Mao Tse Tung and Chinese People’s Republican Army

మావో- చైనా పీపుల్స్ రిపబ్లిక్ 1949 ?

Mao Tse Tung and Chinese People’s Republican Army

1  అక్టోబర్ 1949న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. దానికి ముందు ముప్పై సంవత్సరాల నుండీ జరిగిన పోరాటం ఫలితంగా చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది.

1920 నుండి మావో సెటుంగ్ మరియు ఇతర  చైనా నాయకులు కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా ఉన్నారు.

1928-34 సంవత్సరాల మధ్య చైనా కమ్యూనిజం ఒక రూపుదిద్దుకోడానికి కీలక వ్యక్తి మావో. 1935-45 సంవత్సరాల మధ్య కష్ట కాలంలో రాజకీయ, సైనిక శక్తిని బలపరచడంలో మంచి వ్యూహాలను మావో రచించాడు. అందువల్లే 1949 అంతర్యుధ్ధంలో గెలుపు సాధ్యమైంది. 1976 సెప్టెంబర్ చనిపోయేంత వరకూ మావో చైనా కమ్యూనిజాన్ని మెరుగులు దిద్దుతూ చైనాని నడిపించాడు.

చైనాకు 4,000 సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా రాజవంశాల పాలనలో చైనా ఐఖ్యంగా ఉంది. కింగ్ రాజ్యం మంచూ రాజవంశస్తులచే 1644లో స్ధాపించబడి 1912 వరకు చైనాను పరిపాలించింది. మంచూ రాజవంశస్తులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో విఫలమవడమే చైనా పతనానికి కారణంగా భావిస్తారు.

మొదటి ప్రపంచ యుధ్ధంలో చైనా తన సైన్యాన్ని పంపకున్నా 100,000 మంది పనివారిని జర్మనీ, ఆస్ట్రియా-హంగరీకి వ్యతిరేకంగా ఫ్రాన్స్, బెల్జియంకు సాయంగా పంపింది. 1917 జనవరిలో చైనాలో జపాన్ మంచూరియా, మంగోలియా ప్రాంతాలలో ప్రత్యేక హక్కులను సాధించింది. మొదటి ప్రపంచ యుధ్ధానంతరం చేసుకున్న వెర్సైల్స్ సంధిలో షాంటుంగ్ ప్రాంతాన్ని చైనాకు ఇవ్వకుండా జపాన్ కు ఇచ్చారు. దీనితో చైనాలో జపాన్, యూరప్ వ్యతిరేక భావనలు నెలకొన్నాయి.

చైనాలో భూస్వాముల ఆధిపత్యం ఉండేది. వారు ఆధునికీకరణకు వ్యతిరేకులు. చైనా జనాభాలో అత్యధికులైన రైతుకూలీలను వారు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. వారు చాలా పేదరికంలో జీవిస్తూ కరువు కాలంలో ఈగల్లా చనిపోయేవారు. పట్టణ ప్రాంతంలోని వ్యాపారులకు కూడా సాంకేతిక పరిజ్ఞానం లేదు. సాంఘిక సంస్కరణ ఏమాత్రం జరగలేదు.

 

విధ్యావంతులైన కొందరు చైనీయులు ఆధునికీకరణను ఆకాంక్షించారు. రాజ్యాంగ రాచరికాన్ని ఆకాంక్షించే క్వాంగ్ యువి లాంటి వారు కింగ్ రాజ్య రాజు ‘గ్వువాంగ్జు’ చైనాని ఆదునికీకరిస్తాడని భావించారు. 1908లో గ్వువాంగ్జు మరణంతో మైనర్ అయిన ‘పుయి’ రాజయ్యి అతని తరుపున అతని తల్లి రాణి ‘సిక్సి’ పరిపాలనను నిర్వహించేది. దీనితో పరిపాలన పేలవంగా సాగింది.

 

చైనాలో కమ్యూనిజం ప్రారంభం

పలువురు చైనా మేధావులు మార్కిస్టు భావాలకు ప్రభావితులయ్యారు. మార్క్సిస్టు భావాలు చైనా పరిస్ధితులకు యధావిధిగా సరిపడవు. దీనివల్ల కొద్దికాలంలోనే చైనా సామ్యవాదులు అరాచకవాదులుగా మారారు.

1918జూన్ లో బీజింగ్ యూనివర్సిటీ లైబ్రెేరియన్ లి డజావో మార్క్సిస్టు స్టడీ గ్రూప్ ను ప్రారంభించారు. 1919లో మావో మార్క్సిస్టు స్టడీ గ్రూప్ లో సభ్యుడిగా చేరాడు. మావో బీజింగ్ లైబ్రరీలో క్లర్క్ గా ఉధ్యోగానికి కుదిరాడు.

 

రష్యాలో ఎక్కువ సంఖ్యలో కార్మికులు ఉన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా చైనాలో రైతుకూలీలు అధికంగా ఉండి కార్మికులు అతి కొద్ది మంది ఉన్నారు. అందువల్ల రష్యా కమ్యూనిజం చైనాకు సరిపడదు. రైతుకూలీలకు భూస్వాములనుండి స్వాతంత్ర్యం లభించకుండా చైనాకు స్వాతంత్ర్యం లభించదని మేధావులు భావించారు. దీని ప్రకారం లి డజావో కమ్యూనిస్టులు పల్లె ప్రాంతాలకు వెళ్ళి వారిని చైతన్య పరచాలని సూచించాడు.

 

మావో లి డజావో బావాలతో ఏకీకరణ వ్యక్తం చేశాడు. రష్యా కమ్యూనిస్టులకు రైతుకూలీలతో చైనా విప్లవాన్ని నడిపించాలనే మావో ఆలోచన నచ్చలేదు. చైనాలో విప్లవాన్ని నడిపి యూరప్ సామ్రాజ్య వాదులను పారద్రోలి చైనాను తమకు లాభకరంగా ఉపయోగించుకోవాలనే భావన రష్యాలో ఉంది. కొమింటర్న్ పార్టీతో బ్రిటన్ సంబంధాలను ఏర్పరచుకుంది. చియాంగ్ కు సాయం అందించడం ద్వారా జర్మనీ చైనాకు దగ్గరైంది.

  1. The Civil War.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పైన అణుబాంబులు వేయడంతో జపాన్ ఓటమిని అంగీకరించింది. చైనాపై జపాన్ ఆధిపత్యం క్షీణించింది. దీనితో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సైన్యం, కొమింటర్న్ పార్టీ సైన్యంలో దేనికి మంచూరియా పై ఆధిపత్యం వస్తుందనే విషయంలో సంధిగ్ధం నెలకొంది.

జనరల్ జార్జ్ సి. మార్షల్ ను అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ ప్రత్యేక రాయబారిగా 1945 డిసెంబర్ లో చైనాకు పంపాడు. ఆయనకు అప్పగించిన బాధ్యత చైనా కమ్యూనిస్టులుకు, కొమింటర్న్ పార్టీకి మధ్య రాజీని కుదర్చడం. నిజానికి అప్పటికే జపాన్ సైన్యాలు కొమింటర్న్ కు గానీ, అమెరికాకు గానీ లొంగిపోవాలని ఆదేశాలు జారీచేసి ఉన్నారు. ఇది చియాంగ్ కు సిద్దించిన విజయం.

ఇదే సమయంలో 1945 అగస్టులో రష్యా మంచూరియా పై దాడి చేసి జపాన్ ను సునాయాసంగా ఓడించి జపాన్ ఆయుధాలను చైనా సైన్యానికి ఇచ్చి, జపాన్ కర్మాగారాలను మాత్రం రష్యాకు తరళించింది. ఇదే సమయంలో స్టాలిన్ అమెరికాతో సమస్య తలెత్తకుండా చైనాతో (చియాంగ్ తో )ఒక ఒప్పందం చేసుకున్నాడు.

జనరల్ మార్షల్ 1946 మే లో చైనా కమ్యూనిస్టులకు – కొమింటర్న్ నాయకులకు మధ్య ఒప్పందాన్ని కుదిర్చాడు. చైనా కమ్యూనిస్టులు ఇచ్చిన విలువ ఆ ఒప్పందానికి కొమింటర్న్ నాయకులు ఇవ్వలేదు. అనతికాలంలోనే ఒప్పందాన్ని మీరటం మొదలుపెట్టారు.

 

చైనా కమ్యూనిస్టులు – కొమింటర్న్ మధ్య 1946 వేసవి కాలంలో యుధ్ధం సంభవించింది. కొమింటర్న్ సైన్య చైనా కమ్యూనిస్టు సైన్యానికన్నా మూడింతలు ఉంది. కానీ సైన్యంలో రైతుకూలీలు అధికంగా ఉన్నారు. చైనా కమ్యూనిస్టులు చేపట్టిన భూసంస్కరణల పట్ల ఆకర్షితులైన వారు చైనా కమ్యూనిస్టుల పక్షాన చేరారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంఖ్య పెరిగింది. చైనా కమ్యూనిస్టులు 1931-34లో జియాంగ్జి ప్రావిన్స్ లో, 1938-45 మధ్య ఉత్తర చైనాలో భూసంస్కరణలు చేపట్టి భూమిని రైతు కూలీలకు, భూమి లేనివారికి పంచినా, కొంత భూమిని భూస్వాములకు కూడా కేటాయించారు. వారు భూస్వాములను పూర్తిగా దూరం చేసుకోలేదు. ప్రజలను దారుణంగా దోచుకున్న భూస్వాములను మాత్రం చంపారు.

 

చియాంగ్ కొమింటర్న్ సైన్యం పాత పద్దతిలో పోరాడుతూ ప్రాకారయుతమైన కోటల్లో ఉంది. మావో సైన్యం ఆ కోటలను చుట్టుముట్టేది. అనేక సందర్బాల్లో కొమింటర్న్ సైన్యం మావో పక్షాన చేరింది. అనతికాలంలోనే మావో సైన్యం చియాంగ్ సైన్యాన్ని ఓడించింది. జపాన్ తో యుద్ధానంతరం సంబవించిన ఆర్ధిక మాంధ్య పరిస్ధితుల కారణంగా చియాంగ్ కి చైనాలో వ్యతిరేకత పెరిగింది. సివిల్ సర్వెంట్లు, వ్యాపారులు మావో కి మధ్ధతుగా నిలిచారు. మావో వ్యక్తిగత ఆస్తి కలిగివుండటాన్ని బహిష్కరించకపోవడం కూడా దీనికి ఒక కారణం.

 

రష్యా చియాంగ్ – మావో మధ్య సంధికి ప్రయత్నించింది. కానీ మావో దానికి అంగీకరించలేదు.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యాంగ్ ట్సె నదిని ఏప్రిల్ 1948లో దాటి గ్వాంగ్జు ప్రాంతానికి చేరుకుంది. చియాంగ్ చైనా రిపబ్లిక్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడు. అతని అనుచరులు ఫార్మోసా (తైవాన్) కు పారిపోయి ఫ్రీ చైనా ప్రభుత్వాన్ని ప్రకటించారు. బీజింగ్ కేంద్రంగా 1 అక్టోబర్ 1949న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పరచబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *