Important points Importance of Guntur
Important points Importance of Guntur 'గుంటూరు చరిత్ర' * (సమాచార సేకరణ : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు) గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా? శతాబ్దాల చరిత్ర నా గుంటూరు .... ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి. కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు. మాచర్ల చెన్నకేశవుడి ఆశీస్సులతో ౘాపకూడు సిధ్ధాంతం ద్వారా సామాజిక న్యాయం కోసం నిలబడ్డ పల్నాటి బ్రహ్మనాయుడి చరిత్ర నా గుంటూరు. కృష్ణరాయలుకే కొఱుకుడు పడని కొండవీటి రెడ్డి రాజుల చరిత్ర నా గుంటూరు. అష్ట దిగ్గజాలకే తలమానికమైన రామకృష్ణ కవి నా గుంటూరు. 'కృష్ణం కలయసఖి సుందరం బాల కృష్ణం కలయసఖి సుందరం' అంటూ 'తరంగాలు' అందించిన నారాయణ దాసు నా గుంటూరు. అమరావతి కేంద్రంగా సుపరిపాలన అందించిన రాజా వాసిరెడ్డి వేంకట్రాది నాయుడు చరిత్ర నా గుంటూరు. ముచుకుంద మహర్షి తపమాచరించిన గుత్తికొండ బిలం నా గుంటూరు. త్రేతాయుగంనాటిదని పేరు గాంచిన సీతానగర...