How Mustafa Kemal Pasha modernised Turkey

ముస్తఫా కెమాల్ పాషా టర్కీని ఏవిధంగా ఆధునికీకరించాడు?

How Mustafa Kemal Pasha modernised Turkey?

ఆధునిక టర్కీ వ్యవస్ధాపకుడు ఆటాటర్క్ ముస్తఫా కెమాల్ పాషా. ఆటాటర్క్ అంటే అర్ధం శ్రేష్టమైన టర్క్. కెమాల్ అంటే అర్ధం పరిపూర్ణుడు. కెమాల్ మొదటి ప్రపంచ యుధ్ధంలో గొప్ప యోధునిగా కీర్తి గడించాడు.

 

మొదటి ప్రపంచ యుద్దం తరువాత 1919లో టర్కీకి అవమానకరమైన సెవ్రస్ సంధి ఒప్పుకోవాల్సివచ్చింది.

మిత్రకూటమి రాజ్యాలు విస్తారమైన సారవంతమైన టర్కీ భూభాగాలను ఆక్రమించుకొని టర్కీ చేత పరిహారం చెల్లించేవిదంగా ఒప్పందం చేసుకుని, టర్కీ ప్రాదేశిక జలాలపై ఆధిపత్యాన్ని సంపాదించారు.

1915 గాల్లిపోలి యుద్దంలో కమాండర్ గా ముస్తపా కెమాల్ పాషా బ్రిటీష్ వారిని తరిమికొట్టి మంచి యోధుడిగా పేరు గడించాడు. టర్కీ సుల్తాన్ మిత్రకూటమి సేవకుడిగా వ్యవహరిస్తున్నాడని కెమాల్ తీవ్రంగా విమర్షించాడు.

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అసమర్ధుడైన సుల్తాన్ కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో కృతకృత్యుడయ్యాడు.

1919 సెప్టెంబర్ లో కెమాల్ జాతీయవాదుల మహాసభను నిర్వహించాడు. ఈ సభలో ఆరుసూత్రాల జాతీయ ఒప్పందం ఆమోదం పొందింది. దీనిలో భాగంగా స్వయం నిర్ణయాధికార హక్కు, కౌల్దారీ రధ్ధు, కాస్టాంటినోపుల్ (ఇస్తాంబుల్) రక్షణ, జలసంధులపై నూతన ఒప్పదాలు చేసుకున్నాడు.

1919 అక్టోబర్ ఎన్నికలలో కెమాల్ అనుకూలురు మెజార్టీ సాధించారు.

1920 జనవరి పార్లమెంట్ సమావేశంలో జాతీయవాదుల ఒడంబడికను పార్లమెంట్ ఆమోదించింది.

కెమాల్ అంతిమ పోరాటానికి తెరతీస్తూ ఆసియా మైనర్ కేంధ్రం అంకారాలో జాతీయవాదుల సమావేశాన్ని నిర్వహించాడు.

1919 గ్రీక్ పై విజయం

గ్రీకు సేనలు 1919 వసంత రుతువులో స్మిర్మా లోకి ప్రవేశించడంతో టర్కీ విభేధాలను మరచి ఐక్యం అయ్యారు. కెమాల్ సంకీర్ణ దేశాల మధ్య విభేధాలను అవకాశంగా తీసుకొని వారితో విడివిడిగా ఒప్పందాలు చేసుకున్నాడు. గ్రీక్ ల పట్ల ఫ్రెంచ్, ఇటలీల లో అసూయను పెంచాడు. ఫ్రెంచ్, ఇటలీ, రష్యాలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకున్నాడు. గ్రీక్ ను ఏకాకిని చేసి వారి ఓటమికి బాటలు వేసాడు.

1920 ఏప్రిల్ 23న సుల్తాన్ పరిపాలనను ఖండిస్తూ కెమాల్ అధ్యక్షుడిగా తాత్కాలిక నూతన ప్రభుత్వాన్ని ఏర్పరచారు.

 

కెమాల్ సాహసవంతమైన సారధ్యంలో జాతీయవాదులు అనేక పెద్ద అవాంతరాలను అధిగమించారు. టర్కిష్ ప్రజలు కూడా ఐక్యంగా కెమాల్ కు మధ్ధతునిచ్చారు.

24 జులై 1923 – కెమాల్ సెవ్రస్ సంధి సమీక్షను కోరి లాసన్నే ఒప్పదం చేసుకున్నాడు. దీని ద్వారా తూర్పు థ్రేస్, కొన్ని ఏజియన్ దీవులు టర్కీ వశమయ్యాయి.

టర్కీ చెల్లించాల్సిన పరిహారాలు రధ్ధయ్యాయి. కౌలుదారీ రధ్ధైంది. న్యాయ సంస్కరణలు చేశాడు. జలసంధులపై సైనిక హక్కులు రధ్ధయ్యాయి. శాంతి సమయంలో మాత్రమే ఇతరదేశాల నౌకలను తన ప్రాదేశిక జలాల్లోకి అనుతించడానికి ఒప్పుకున్నాడు.

29 అక్టోబర్ 1923 ఒట్టోమాన్ సామ్రాజ్యం అంతరించి టర్కీ రిపబ్లిక్ గా అవతరించింది. కెమాల్ నూతన ప్రభుత్వానికి అధ్యక్షుడయ్యాడు.

కెమాల్ టర్కీని ఆధునికీకరించడం పై దృష్టిని సారించాడు. దీనికై కాలంచెల్లిన సంస్ధలను పెకిలించివేసాడు. సంస్కరణలతో టర్కీని ఆధునికీకరించాడు.

టర్కీ అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. కెమాల్ కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా ప్రాజ్ఞనిరంకుశుడిగా వ్యవహరించి టర్కీ అభివృధ్దికి బాటలు వేసాడు.

 

1923 – 1928 మొదటి విడత సంస్కరణలు

కెమాల్ టర్కీ ఆధునికీకరణ తీసుకున్న నిర్ణయాల పట్ల మితవాదులలో, ముస్లింలలో వ్యతిరేకత వచ్చింది. 1925లో ఒక మితవాద షేక్ సారధ్యంలో కుర్ధిష్ తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటును అణచివేసిన కెమాల్, ఇదే అదనుగా అన్ని రాజకీయ పార్టీలను నిషేధించాడు. దీనితో సంస్కరణలకు మార్గం సుగమం అయింది.

రాజకీయ సంస్కరణలు

1924లోనే కెమాల్ ఇస్లాం మత ప్రభావం నుండి రాజ్యాన్ని విముక్తం చేసేదిశగా చర్యలు తీసుకున్నాడు. కుర్ధిష్ తిరుగుబాటును సాకుగా చేసుకుని మదర్సాలను, మతాచార్య వ్యవస్ధను రద్దుచేశాడు. . 3 మార్చి 1924లో ఖలీపా వ్యవస్ధను రధ్ధుచేస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు.

సైన్యం ఒకే యూనిపారం ధరించాలని, పౌరులు టోపీలు ధరించాలని ఉత్తర్వులు జారీచేశాడు.

6 డిసెంబర్ 1934 సవరణ ప్రకారం అసెంబ్లీ ప్రతినిదులనుండి ఒకిరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. అసెంబ్లీ పదవీకాలమే అతని పదవీకాలం.

5 ఫిబ్రవరి 1937న రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ ఆరుసూత్రాలను అసెంబ్లీ అంగీకరించింది. అవి – రిపబ్లికనిజం, నేషనలిజం, డెమొక్రసీ, పరిణామవాదం, ప్రభుత్వం నుండి మతాన్ని వేరుచేయడం, ముఖ్య పరిశ్రమలను ప్రభుత్వం నిర్వహించడం.

 

సాంఘిక సంస్కరణలు

మదర్సాలను ప్రభుత్వ విద్యా కమిషనరేట్ కు అప్పగించాడు. సాంకేతిక, వృత్తివిద్యకు ప్రాధాన్యతనిచ్చాడు. తాను నిరంకుశుడిగా పాలించినా ప్రజాస్వామ్య సూత్రాల గురించి ప్రజలను విద్యావంతులను చేశాడు.

శాసనాలపై, విద్య పై ఇస్లాం ప్రభావం వల్ల టర్కీలో సంస్కరణలు వేగవంతం కావట్లేవని గ్రహించిన కెమాల్, ఇస్లాం ప్రభావం నుండి టర్కీని బయటపడేయాలని 9 ఏప్రిల్ 1928న టర్కీని లౌకిక రాజ్యంగా ప్రకటించాడు.

స్త్రీ స్వేచ్చను ప్రసాధించాడు. స్త్రీలకు సమాన హక్కులనిచ్చాడు. దీనికి సూచనగా 12 ఏప్రిల్ 1935లో టర్కీలో 12వ అంతర్జాతీయ మహిళల మహాసభను నిర్వహించారు.

6 డిసెంబర్ 1934న గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని మార్చి 23ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీ/పురుషునికి ఎన్నికల్లో పోటీచేసే హక్కును ప్రసాదించాడు.

1935లో వారానికి ఒక సెలవు దినంగా శుక్రవారం బదులు ఆదివారాన్ని ప్రకటించాడు.

పురాతన టర్కిష్ బిరుదులు పాషా వంటివాటిని నిషేధించి పాశ్చాత్య దేశాల పద్దతిలో వంశ నామాల్ని చేర్చాడు.

అన్ని పౌర హక్కులకు, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాడు.

1929లో కెమాల్ ఒక రాజకీయ పార్టీని అనుమతించాడు. అది కెమాల్ సంస్కరణలకు వ్యతిరేకంగా చాలా ప్రదర్శనలు నిర్వహించింది. ప్రజాస్వామ్యానికి ఇంకా సమయం ఆసన్నం కాలేదని కెమాల్ గుర్తించాడు.

కొత్త సివిల్ కోడ్, క్రిమినల్ కోడ్, రోమన్ అక్షరమాల, పాశ్చాత్య క్యాలెండర్ ను ప్రవేశపెట్టాడు.  టర్కీలు తమ వేష భాషల్ని మార్చుకోవాలని కూడా శాసించాడు.

 

స్టేటిజం

టర్కీని ఆర్ధికంగా బలవంతంగా తయారుచేయడానికి కెమాల్ స్టేటిజం అనే నూతన ఆర్ధిక విధానాన్ని అనుసరించాడు. వీలైనన్ని రంగాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే స్టేటిజం. రైతులకు సబ్సిడీలు ప్రకటించాడు. నూతన వ్యవసాయ విధానాల్ని ప్రవేశపెట్టాడు. సహకార సంఘాల్లో రైతులను సభ్యులుగా చేశాడు.

ఆర్ధిక మాంద్య కాలంలో కెమాల్ సూచనలతో టర్కీ ఆర్దిక మాంద్య పరిస్ధితులను సమర్ధవంతంగా ఎదుర్కొంది. 1930లో ఎగుమతికి పనికివచ్చే పంటలను పండించాలని రైతులకు సూచించాడు. దీని కారణంగా రైతులు ఆర్ధికమాంధ్య పరిస్ధితులను తట్టుకోగలిగారు.

రైల్వేలు, రేవులు, నౌకా రవాణాను జాతీయం చేశాడు.

ప్రభుత్వ నిధులతో కాగితం, జౌళి, గనులు, ఉక్కు, ఇనుము పరిశ్రమల విస్తరణ చేశాడు.

కెమాల్ సంస్కరణల వల్ల బయటిదేశాలకు వలస వెళ్లిన రైతులు తిరిగి టర్కీకి వచ్చారు. వారికి ప్రోత్సాహకాల్సని ప్రకటించాడు. వ్యవసాయ పాఠశాలన్ని నెలకొల్పాడు. ప్రత్యేక ఫామ్ లను ఏర్పాటు చేసాడు. నీటి పారుదల సౌకర్యాలను అబివృధ్ధి పరచి పొగాకు, పత్తి పంటల అబివృధ్ధికి చర్యలు తీసుకున్నాడు.

1933లో పంచవర్ష ప్రణాళికల్ని ప్రకటించాడు.

యాజమాన్య వ్యవహారాలకు సమర్ బ్యాంకు ను,

ప్రభుత్వ యాజమాన్యంలోని పరిశ్రమల సాయానికి ఎయిపుల్స్ బ్యాంకు ను,

ఖనిజ, లోహ పరిశ్రమల అభివృధ్ధికి 1936లో ఎ.టి. బ్యాంక్ ఏర్పాటు చేశాడు.

 

ఫాసిజం కమ్యూనిస్టు ప్రభుత్వాలకు భిన్నంగా అదేరకమైన పరిస్దితుల్లో కెమాల్ ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని లౌకిక రిపబ్లిక్ ను ఏర్పరచి టర్కీని ఆధునికీకరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *