World Heritage Day
World Heritage Day వారసత్వ సంపదను కాపాడు కుందాం తమ దేశానికి చెందిన వెలకట్టలేని వారసత్వ సంపద పరిరక్షణకోసం కట్టుబడి ఉండటంతో పాటు యునెస్కోలో భాగమైన ప్రపంచంలోని సభ్యదేశాలు ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ప్రతి ఏటా ఏప్రిల్ 18న 'ప్రపంచ వారసత్వ దినోత్సవం (వరల్డ్ హెరిటేజ్ డే ) గా పాటిస్తున్నారు. మన సాంస్కృతిక వైవిధ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఈ రోజు గుర్తుచేస్తుంది. ఆఫ్రికా ట్యునీషియాలో 1982 ఏప్రిల్ 18న అంతర్జాతీయ వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై 'ఐక్యరాజ్యసమితి', 'అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం' సంయుక్త ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులిచ్చిన సలహాలు, సూచనలతో యునెస్కోకి ప్రతిపాదనలు పంపించగా 1983లో ఆమోదం పొందింది. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్ 18వ తేదీనే 'ప్రపంచ వారసత్వ దినోత్సవం' గా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి వారసత్వ సంపదపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతుండగా.. దాదాపు ఎనిమిది వందలకు పైగా పురాతన కట్టడాలు, స్థలాలను పరిరక్షిస్తుండటం విశేషం. భారతదేశ...