Cold War notes in Telugu

ప్రచ్చన్న యుధ్ధం గురించి వ్రాయండి?

Pracchanna Yuddham

Cold War notes in Telugu

రెండో ప్రపంచ యుధ్ధం తరువాత పాశ్చాత్య దేశాలకు, తూర్పు యూరప్ కమ్యూనిస్టు కూటమికి మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్ధితినే ప్రచ్చన్న యుధ్ధం అంటారు. రాజకీయ యుక్తులు, దౌత్యపరమైన కలహాలు, మానసిక యుద్దం, మానసిక వైరుధ్యం, అర్ధికపరమైన పోరాటం, ఆయుధ పోటీ, సరిహద్దుల్లో యుద్దాలు ప్రచ్చన యుధ్ధకాలపు లక్షణాలు.

రెండవ ప్రపంచ యుధ్ధానంతరం నూతన ఆర్ధిక సమతౌల్యంలో భాగంగా జర్మనీని విభజించడం, తూర్పు యారప్ రాజ్యాలు కమ్యూనిస్టు దేశాలుగా మారి సోవియట్ రష్యా ఆధీనంలోకి రావడం, అమెరికా కమ్యూనిజాన్ని వ్యతిరేకించడం, మిత్రకూటమి, వాటికి వ్యతిరేక కూటముల వల్ల యుధ్ధం భయం ప్రపంచంలో నెలకొంది.

1945 లో అణ్వస్త్రాల తయారీ, ఉపయోగంతో ప్రపంచ వ్యాప్తంగా అణుయుధ్ధ భయం నెలకొంది. ప్రపంచమంతా భయాందోళనల మధ్య జీవించింది. నెహ్రూ చెప్పినట్లు “ప్రపంచ ప్రజలు తాత్కాలికంగా రధ్ధయిన మరణదండన లో జీవించారు.”

నాలుగు దశల్లో ప్రచ్చన యుధ్ధం సాగింది

1946-1949 ప్రచ్చన్న యుద్ధం మొదటి దశ

సోవియట్ యూనియన్ మీద గట్టిగా వత్తిడి తెచ్చి కమ్యూనిస్టు పాలనను కూల్చివేయాలని అమెరికా భావన. అమెరికా రష్యాకన్నా సైనికపరంగా మెరుగైన స్ధితిలో ఉంది. కానీ అమెరికా మిత్రదేశాలకు అంత సైనిక శక్తి లేదు. పైగా రెండో ప్రపంచ ప్రతికూల ప్రభావాలు వారి మనసుల్లో మెదులుతూనే ఉన్నాయి.

1947 మార్చి ట్రూమన్ సిధ్ధాంతం ద్వారా, 1947 జాన్ మార్షల్ ప్రణాలికలో భావించినట్లు పశ్చిమ యూరప్ దేశాలను ఆర్ధికంగా సమన్వయ పరుస్తూ వాటిని రష్యా కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష యుధ్ధానికి సిధ్ధంచేయాలని అమెరికా భావించింది. స్టాలిన్ కూడా యుధ్ధం అనివార్యం అని భావించాడు.

 

1949-1953 ప్రచ్చన్న యుద్ధం రెండవ దశ

1951లో అమెరికా జపాన్ తో శాంతి ఒప్పందాన్ని, అస్ట్రేలియా, న్యాజిలాండ్ లతో భధ్రతా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇదే సమయంలో సంభవించిన కొరియా యుధ్ధం అమెరికా, రష్యాల మధ్య గల సంఘర్షణలను ప్రస్పుటం చేసింది. 1945 డిసెంబర్ లో ఉత్తర కొరియా – దక్షిణ కొరియాల ప్రతినిధులతో సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా అమెరికా దానిని వ్యతిరేకించింది. ఉత్తర కొరియాకు రష్యా మధ్ధతు ఉంది. దక్షిణ కొరియాకు అమెరికా మధ్ధతిస్తుండేది. 1946 మార్చిలో జరిగిన అమెరికా-రష్యాల సంయుక్త సమావేశం కూడా విఫలమైంది. చివరికి కొరియా సమస్యను ఐఖ్యరాజ్య సమితికి అప్పగించారు. దీని అనంతరం కూడా అమెరికా రష్యాల మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగాయి.

1953–1957 ప్రచ్చన్న యుద్ధం మూడవ దశ

ఈ దశలో సోవియట్ కూటమికి వ్యతిరేకంగా తన ఆర్ధిక, సైనిక హానికర విధానాన్ని అమెరికా కొనసాగించింది. అమెరికా ఈ కాలంలో అనేక నూతన ఒప్పందాలు చేసుకుని సైనికంగా రష్యాను దిగ్బందనం చేయడంలో కృతకృత్యురాలైంది. ఆగ్నేయాసియా సంధి వ్యవస్ధ (సీటో), మధ్య ప్రాచ్య రక్షణ వ్యవస్ధ (మీడో) లతో పాటూ 43 దేశాలతో అమెరికా రక్షణ ఒప్పందాలు చేసుకుంది. దీనిలో అనేక దేశాలు రష్యా సరిహ్దదులో ఉన్నాయి. రష్యా చుట్టుపక్కల సైనిక స్ధావరాలను అమెరికా ఏర్పరచింది. ఇదే కాలంలో అమెరికా వియత్నాం యుధ్ధంలో చిక్కుకుంది.

రష్యా నాటోకు వ్యతిరేకంగా తూర్పు యూరప్ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. 12దేశాలతో రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇదే కాలంలో జర్మని విడిపోయింది. అమెరికా రష్యాలు ఏక కాలంలో హైడ్రోజన్ బాంబును ప్రయోగించాయి. మాటల్లో యుధ్ధ వాతావరణాన్ని ప్రతిభింబించినా చేతల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాయి. ఈ దశ చివరి కాలంలో పరస్పర సంప్రదింపులు ప్రారంభించాయి.

 

1957-1962 ప్రచ్చన్న యుద్ధం నాలుగవ దశ

ఈ దశలో పరస్పర విభిన్న ధోరణులు కనిపిస్తాయి. ఒకవైపు సహజీవన సూత్రాలను వల్లిస్తూ మరోవైపు మొత్తం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుధ్ధం దిశగా నడిపిన నేపధ్యం కనపడుతుంది. ఈ దశ ప్రారంభ కాలంలో అమెరికా రష్యాలు తమ రాజకీయ, సాంస్కృతిక రాయబారులను ఇరు దేశాలకు పంపుకున్నాయి.  ఇరుదేశాల ప్రభుత్వాధినేతలు కూడా ఒకరి దేశాన్ని మరొకరు సందర్శించారు. ఇరుదేశాలు పారిస్ శిఖరాగ్ర సమావేశాన్ని అంగీకరించడంతో ప్రచ్చన్న యుద్ధం సమసిపోయిందని అంతా భావించారు. 1 మే 1960న అమెరికా గుడాచారి విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఈ ఘటన ‘యు-2 ఘటన’ గా ప్రసిధ్ధం. దీనితో ఇరుదేశాల మధ్య వైరం బహిర్గతమైంది. నష్టాన్ని పూడ్చవలసిందిగా అమెరికా రష్యాపై వత్తిడి తెచ్చింది. మరోవైపు క్యూబన్ సంక్షోభం రెండు అగ్రరాజ్యాలను యుధ్ధం ముంగిట్లోకి నెట్టింది. చివరికి కృశ్చేవ్-కెన్నెడి ల మధ్య ఒప్పందంతో అణు విధ్వంసం నుండి మానవజాతి రక్షింపబడింది. క్యూబా మీద దాడి చేయనని అమెరికా అంగీకరించింది. రష్యా తన క్షిపణి స్ధావరాన్ని ఉపసంహరించుకుంది.

 

ప్రచ్చన యుధ్ధ కాలంలో ఒక దేశానికి మరో దేశం పట్ల అభధ్రతా భావం తప్ప ఒకరికొకరు ప్రత్యక్షంగా చెడు చేసుకోలేదు. యుధ్ధం భయంతో అమెరికా రష్యాలు విపరీతంగా ఒప్పందాలు చేసుకుని, సైనిక సంపత్తిని పెంచుకున్నాయి. కానీ రెండో ప్రపంచయుధ్ధ నష్టాన్ని ప్రపంచ దేశాలు ఇంకా మరచిపోనందున ప్రచ్చన్న యుద్ధం మూడో ప్రపంచయుద్ధం గా రూపదాల్చకముందే ముగిసిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *