Role of Bismark in the unification of Germany

 

 జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్రను వ్రాయండి.

ఆటోవాన్ బిస్మార్క్

Role of Bismark in the unification of Germany

బిస్మార్క్ 1815వ సంవత్సరంలో బ్రాండెన్ బర్గ్ లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. గోటింజన్, బెర్ని విశ్వవిద్యాలయాల్లో విధ్యనభ్యసించి ప్రభుత్వ ఉధ్యోగంలో చేరాడు.

బిస్మార్క్ లో సాంప్రదాయ వాదం, దేశభక్తి సమంగా ఉన్నాయి. 1848-1849 విప్లవకాలంలో ఉదారవాదులకు వ్యతిరేకంగా ప్రష్యా ప్రభుత్వాన్ని సమర్ధించాడు.

నాల్గవ ఫ్రెడరిక్ విలియంకు రక్షణగా వ్యవసాయదారులను బెర్లిన్ కు తీసుకువచ్చేందుకు బిస్మార్క్ సిధ్ధమయ్యాడు.

ప్రజలకు రాజ్యాంగాన్ని ఏర్పరచాలని ఫ్రెడరిక్ విలియం తీసుకున్న నిర్ణయాన్ని బిస్మార్క్ వ్యతిరేకించాడు.

1851 – బిస్మార్క్ ప్రభుత్వ రాయబారి ఉధ్యోగంలో చేరాడు.

1851 నుండి 1859 వరకు జర్మన్ డైట్ లో ప్రష్యా ప్రతినిధిగా పనిచేసి అపారమైన రాజకీయ జ్ఞానాన్ని సంపాదించాడు. ఇదే కాలంలో ఆస్ట్రియా పట్ల వ్యతిరేక భావం కూడా పెంపొందింది.

1859 నుండి 1861 సెయింట్ పీటర్స్ బర్గ్ లో రాయబారిగా పనిచేసి ఇక్కడి జార్ అభిమానాన్ని చూరగొన్నాడు.

1861 – కొంత కాలం పారిస్ లో ప్రష్యా రాయబారిగా పనిచేసాడు.

1862 – ప్రష్యా చక్రవర్తి మొదటి విలియంకు పార్లమెంటుకు ఘర్షణ నేపద్యంలో బిస్మార్క్ ను ప్రధానమంత్రిగా నియమించాడు.

ప్రష్యా మంత్రిమండలి అధ్యక్షుడిగా పదవిచేపట్టేనాటికి  బిస్మార్క్ వయసు 47 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఆకాలంలో ఏవరూ ప్రధాని పదవిని చేపట్టలేదు. బిస్మార్క పార్లమెంట్ ఎగువ సభ అబిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకునేవాడు. దిగువ సభ అభిప్రాయాన్ని లెక్కచేయక పార్లమెంటును ఉల్లంఘించేవాడు.

బిస్మార్క్ సైన్యాన్ని పటిష్టపరచి జర్మనీ ఏకీకరణ నిమిత్తం 1864లో డెన్మార్క్ తో, 1866లో ఆస్ట్రియాతో, 1870లో ఫ్రాన్స్ తో యుద్దాలు చేశాడు.

1864లో డెన్మార్క్ తో యుద్దం – స్లెష్ విగ్, హోల్ స్టీన్ సమస్యపై ఆస్ట్రియా సహకారంతో బిస్మార్క్ విజయాన్ని సాధించాడు. స్లెష్ విగ్, హోల్ స్టీన్ లలో అధిక సంఖ్యాకులు జర్మన్లు. కానీ ఆ ప్రాంతాలు డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయి. 1848లో డెన్మార్క్ చక్రవర్తి ఏడవ ఫ్రెడరిక్ వీటిని డెన్మార్క్ లో విలీనం చేయాలని ప్రయత్నించాడు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, ప్రష్యా, నార్వే, స్వీడన్ లు కలిసి లండన్ సంధిని కుదిర్చాయి. ఈ సంధి ప్రకారం డెన్మార్క్ స్లెష్ విగ్, హోల్ స్టీన్ లను విలీనం చేసుకోలేదు. లండన్ సంధి కాలపరిమితి పది సంవత్సరాలు. ఏడవ ఫ్రెడరిక్ మరణంతో చక్రవర్తి అయిన తొమ్మిదవ క్రిస్టియన్ స్లెష్ విగ్ ను డెన్మార్క్ ల విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిని ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. సమస్య పరిష్కారానికై బిస్మార్క్ ఆస్ట్రియా సాయం కోరాడు. ఇద్దరూ కలిసి డెన్మార్క్ ను ఓడించారు. డెన్మార్క ఓటమి తరువాత ఈ ప్రాంతాలకోసం ప్రష్యా ఆస్ట్రియాతో యుద్దం చేయాల్సివచ్చింది.

1866లో ఆస్ట్రియాతో యుధ్ధం –  ఆస్ట్రియా స్లెష్ విగ్ ను జర్మన్ సమాఖ్య లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బిస్మార్క్ వ్యతిరేకించాడు. జర్మనీ ఏకీకరణకు అడ్డుపడే ఆస్ట్రియాకు ఇతర దేశాలు సాయపడకుండా వేరు వేరు సంధులు చేసుకున్నాడు. ఆనాటి ప్రపంచ రాజకీయ పరిస్ధితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బిస్మార్క్ ఆస్ట్రియాను ఏకాకిని చేయడానికి అన్ని అవకాశాలను వాడుకున్నాడు.

హోల్స్ జ్టీన్ లో ఆస్ట్రియా పరిపాలను వ్యతిరేకంగా కుట్రలను ప్రోత్సహించాడు. ఆస్ట్రియా గ్యాస్టివ్ ఒప్పందాన్ని ఉల్లంఘించేలా చేసి హోల్ స్టీన్ లో ఆస్ట్రియా అధికారులను తొలగించాడు. ఏడువారాల యుద్దం, సెడోవా యుద్దాలలో ఆస్ట్రియాను ప్రష్యా ఓడించింది.

1870లో ఫ్రాన్స్ తో యుధ్ధం – స్పెయిన్ ప్రజలు తమ నిరంకుశ రాణి ఇసబెల్లాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. హోహెన్ జాల్వెన్ వంశస్తులు అధికారం స్వీకరించాలని భావించారు. కానీ నెపోలియన్ దీనిని వ్యతిరేకించాడు. భవిష్యత్ లో ఇలాంటి ప్రస్తావన రాకుండా ప్రష్యా కట్టుబడి ఉండాలని ప్రష్యా రాజు, ఫ్రాన్స్ రాయబారి మధ్య ఎమ్స్ అనే చోట చర్చలు జరిగాయి. బిస్మార్క్ చర్చల సారాంశాన్ని ప్రజలు తిరుగుబాటు చేసేలా మార్చి పత్రికలలో ప్రచురింపజేసాడు. ఆవేశాలు పెరిగి ఫ్రాన్స్ 1870లో ప్రష్యా పై యుద్దం ప్రకటించింది. ఈ యుద్దం ఆరునెలల పాటు సాగింది. ప్రష్యాకు జర్మనీ సాయపడింది. ఫ్రాన్స్ యుద్దంలో ఓడిపోయింది. ఫ్రాన్స్ లో ప్రజా తిరుగుబాటుతో రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. ఈ యుద్ద ఫలితంగా జర్మనీ ఏకీకరణ పూర్తైంది.

1871 జనవరి 18న వర్సేల్స్ రాజభవనంలో మొదటి విలియం జర్మనీ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. బెర్లిన్ జర్మనీ సమాఖ్యకు రాజధానిగా గుర్తించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *