Reasons for first world war

 

మొదటి ప్రపంచ యుద్దానికి కారణాలు వ్రాయండి?

Reasons for first world war

తీవ్రమైన జాతీయభావం

పునరుజ్జీవన ఫలితంగా జాతీయభావం అదికమైంది. ఒకే జాతి ప్రజలందరూ కలిసి జీవించాలనే కోరిక బలపడింది. ఇదే జాతీయభావం ఇటలీ, గ్రీస్, జర్మనీ, బల్గేరియా, సెర్బియా, రుమేనియా మొదలైన దేశాలు స్వతంత్రం సంపాదించడానికి కారణమైంది. మరోవైపు తమజాతే మిగతాజాతులకన్నా గొప్పది, తమ జాతికే ప్రపంచాన్ని ఏలడానికి అర్హత ఉందని భావించే మితిమీరిన జాతీయ భావం ప్రపంచయుద్దానికి దారితీసింది. ఇటలీ, జర్మనీలు తమ జాతులు అత్యున్నతమైనవనే భావనను పెంచుకుని దౌర్జన్యకర దేశాలుగా మారాయి. హద్దులు మీరిన జాతీయభావం వివిద దేశాలమధ్య శతృత్వానికి దారితీసింది.

రహస్య యుద్దకూటములు

జర్మనీ చాన్సలర్ ఆటోవాన్ బిస్మార్క్ రాజకీయ దౌత్యంతో యుద్దకూటములకు తెరతీసాడు. కౌంట్ కేవర్, రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ కూడా ఇటలీ ఏకీకరణకోసం దౌత్య సంబంధాలను ఏర్పరచుకొని యుద్ద కూటములు ఏర్పడటానికి కారణమయ్యారు.

త్రిరాజ్య కూటమి– 1879లో బిస్మార్క్ ఆస్ట్రియాహంగెరి లతో ద్వైపాక్షిక మైత్రిని ఏర్పరచుకున్నాడు. ఫ్రాన్స్ తన దేశం నుండి ఆల్సెస్లోరైన్ ప్రాంతాలను ఆక్రమించుకుంటుందనే భయంతో బిస్మార్క్ ద్వైపాక్షిక మైత్రిని ఏర్పరచుకున్నాడు. 1882లో వీటితో ఇటలీ కూడా కలిసి అది త్రిరాజ్య సంధిగా ఏర్పడింది. ఫ్రాన్స్ నుండి భయం వల్ల ఇటలీ కూటమిలో చేరింది.

త్రైపాక్షిక కూటనిఫ్రాన్స్ రష్యా దేశాలకు బ్రిటన్ వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. చివరికి 1894లో ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిని త్రైపాక్షిక కూటమి అంటారు.

మూడు దేశాలు నైలు లోయ పైన బ్రిటన్ అధికారాన్ని, మొరాకో పైన ప్రాన్స్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ, పర్షియాను రష్యా, ఇంగ్లాండ్ లు పంచుకునే విధంగా ఒప్పందం చేసుకున్నాయి.

రహస్య కూటముల వల్ల, అందులోనూ బలమైన దేశాలు కూడా కూటములను ఏర్పరచుకోవడం వల్ల విపత్కర పరిస్ధితులకు దారితీసింది. ప్రతిదేశం మంచి చెడులతో సంబంధం లేకుండా తన కూటమిలోని దేశానికే లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నంచడం దేశాల మధ్య తీవ్ర అసంతృప్తికి ఉద్రిక్తతలకు దారితీసింది.

తీవ్రమైన సైనికవాదం

వలసల వల్ల, పారిశ్రామిక విప్లవంతో ఉత్పత్తి పెరిగింది. ప్రతి దేశం తమ సైనిక శక్తిని, నౌకా దళ శక్తిని పెంపొందిచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంగ్లండ్, జర్మనీలు నౌకాదళం పెంపులో పోటీ పడ్డాయి. దీనికి తోడు నౌకా స్ధావరాలు, నౌకా యాన మార్గాలకు మరో దేశం వల్ల అడ్డంకి రాకుండా ఒప్పందాలు, యుద్దాలు చేసుకున్నాయి. 1913నాటికి ఆయుధోత్పత్తి పెరిగింది. ఆయుధాల సంఖ్య పెరగడంతో దేశాల మధ్య అభద్రతా భావం పెరిగిపోయింది.

 

ఆర్ధిక స్ఫర్ధ

పారిశ్రామిక విప్లవం వల్ల ఉత్పత్తి తరిత గతిన పెంచడం సాధ్యపడింది. పారిశ్రామిక విప్లవం వల్ల ముడి సరుకుల అవసరం, ఉత్పత్తి చేసిన సరుకులకు మార్కెట్ దేశాలను వెతకవలసిన అవసరం పెరిగింది. దీనికై వలస విధానం అభివృధ్ధిచెందింది. తమ లాభం కోసం క్రత్త ప్రాంతాల అన్వేషణ ప్రారంభించాయి. క్రిష్టియన్ మిషనరీలు మొదట వలల దేశాల్లో అడుగుపెట్టి దీనికి సంబంధించిన పునాదిని ఏర్పరచాయి. తరువాత కంపెనీలు ప్రాంతాల్లో అడుగుపెట్టి తమ ప్రణాళికను అమలుచేసేవి.

 

వలసలకోసం ఘర్షనలు

యూరోప్ లోని ప్రతి దేశం కొన్ని వలస ప్రాంతాలను కలిగి ఉండాలని ప్రయత్నించాయి. వలసపై ఆధిపత్యం దోపిడీగా భావించక మాతృదేశం పై గౌరవంగా భావించాయి. ఇంగ్లండ్, జర్మనీల మధ్య వలసలపై ఆదిపత్యం కొరకు పోటీ దేశాలమధ్య పోరాటానికి దారితీసింది.  ఫ్రాన్స్ జర్మనీల మధ్య మొరాకో కోసం ఘర్షణ ప్రారంభమైంది. ఫ్రాన్స్ కోసం ఇంగ్లడ్ బరిలోకి దిగగా అధి ఇంగ్లండ్ జర్మనీల మధ్య వైరంగా మారింది. రష్యా కాన్ స్టాంటినోపుల్ (ఇస్తాంబుల్) పై ఆధిపత్యం గురించి ప్రయత్నించింది. సామ్రాజ్యవాద కాంక్ష్య దేశాల మధ్య వైరానికి దారితీసింది.

 

బాల్కన్ యుద్దాలు

బాల్కన్ లలో సెర్బియా రాజ్య ఆవిర్బావం, ఆస్ట్రియాహంగేరి నుండి బోస్నియా హెర్జిగోవినాలను ఆక్రమించుకోవాలనే కాంక్ష, సెర్బియా విస్తరణను ఆస్ట్రియా ఆడ్డుకోవడం, సెర్బియాకు రష్యా మధ్దతు తెలపడం,ఇదే సమయంలో బోస్నియాహెర్జిగోవినా లను ఆస్ట్రియా ఆక్రమించుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.

 

సాంఘిక కారణాలు

డార్విన్ సిధ్ధాంతాన్ని సైన్యం తమకు అన్వయించుకోవడం యుద్దానికి దారితీసింది. బలమైన జీవులే భూమ్మీద మనగలుగుతాయనే డార్విన్ సిధ్ధాంతం ప్రకారం ప్రతిదేశం సైన్య శక్తిని పెంపొందిచుకొని బలహీన దేశాల ఆక్రమణకు పూనుకున్నాయి. యుద్దం మానవ మనుగడలో భాగం అని, పరిస్ధితులను ఎదుర్కొని మనుగడను చాటుకోవాలని, కొన్ని దేశాలు తమ జాతే బలమైనదని భావించడం దేశాల మధ్య యుద్దానికి దారితీసింది.

 

పత్రికల పాత్ర

మొదటి ప్రపంచ యుద్దానికి ముందుకాలంలో పత్రికల నిండా యుద్దవాతావరణాన్ని పెంపొందిచే అంశాలే ఎక్కువగా ప్రచురించబడ్డాయి. ప్రసిధ్ధ చరిత్రకారుడు ఫే తన గ్రంధంఆరిజన్ ఆఫ్ ది వరల్డ్ వార్ – I’ లో పత్రికలు మితిమీరిన జాతీయవాదాన్ని ప్రచారం చేసి, శాంతికి సంబంధించిన భావాలను విస్మరించాయని పేర్కొన్నాడు.

 

అంతర్జాతీయ శాంతి సాధన లేకపోవడం

అంతర్జాతీయ శాంతిసాధనం లేకపోవడం మొదటి ప్రపంచ యుద్దానికి ఒక కారణం. ప్రస్తుతం ఉన్న ఐక్యరాజ్య సమితి వంటి సంస్ధలు ఆకాలంలో లేకపోవడం దేశాల మధ్య యుద్దానికి దారితీసింది. వియన్నా కాంగ్రెస్ వంటి శాంతికై ఏర్పరచిన సమావేశాలు కొన్ని రాజ్యాల పక్షం వహించి పక్షపాతంతో వ్యవహరించడం యుద్దాల్ని అనివార్యం చేసాయి. 1889, 1907 హేగ్ సమావేశాలు కూడా సమస్యలను పరిష్కరించలేకపోయాయి. దీనితో మొరాకో యుద్దాలు, బాల్కన్ యుద్దాలు చోటుచేసుకున్నాయి. ప్రతిదేశం ప్రపంచ శాంతి గురించి కాకుండా తమ స్వంత లాభం గురించి ఆలోచించడం యుద్దాన్ని అనివార్యం చేసాయి.

 

28 జూన్ 1914 ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫెర్డినాండ్ సెరాజివోలో హత్యగావించబడటం మొదటి ప్రపంచ యుద్దానికి తక్షణ కారణం అయింది. ఆస్ట్రియా రాజు కుమారుడైన ఫెర్డినాండ్, అతని భార్య సోఫియా లు సెరాజివో  సందర్శనలో ఉన్నప్పుడు ఒక సెర్బియన్ యువకుడు వారిని కాల్చి చంపాడు. ఆందుకు ఆస్ట్రియా సెర్బియాను కారణంగా భావించి యుద్దం ప్రకటించింది.

సెర్బియాకు రష్యా సాయంగా నిలిచింది. జర్మనీ ఆస్ట్రియా పక్షం వహించింది. టర్కీ బల్గేరియాలు జర్మనీకి సాయంగా వచ్చాయి. రెండు కూటముల్లోని దేశాలు శతృదేశాలుగా నిలిచి మొదటి ప్రపంచ యుద్దానికి కారణమయ్యాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *