న ప్రజాధరణ వల్ల 1850లో ఏర్పరచిన మొదటి పార్లమెంటరీ ప్రభుత్వంలో కేవర్ కు స్ధానం దక్కింది. వ్యవసాయ, వ్యాపార మంత్రిగా కేవర్ కు కేబినెట్ లో కూడా స్ధానాన్నిచ్చారు. 1852లో కేవర్ పిడమాంట్ ప్రధానమంత్రిగా ఎన్నికై 1861వరకు ఆపదవికి వన్నె తెచ్చాడు. ప్రధానిగా పనిచేసిన కాలంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడుగా, దౌత్యవేత్తగా, ఇటలీ నిర్మాతగా పేరుతెచ్చుకున్నాడు.

ఇటలీ ఏకీకరణకై కేవర్ ప్రణాళిక

  1. సార్డీనియా-పిడమాంట్ నాయకత్వంలోనే ఇటలీ ఏకీకరణ సాధ్యమని కేవర్ భావించాడు.
  2. ఇటలీ స్వాతంత్ర్యం, ఏకీకరణ కేవర్ లక్ష్యాలు.
  3. రాజకీయ సమస్యలతో పాటూ కేవర్ సాంఘిక, ఆర్దిక, ఆద్యాత్మిక, మేధోవికాస సమస్యలపై కేవర్ దన దృష్ఠిని సారించాడు.
  4. పిడమాంట్ ను సాంఘిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక విషయాల్లో ఆదర్శ రాజ్యంగా తీర్చిదిద్ది, దాని నాయకత్వంలో ఇటలీ ఏకీరకణ చేయాలని కేవర్ భావించాడు.
  5. ఆస్ట్రియా ఇటలీని అణగదొక్కుతుందని కేవర్ భావించాడు. గత నలభై సంవత్సరాలుగా ఇటలీ దేశభక్తులు ఎదుర్కుంటున్న సమస్యలను కేవర్ క్షుణ్ణంగా అద్యయనం చేశాడు. ఆస్ట్రియాను ఇటలీ నుండి పారద్రోలడం ద్వారానే ఇటలీ ఏకీకరణ సాధ్యమనే అభిప్రాయానికి కేవర్ వచ్చాడు.
  6. ఇటలీ సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువచ్చిన మొదటి వ్యక్తి కేవర్.
  7. మాజినీ ఇటలీ ఏకీకరణక విదేశీ రాజ్యాల సహకారం లేకుండా సాధ్యమని భావించాడు. ఇటలీ సైన్య శక్తిని పరిశీలించిన కేవర్, విదేశీయుల సాయం లేకుండా ఇటలీ స్వతంత్రత, ఏకీకరణ సాధ్యం కాదని కేవర్ భావించాడు.
  8. కేవర్ దౌత్యం వల్లే యూరోప్ లో ఇటలీ సమస్య పరిష్కారం గురించి చర్చ ప్రారంభమైంది.
  9. ఇటలీ ఏకీకరణకై యుద్దం తప్పదని భావించిన కేవర్, పిడమాంట్ సైన్య శక్తిని బలపరచడంపై దృష్టిసారించాడు.

క్రిమియా యుద్దం 1854-56

రష్యా – టర్కీ మధ్య క్రిమియా యుధ్దం సంభవించినప్పుడు కేవర్ అంతర్జాతీయ రాజకీయాలలో తలదూర్చి, టర్కీకి మద్దతిస్తున్న ఇంగ్లండ్, ఫ్రాన్స్ లతో చేయి కలిపాడు. యుధ్దానంతరం సంధికి ఇంగ్లండ్ కేవర్ ను కూడా ఆహ్వానిచింది. ఈ సందర్బంగా కేవర్ అగ్రరాజ్యాల స్నేహాన్ని సంపాదించి ఇటలీ సమస్యను వారి దృష్టికి తీసుకువచ్చాడు.

మూడవ నెపోలియన్ తో ఒప్పందం – 1858

క్రిమియన్ యుద్దం సందర్బంగా ఫ్రాన్స్ చక్రవర్తి మూడవ నెపోలియన్ తో కేవర్ కు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇటలీ సమస్యను తీర్చడానికి మూడవ నెపోలియన్ సరైన వ్యక్తి అని కేవర్ గుర్తించాడు. నెపోలియన్ కూడా కేవర్ కు సాయపడటానికి సంతోషంతో అంగీకరించాడు.

అస్ట్రియాతో యుద్దం 1859 

ఆస్ట్రియా పిడమాంట్ పైన యుద్దం ప్రకటించింది. ఫ్రాన్స్ పిడమాంట్ కు సాయంగా వచ్చింది. అప్పటికే ఐరోపా దేశాల సానుభూతిని సంపాదించి ఉండటంవల్ల ఇతర దేశాలు ఆస్ట్రియాకు సాయంగా రాలేదు.

లొంబార్డీని ఆస్ట్రియా ఆధిపత్యం నుండి తప్పించారు. ఇటలీ ఏకీకరణ జరిగి ఇటలీ బలపడితే ఫ్రాన్స్ కి సమస్యగా మారుతుందని భావించిన నెపోలియన్ తన సైన్య సహకారాన్ని విరమించుకున్నాడు.

ఇదే సమయంలో ఇటాలియన్ ప్రజలు తమతమ దేశాల్లో రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అదృష్టవశాత్తూ బ్రిటన్ ప్రధాని లార్డ్ పామర్ స్టన్ ఇటలీకి మద్దతుగా నిలిచాడు.

ఉత్తర, మధ్య ఇటలీ రాజ్యాలు పిడమాంట్ తో కలిసిపోవడానికి అంగీకరించాయి. కానీ నెపోలియన్ ఇటలీకి వ్యతిరేకిగా మారతాడని గ్రహించిన కేవర్ సవాయ్ మరియు నైస్ రాజ్యాలను ఫ్రాన్స్ కి ఇస్తానని మాట ఇవ్వడంతో మూడో నెపోలియన్ వారి సంధికి అంగీకరించాడు. క్రొత్త సమాఖ్యకు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ రాజయ్యాడు. 2 ఏప్రిల్ 1860న ట్యురిన్ లో ఏకీక్రుత ఇటలీ పార్లమెంట్ సమావేశం జరిగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *