Results of First World War

మొదటి ప్రపంచ యుధ్ధ ఫలితాలు వ్రాయండి.

Results of First World War

మొదటి ప్రపంచ యుద్దఫలితంగా యుద్దంలో గెలిచిన దేశాలు, ఓడిపోయిన దేశాలు కొన్ని పాఠాలను నేర్చుకున్నాయి. మొదటి ప్రపంచ యుధ్ధం వల్ల భౌగోళికంగా, సాంఘికంగా, ఆర్దికంగా, దేశాల ఆదిపత్యం పరంగా, దేశాల మధ్య ఆలోచనా విదానాల పరంగా చాలా మార్పులు వచ్చాయి.

 

భౌగోళిక మార్పులు

మొదటి ప్రపంచ యుద్ద ఫలితంగా ఐరోపాలో పెద్దఎత్తున భౌగోళిక మార్పులు చోటు చేసుకున్నాయి.

నాలుగు రాజ్యాలు అంతర్ధానమై ఐరోపా దేశాల సరిహద్దులు సమూలంగా మారిపోయాయి.

ఐరోపా ఆదిపత్యం

ప్రపంచవ్యాప్తంగా ఐరోపా ఆదిపత్యం తగ్గకపోగా ఇంకా బలపడింది. మొదటి ప్రపంచ యుద్దానికి మునుపు ఇంగ్లండ్, ఫ్రాన్స్ వంటి సామ్రాజ్య వాద దేశాలు ఏ విధమైన ఆదిపత్యాన్ని కలిగి ఉన్నాయో ఆ ఆదిపత్యం ఇంకా బలపడింది. మధ్య తూర్పు దేశాలకు కూడా వీరి ఆదిపత్యం విస్తరించింది. మధ్య తూర్పు ప్రాంతాలు మొదటి ప్రపంచ యుద్దానికి మునుపు టర్కీ సుల్తాన్ ఆదిపత్యంలో ఉండేవి. అవి ఇప్పుడు ఇంగ్లండ్, ఫ్రాన్స్ ఆధిపత్యంలోకి వచ్చాయి. ఈ ఆదిపత్యం రెండవ ప్రపంచ యుద్దం వరకూ కొనసాగింది.

విదేశీ పెట్టుబడులు

మొదటి ప్రపంచ యుద్దానికి మునుపు ఇంగ్లండ్ ఫ్రాన్స్ లలో ఇతర రాజ్యాల వారు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపేవారు. అయితే ఇంగ్లండ్ ఫ్రాన్స్ లు విదేశీ పెట్టుబడులను పూర్తిగా కోల్పోయాయి.

జర్మనీ కూడా విదేశీ పెట్టుబడులను కోల్పోయింది.

 

అమెరికా ఎదుగుదల

మొదటి ప్రపంచ యుద్దకారణంగా ఇంగ్లండ్, ప్రాన్స్ లు కోల్పోయిన పెట్టుబడులు అమెరికాను చేరాయి. ఐరోపా దేశాలు అమెరికాలో పెట్టుబడులను పెట్టడానికి ఆసక్తి చూపాయి. అమెరికా రుణాలను ఇచ్చే దేశంగా కూడా రూపాంతరం చెందింది.

 

పారిశ్రామిక రంగం

పెట్టుబడులు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా చేరాయి. ఐరోపా పారిశ్రామిక రంగం దెబ్బతినగా, అమెరికా పారిశ్రామిక రంగం అభివృధ్ధి చెందింది. 1929నాటికి అమెరికా ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 42.2% వాటాను కలిగిఉంది. అది అన్ని ఐరోపాదేశాలకంటే అధికం.

 

ఐరోపా ప్రభావం క్షీణత

మొదటి ప్రపంచ యుద్దానికి మునుపు ఐరోపా అనేక రాజకీయ సిద్ధాంతాలకు, ఆధునిక వ్యవస్ధలకు నిలయం. ఐరోపా సిధ్ధాంతాలు, వ్యస్ధలు ప్రపంచం మీద ప్రభావం చూపేవి. మొదటి ప్రపంచ యుధ్ధానంతరం ఈ ప్రభావం లో శక్తి తగ్గిపోయింది. ఐరోపా వారి విధానాలు ప్రభావాన్ని కోల్పోయాయి. పైగా ఆవిధానాల్ని ప్రపంచ దేశాలు ప్రశ్నించడం, సవాలు చేయడం అధికమైంది.

 

ఐరోపాకు అమెరికా రష్యా ల మార్గదర్శకత్వం

ఐరోపా దేశాలు తమ విధివిధానాల్ని రూపొందించుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్, రష్యా నేత లెనిన్ మార్గదర్శకాల్ని అనుసరించాయి. ఐరోపా దేశాలు ఉడ్రో విల్సన్ 14సూత్రాలు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా భావించాయి.

 

జాతీయత భావనల పెరుగుదల

బోల్ష్ విక్ విప్లవం తరహాలోనే బెర్లిన్, హాంబర్గ్, గుడ్ ఫెస్ట్ లలో సోవియట్ లు ఏర్పాటయ్యాయి. లండన్, ప్యారిస్, రోమ్ లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వలస దేశాల్లో విప్లవ బావాలు ప్రచారమయ్యాయి. వలస దేశాలు స్వతంత్రత కోసం పోరాటాల్ని ముమ్మరం చేశాయి.

ఆర్ధికమాంద్యం

యుద్దంలో పాల్గొన్న దేశాలతోపాటూ తటస్ధంగా ఉన్న దేశాలు కూడా ఆర్ధికంగా నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గి ద్రవ్యవిలువ పతనమైంది.

శాస్త్రసాంకేతికత అభివృధ్ది

ప్రపంచ దేశాలు రక్షణకై కొత్త పరికరాల్ని కనిపెట్టడంలో నిమగ్నమయ్యాయి. రక్షణకై క్రొత్త ఆయుధాలను కనిపెట్టారు. సముద్ర యుద్దంలో జలాంతర్గాముల వాడకం ఎక్కువైంది.

నానాజాతి సమితి

యుధ్ధం వల్ల ఓడిన దేశాలతో పాటూ గెలిచిన దేశాలు కూడా నష్టాన్ని చవిచూసాయి. దీనివల్ల ప్రపంచ దేశాలు అంతర్జాతీయ శాంతి సంఘం ఉండాలనే భావనను పెంపొందించుకన్నాయి. ఉడ్రోవిల్సన్ 14సూత్రాలను అనుసరించి ‘నానాజాతి సమితి’ పేరుతో అంతర్జాతీయ శాంతి సంస్ధ ఏర్పాటైంది. ఇది అంతర్జాతీయ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోడానికి ఒక వేదిక గా ఉపయోగపడింది. ‘నానాజాతి సమితి’ విఫలమైనా దేశాలమధ్య సాంకేతిక, ఆర్ధిక సహకారాన్ని పెపొందిచడంలో సఫలమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *