Give a detailed account of Hitler’s Nazi government in Germany

జర్మనీ లో హిట్లర్ నాజీ ప్రభుత్వం గురించి వ్రాయండి?

Give a detailed account of Hitler’s Nazi government in Germany

Rise and Fall of Hitler

రెండు ప్రపంచయుధ్ధాల మధ్య కాలంలో (1918-1939) ఐరోపా యుద్ధ నీడల్లో గడిపింది. పేరుకి యుధ్ధం ముగిసినా, వివిధ దేశాల మధ్య వేల సంఖ్యలో ఒప్పందాలు జరిగినా ప్రపంచ దేశాలు సుఖసంతోషాలతో లేవు. యుధ్ధంలో పాల్గొన్న దేశాలతో పాటూ తటస్ధ దేశాలపై కూడా యుధ్ధ ప్రభావం పడింది. అంతర్జాతీయ శాంతికై ఏర్పడిన నానాజాతి సమితి కొన్ని అగ్ర రాజ్యాలను, రాచరికాలను మాత్రమే సంతృప్తి పరచగలిగింది. ఆ దేశాలు కూడా తీవ్ర ఆర్ధిక మహా సంక్షోభం నుండి బయటపడలేక పోయాయి. ప్రజలు అధికారంలో మార్పు కోరుకున్నారు. ఐరోపా అంతటా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉధ్యమాలు చేశారు. తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న ప్రజలు నియంతల పై నమ్మకం పెంచుకున్నారు.

మొదటి ప్రపంచయుద్దానంతరం జర్మన్ చక్రవర్తి రెండవ విలియం హాలెండ్ కు పారిపోయాడు. ఫ్రెడరిక్ ఎబర్ట్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయినా పరిస్ధితిలో మార్పు లేకపోవడంతో జర్మనీలో రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని నిర్ణయించారు. 1919లో వైమార్ లో తయారు చేసిన నూతన రాజ్యాంగంతో వైమార్ రిపబ్లిక్ ఏర్పడింది. రిపబ్లిక్ ప్రభుత్వం కూడా స్ధిరంగా పాలించలేకపోయింది. 1918-22మధ్య జర్మనిలో తీవ్ర అల్లకల్లోల పరిస్ధితులు నెలకొన్నాయి.

1923 – జర్మనీ పారిశ్రామిక ప్రాంతం రూర్ ని ఫ్రాన్స్ ఆక్రమించింది. తిగబడి ఓడిన జర్మనీ యుధ్ధ నష్టపరిహారం చెల్లించింది. దీనివల్ల ద్రవ్యోల్బనం ఏర్పడింది. ఇలాంటి పరిస్ధితిలో ఆధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించిన నాజీ పార్టీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ అరెస్టు చేయబడ్డాడు.  జైలులో ఉన్న కాలంలో హిట్లర్ ఆత్మకథ ‘మెయన్ కాంఫ్’ ను రచించాడు.

జర్మని – హిట్లర్ – నాజీ ప్రభుత్వం

1923-33మధ్య నాజీ పార్టీ సభ్యులు దేశవ్యాప్తంగా తమ భావాలను విస్త్రుతంగా ప్రచారం చేశారు.

బ్రౌన్ షర్ట్స్ నాజీల దళం. అది కమ్యూనిస్టులపై విజయం సాధించింది. సైనిక అసమర్ధత వల్ల కాకుండా, ప్రభుత్వ విధానం వల్ల జర్మనీ మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిందని అంతా భావించేవారు. ముఖ్యంగా సైన్యం కూడా ఇదే భావనతో ఉండేది. హిట్లర్ చాలామంది సైనికాధికారుల మద్ధతు కూడగట్టాడు. అంతకు ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జర్మన్ జాతి అత్యుత్తమమైనదని కీర్తిస్తూ హిట్లర్ తన వాగ్ధాటితో మధ్యతరగతి, వ్యాపార వర్గాల మద్ధతు కూడా సంపాదించాడు.

 

జర్మన్ లు జీవించేందుకు ఇంకా ఎక్కువ భూభాగం అవసరమని, మధ్య ఐరోపాలో తగినంత భూభాగం లేనందున తూర్పు ఐరోపా వైపు విస్తరించాలని హిట్లర్ భావించాడు. హిట్లర్ వెర్సైల్స్ సంధికి, నానాజాతి సమితి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి. ఇటలీలో మాదిరిగా జర్మనీలో నిరంకుశ ప్రభుత్వం ఉండాలని హిట్లర్ అభిప్రాయ పడ్డాడు.

వైమార్ రిపబ్లిక్ కాలంలో జర్మనీలో అనేక పార్టీలు స్ధాపించబడ్డాయి. అందులో ఎక్కువ ప్రజాదరణ పొందింది హిట్లర్ నాజీ పార్టీ. 1929 వరకు ఇది చిన్నపార్టీ. కేవలం 12సీట్లు మాత్రమే గెలిచింది. 1932లో నాజీ పార్టీ 230సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

1933లో జర్మని అధ్యక్షుడు హిండెన్ బర్గ్, హిట్లర్ ను చాన్సలర్ గా గుర్తించక తప్పలేదు. హిట్లర్ కు అధికారం లభించినా అతని ఆశయం నియంతృత్వం. అందుకోసం క్రొత్తగా ఎన్నికలు జరపాలని నిర్ణయించాడు. 1933  మార్చి ఎన్నికలకు ముందు పార్లమెంట్ భవనం కాల్చివేయబడింది. హిట్లర్ ఆ నేరం కమ్యూనిస్టులపై మోపాడు. 288 సీట్లతో గెలిచిన హిట్లర్ అధికారమంతా తన చేతిలో, మంత్రిమండలి ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకున్నాడు. హిట్లర్ కు క్యాథలిక్ లు, జాతీయవాదుల మధ్ధతు లభించింది. దీనితో హిట్లర్ కొన్ని చట్టాల ద్వారా తన నిరంకృశత్వానికి బాటలు వేసుకున్నాడు.

1934 జూన్ నెల చివరి శనివారం హిట్లర్ పార్టీలో అనుమానితులను, ప్రతిపక్షం వారిని, కమ్యూనిస్టులను చంపించివేసాడు. ఈ సంఘటనకు ‘బ్లడీ సాటర్ డే’ గా పేరు ఏర్పడింది.

హిట్లర్ తన వ్యతిరేకుల కుట్రలను తెలుసుకొనేందుకు గెస్టపో అనే రహస్య పోలిస్ దళాన్ని ఏర్పాటు చేసాడు. దీనికి హిట్లర్ ప్రధానాధికారి.

ప్రచార మంత్రి గోబెల్స్ రేడియో, పత్రికలు, సినిమాలను నియంత్రించాడు. నాజీలకు వ్యతిరేకమైన పుస్తకాలను కాల్చివేసారు.

తనకు వ్యతిరేకంగా ఉండి రోమ్ లోని పోప్ ని తమ నాయకుడిగా పేర్కొనే రోమన్ క్యాథలిక్ ల పౌరసత్వం రధ్ధు చేసి వారి పాఠశాలలను మూసివేయించాడు.

1935 చట్టం ప్రకారం మతం ప్రభుత్వానికి లోబడి ఉంటుంది.

1937లో చర్చి మంత్రి అనుమతి లేకుండా ఉత్సవాలకోసం ధనం చెల్లించడం, వసూలు చేయడం నేరంగా ప్రకటించాడు. మతాధికారులు ప్రత్యేక క్యాంపుల్లో బంధించబడ్డారు. చర్చి కుటుంబ వ్యవస్ధను నాశనం చేశాడు.

యూదులపై వ్యతిరేక విధానం

1933 ఏప్రిల్ చేసిన తొలి చట్టం ప్రకారం యూదులపై వ్యతిరేకత ప్రకటించాడు. జర్మన్ జాతికానివారిని ఉద్యోగాల నుండి తొలగించాడు. 1 ఆగస్టు 1914కు ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి మినహాయింపు ఇచ్చాడు.

1935 నుండి యూదు తెగవారు జర్మన్ పౌరులు కారు. వారితో ఎవరూ వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీలు లేకుండా చేశాడు. వేలాది యూదులు ఉద్యోగాలు కోల్పోయి, దేశం విడిచి వెళ్లారు. ఉన్న వారిని తీవ్రంగా విచారించేవారు. ఈ విధంగా యూదులను సామాజికంగా ఆర్ధికంగా దెబ్బతీసాడు.

ఆర్ధిక విధానం

ఆహార కొరత, నిరుధ్యోగంతో సమతమతమవుతున్న జర్మనీని ఆర్ధికంగా బలపరచేందుకు హిట్లర్ అనేక చర్యలు తీసుకొని జర్మన్ ల మనసు గెలుచుకున్నాడు. పనికోసం యుద్దం అనే విధానం ద్వారా అనేక తాత్కాలిక ఉధ్యోగాలను సృష్టించాడు. గనులలో ఉధ్యోగులను నియమించాడు. ప్రజోపయోగ కార్యక్రమాల్లో ఉధ్యోగాలను సృష్టించాడు. మహిళలు పరిశ్రమలు మిల్లులలో ఉధ్యోగం చేయడం నిషేధించాడు. వారానికి 40పని గంటలుగా నిర్ధారించాడు. కార్మిక కర్షక సంఘాలను రద్దుచేసి జర్మన్ లేబర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి దేశంలోని కార్మిక కర్షకులందరిని ఒకే గొడుగు క్రిందకి తెచ్చాడు. ప్రధాన ఉత్పత్తి రంగాలను జాతీయం చేశాడు. దిగుమతులను నిరుత్సాహ పరచి స్వదేశీ వస్తువులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నూతన భవనాలు, కోటలు, యుద్దనౌకలు, విమానాలు ఉత్పత్తి చేయించాడు.

 

వ్యవసాయాభివృధ్ది

వ్యవసాయం వారసత్వం చేశాడు. కుటుంబ యజమాని మాత్రమే రైతుగా గుర్చించబడతాడు. రైతులుకు భూమిని అమ్మేందుకు, కొనేందుకు అధికారం లేదు. రైతులుక అనేక వసతులు కల్పించాడు. పాల ఉత్పత్తులను క్రమబద్దీకరించాడు.

ముడిసరుకుల కొరత లేకుండా జాగ్రత్త తీసుకున్నాడు.

దేశంలోని విదేశీ ద్రవ్యాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయనివారికి మరణ శిక్ష విధించాడు.

 

విధ్యావిధానం

క్రీడలను ప్రోత్సహించాడు. పవిత్రతను ప్రచారం చేశాడు. టీచర్లను స్వయంగా నియమించాడు. పాఠ్యపుస్తకాలను తిరిగి వ్రాయించి సైనికవాదాన్ని ప్రచారం చేశాడు.

ప్రతి జర్మన్ పౌరుడు హిట్లర్ యువజన సంఘంలో తప్పనిసరిగా చేరాలి. అది ఉధ్యోగార్హతల్లో ప్రధానమైనది.

 

సైనిక విధానం

జర్మన్లను మాత్రమే సైన్యంలో చేర్చుకున్నాడు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించాడు.

 

విదేశీ విదానం

ఐరోపా దేశాలపై ఎట్టిపరిస్థితుల్లో అయినా పెత్తనం చెలాయించాలని హిట్లర్ ఆశించాడు. జర్మన్ జాతి వారు అధికంగా ఉన్న పోలెండ్, ఆస్ట్రియా, జెకోస్లోవేకియాలను కలిపి విశాల థర్డ్ ఎస్టేట్ ను ఏర్పరచాలని నిర్ణయించాడు.

 

నిరాయుధీకరణ సమావేశం – నానాజాతి సమితి

1933 జనవరిలో ఏర్పరచిన నానాజాతి సమితి నిరాయుధీకరణ సమావేశంలో హిట్లర్  తక్కువ ఆయుధాలు కలిగి ఉండాలని జర్మనీ పై నానాజాతి సమితి విధించిన ఆంక్షలను తొలగించాలని, లేదా మిత్రదేశాలు కూడా నిరాయుధీకరణను పాటించాలని వాదించాడు. దానికి నానాజాతి సమితి అంగీకరించలేదు.

19 అక్టోబర్ 1933న హిట్లర్ నానాజాతి సమితి నుండి విరమించుకున్నాడు.

 

పోలండ్ జర్మనీ-రష్యాల మధ్య ఉంది. పది సంవత్సరాల వరకు పోలండ్ పై దురాక్రమణ జరపనని హిట్లర్ పోలండ్ తో ఒప్పందం చేసుకున్నాడు.

ఆస్ట్రియాలో అధిక సంఖ్యాకులు జర్మన్ జాతీయులు. కానీ ఆస్ట్రియా జర్మనీకి శతృదేశం. ఆస్ట్రియాలో నాజీ పార్టీ నిషేధింపబడింది. ఇటలీ నుండి వ్యతిరేకత వల్ల హిట్లర్ ఆస్ట్రియా పై యుద్ధం చేయలేకపోయాడు. ఇటలీతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకొని 1938లో హిట్లర్ ఆస్ట్రియాను ఆక్రమించాడు.

 

హిట్లర్ తూర్పువైపుకు విస్తరించాలంటే జెకోస్లోవేకియా అడ్డుగా ఉంది. బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ అంతర్గత సమస్యల్లో ఉండి యుద్దం పై విముఖంగా ఉన్న సమయంలో హిట్లర్ జెకోస్లోవేకియాను ఆక్రమించాడు.

 

పై పరిస్ధితులే ఆసరాగా రైన్ ప్రాంతాన్ని ఆక్రమించి హిట్లర్ కోటలను నిర్మించాడు.

బొగ్గు గనులు అధికంగా గల, జర్మనీకి అత్యంత ప్రధానమైన సార్ లోయ ను నానాజాతి సమితి 15సంవత్సరాలు తన సంరక్షణలో ఉంచుకుంది. 1935లో ప్రజాభిప్రాయ సేకరణ ఫలితం ప్రకారం సార్ ను జర్మనికి ఇచ్చేసారు.

 

అబిసీనియా యుద్ధం వల్ల ఇటలీతో, కమ్యూనిస్టులపై వ్యతిరేకత వల్ల జపాన్ తో జర్మనీకి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. 6 నవంబర్ 1937న రోమ్-బెర్లిన్-టోక్యో అక్షం ఏర్పడింది. ఈ కూటమి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాలకు వ్యతిరేకి.

 

రెండవ ప్రపంచ యుద్ధం – హిట్లర్

1 సెప్టెంబర్ 1939 న జర్మని పోలండ్ పై యుద్దం చేయడంతో ఇంగ్లండ్ జర్మనీ పై యుధ్ధం ప్రకటించింది. దీనితో రెండవ ప్రపంచ యుధ్ధం ప్రారంభమైంది.

హిట్లర్ రెండవ ప్రపంచ యుద్దంలో వీరోచితంగా పోరాడి కొన్ని విజయాలను సొంతం చేసుకుని ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేశాడు. పోలండ్ ను ఆక్రమించి, నార్వే, డెన్మార్క్, హాలండ్, బెల్జియం, ఫ్రాన్స్ లను ఆక్రమించాడు. ఆనంతరం ఇంగ్లండ్ వైపు పయనమయ్యాడు. 1943 నుండి యుద్దంలో విజయం మిత్రరాజ్యాలను వరించసాగింది. మిత్రరాజ్యాలు జర్మనీని చుట్టుముట్టి హిట్లర్ నివాసంపై దాడులు చేశాయి. 30 ఏప్రిల్ 1945న హిట్లర్, తన బార్య ఇవాబ్రౌన్ లు ఆత్మహత్య చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *