Indian Judiciary mock test in Telugu for appsc tspsc group1 group2 SI constable panchayat secretary exams
ఇండియన్ పాలిటి ప్రాక్టీస్ టెస్ట్స్ - జ్యుడీషియరీ
Indian Juduciary జ్యుడీషియరీ
Quiz
- జ్యుడీషియరీలో అల్ట్రా వైరస్ అంటే?
1. న్యాయశాఖ క్రియాశీలత ఏ కేసు నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు ?- 1) కేశవానంద భారతికేసు (1973)
- 2) గోపాలన్ కేసు (1965)
- 3) సజ్జన్‌సింగ్ కేసు (1955)
- 4) గోలక్‌నాథ్ కేసు (1963)
- 2. భారత రాజ్యాంగంలో న్యాయసమీక్షా భావన అంతర్లీనంగా ఏ ప్రకరణలో కనిపిస్తుంది ?
- 1) ఆర్టికల్ 13, 32, 226
- 2) ఆర్టికల్ 13, 32, 262
- 3) ఆర్టికల్ 12, 12, 32
- 4) ఆర్టికల్ 13, 311. 32
- 3. కిందివాటిని జతపర్చండి
1) ఎస్ఆర్ బొమ్మై కేసు ఎ) 1994
2) కామన్‌కాజ్ కేసు బి) 2007
3) మినర్వామిల్స్ కేసు సి) 1980
4) కేశవానంద భారతికేసు డి) 1973- 1) 1- ఎ, 2- బి, 3-సి, 4-డి
- 2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
- 3) 1-సి, 2-బి, 3-డి, 4-సి
- 4) 1- సి, 2- డి, 3-ఎ, 4-బి
- 4. ప్రత్యక్షంగా ఒక చట్టాన్ని పార్లమెంట్‌కు చేసే అవకాశం లేనప్పుడు పరోక్షంగా కూడా దాన్ని చేయకూడదనే సూత్రం సుప్రీంకోర్టు న్యాయసమీక్ష ప్రక్రియలో భాగంగా ఏ సిద్ధాంతంలో ప్రతిపాదించారు?
- 1) రాయితీ సిద్ధాంతం
- 2) గ్రహణ సిద్ధాంతం
- 3) మోసపూరిత సిద్ధాంతం
- 4) విభాజక దృక్పథం
- 5. రాజ్యాంగంలో కొన్ని అంశాల్లోని పార్లమెంట్ రాజ్య సవరణాధికారం నుంచి ఏ సిద్ధాంతం ద్వారా మినహాయిస్తారు?
- 1) రాజ్యాంగమౌలిక స్వరూప సిద్ధాంతం
- 2) మోసపూరిత సిద్ధాంతం
- 3) రాయితీ సిద్ధాంతం
- 4) గ్రహణ సిద్ధాంతం
- 6. రాజ్యం కల్పించిన ఏదైనా స్వేచ్ఛ నుంచి మినహాయింపు కోరుకునే హక్కు పౌరులకి సుప్రీంకోర్టు ఏ సిద్ధాంతం నుంచి మినహాయింపు ఇచ్చింది?
- 1) మోసపూరిత సిద్ధాంతం
- 2) రాయితీ సిద్ధాంతం
- 3) మౌలిక స్వరూప సిద్ధాంతం
- 4) గ్రహణ సిద్ధాంతం
- 7. ప్రభుత్వ, సామాజిక చర్యలతో ప్రజల హక్కులకు భంగం కలిగితే ఏ పౌరుడైనా సదరు చర్చలను న్యాయస్థానాల్లో సవాల్ చేయవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించిన దృక్పథం ఏది ?
- 1) సుమోటో దృక్పథం
- 2) పీఐఎల్ దృక్పథం
- 3) మౌలిక స్వరూప సిద్ధాంతం
- 4) రాయితీ సిద్ధాంతం
- 8. భారత రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యత ఎవరికుంది ?
- 1) పార్లమెంటు
- 2) పాలనాయంత్రాంగం
- 3) సుప్రీంకోర్టు
- 4) రాష్ట్రపతి
- 9. కింది వాటిని జతపర్చండి.
1) రాయితీ సిద్ధాంతం
ఎ) బషిల్ వర్సెస్ ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్
2) ప్రజాప్రయోజనాల దృక్పథం
బి) ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
3) రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం
సి) కేశవానంద భారతి వర్సెస్ కేరళ (1973)
4) గ్రహణ సిద్ధాంతం
డి) బికాజీ వర్సెస్ మధ్యప్రదేశ్ (1955)- 1) 1-ఎ, 2- బి, 3- సి, 4- డి
- 2) 1-ఎ, 2-డి, 3- సి, 4-ఎ
- 3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
- 4) 1-బి, 2-డి, 3-సి, 4- ఎ
- 10. భారత రాజ్యాంగంలో న్యాయశాఖ పాలన యంత్రాంగాన్ని నియంత్రించే అధికరణలు ఏవి?
- 1) ఆర్టికల్ 13, 299, 300, 32
- 2) ఆర్టికల్ 13, 32, 311, 301
- 3) ఆర్టికల్ 12, 299, 32, 310
- 4) ఆర్టికల్ 12, 13, 299, 32
- 11. కేశవానంద భారతి కేసులో ప్రధాన న్యాయమూర్తి ?
- 1) చంద్రకుమార్
- 2) లక్ష్మణ్
- 3) సిక్రీ
- 4) కపాడియా
- 12. కింది ఏ కేసులో 9వ షెడ్యూల్‌ని క్రియారహితం చేసింది?
- 1) కేశవానంద భారతికేసు
- 2)కామన్‌కాజ్ కేసు
- 3) మినర్వామిల్స్ కేసు
- 4) ఇందిరాసహాని కేసు
- 13. న్యాయ పరిభాషలో MISFEASANCE అంటే?
- 1) చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అమలు చేయడం
- 2) చట్టాన్ని వక్రంగా అర్థం చేసుకోవడం
- 3) అధికారి తన అధికార పరిధిని దాటడం
- 4) చట్టాన్ని తనకు అనుకూలంగా అర్థం చేసుకుని అమలు చేయడం
- 14. కిందివాటిని జతపర్చండి.
1) Overfeasance ఎ) Administrator Acts With Out Authority
2) Malfeasance బి) Abuse Of Authority
3) Error Of Procedure - సి) Not Following Laid Down Procedure
4) Mis Feasance డి) Error Of Law- 1) 1-ఎ, 2- బి, 3-డి, 4-సి
- 2) 1-బి, 2- ఎ, 3-సి, 4- డి
- 3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- 4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
- 15. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్‌జేఏసీ పార్లమెంట్ చట్టం చేసింది?
- 1) 97
- 2) 98
- 3) 100
- 4) 99
- 16. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1. ఎన్‌జేఏసీ ఏర్పాటుతో రాజ్యాంగంలో ఆర్టికల్ 124 (1) కొత్తగా ఏర్పాటైంది
2. న్యాయశాఖని నియంత్రించడానికి పార్లమెంట్ ఎన్‌జేఏసీ చట్టాన్ని తీసుకొచ్చింది.- 1) 1
- 2) 2
- 3) 1, 2
- 4) ఏదీకాదు
- 17. జతపర్చండి.
1) బిజాయ్ ఇమ్మాన్యుయేల్ వర్సెస్ కేరళ రాష్ట్రం - ఎ) జాతీయగీతం కేసు
2) కేశవానందభారతి వర్సెస్ కేరళ రాష్ట్రం - బి) మౌలికస్వరూప సిద్ధాంతం కేసు
3) ఇందిరాసహాని వర్సెస్ భారత ప్రభుత్వం - సి) మండల్ కేసు
4) సరళాముద్గల్ వర్సెస్ భారత ప్రభుత్వం - డి) ఉమ్మడిన్యాయస్మృతి కేసు- 1) 1-ఎ, 2- బి, 3- డి, 4-సి
- 2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
- 3) 1-ఎ, 2-బి, 3-సి, 4- డి
- 4) 1-సి, 2-బి, 3-ఎ, 4- డి
- 18. పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులకు జీతం ఎక్కడి నుంచి చెల్లిస్తారు ?
- 1) భారత సంఘటిత నిధి
- 2) రాష్ట్ర సంఘటిత నిధి
- 3) రాష్ట్ర అసంఘటిత నిధి
- 4) భారత అసంఘటిత నిధి
- 19. హైకోర్టు న్యాయమూర్తిని ఏ అంశాల ప్రాతిపదికన పార్లమెంటు తొలగిస్తుంది?
- 1) అసమర్థత
- 2) దుష్ప్రవర్తన
- 3) అవినీతి
- 4) ఎ, బి
- 20. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) రెండో ఎస్సార్సీ-2ని 2005లో నియమించారు
2) ఎస్సార్సీ- 2 తన నివేదికను 2007లో అందచేసింది
3) ఎస్సార్సీ-2కి చైర్మన్‌గా వీరప్పమొయిలీ వ్యవహరించారు
4) ఎస్సార్సీ-1కి చైర్మన్‌గా మొరార్జీ దేశాయ్ వ్యవహరించారు- 1) 1, 2, 3
- 2) 2, 3
- 3) 3, 4
- 4) 1, 2, 3, 4
- 21. శానస, కార్వనిర్వహణ శాఖలు చేసిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ఉంటే సుప్రీంకోర్టు ఏ అధికారం ద్వారా ఆ చట్టాల్ని రద్దు చేస్తుంది ?
- 1) పునఃసమీక్షాధికారం
- 2) న్యాయసమీక్షాధికారం
- 3) న్యాయశాఖ క్రియాశీలత
- 4) సలహాస్వరూప అధికార పరిధి
- 22. శాసన, కార్వనిర్వహణ శాఖలు ఎక్కడ తమ విధులను నిర్వహించడంలో విఫలమవువుతాయో అక్కడ న్యాయస్థానాలు జోక్యం చేసుకుని పాలనను విజయవంతం చేస్తాయి. ఈ భావనను ఏమంటారు ?
- 1) న్యాయ సమీక్ష
- 2) న్యాయశాఖ క్రియాశీలత
- 3) న్యాయశాఖ అంటే క్రియాశీలత
- 4) అధికార అతిక్రమణ
- 23. న్యాయశాఖ అతిక్రియాశీలతతో శాసనశాఖ చేసిన రాజ్యాంగ సవరణలు ఏవి?
1) గోలక్‌నాథ్ కేసులో ఇచ్చిన తీర్పును అధిగమించడానికి 24వ రాజ్యాంగ సవరణ
2) కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పును అధిగమించడానికి 42వ రాజ్యాంగ సవరణ
3) ఇందిరాసహాని కేసులో ఇచ్చిన తీర్పును అధిగమించడానికి 76వ రాజ్యాంగ సవరణ
4) ఎస్ఆర్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పును అధిగమించడానికి 92వ రాజ్యాంగ సవరణ- 1) 1, 2
- 2) 2, 3, 4
- 3) 1, 2, 4
- 4) 1, 2, 3
- 24. అల్ట్రా వైరస్ అంటే ?
- 1) చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉండటం
- 2) చట్టాలు న్యాయస్థానాలకు విరుద్ధంగా ఉండటం
- 3) చట్టాలు ప్రతిపక్షాలకు విరుద్ధంగా ఉండటం
- 4) న్యాయశాఖ తీర్పులు పార్లమెంట్ స్ఫూర్తికి
విరుద్ధంగా ఉండటం
- 25. ఏ కేసులో సుప్రీంకోర్టు సమాఖ్య, లౌకిక విధానం, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా గుర్తించాయి?
- 1) చంద్రకుమార్ కేసు
- 2) సంపత్‌కుమార్ కేసు
- 3) ఎస్ఆర్ బొమ్మై కేసు
- 4) ఇందిరాసహాని కేసు
- 26. కింద పేర్కొన్న ఏ కేసుల్లో న్యాయస్థానాలు క్రియాశీలకంగా వ్యవహరించాయో సరైనదాన్ని గుర్తించండి ?
1) కేశవానంద భారతి కేసు 2) గోలక్‌నాథ్ కేసు
3) మినర్వామిల్స్ కేసు 4) ఎస్ఆర్ బొమ్మై కేసు
5) గోపాలన్ కేసు 6) చంపకందొరై కేసు- 1) 1, 2, 3
- 2) 1, 2, 3,4 6
- 3) 1, 2, 3, 4, 5
- 4) 1, 2, 3, 4
- 27. కిందివాటిల్లో అతిక్రియాశీలత నియంత్రణ కోసం పార్లమెంటు చేసిన ప్రతిపాదనలు ఏవి?
- 1) న్యాయశాఖ జవాబుదారీ బిల్లు - 2010
- 2) ఎన్‌జేఏసీ
- 3) జుడీషియల్ ఓవర్‌సైట్ కమిటీ
- 4) పైవన్నీ
- 28. ఇటీవలి కాలంలో 5th Estateగా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశం ఏది?
- 1) మీడియా
- 2) ప్రభావ సంఘాలు
- 3) సోషల్ నెట్వర్క్స్
- 4) పైవేవీకావు
- 29. కిందివాటిల్లో న్యాయ సమీక్ష నియంత్రణలో లోపాలు?
- 1) జాప్యంతో కూడిన న్యాయప్రక్రియ
- 2) న్యాయ ప్రక్రియ తీవ్రమైన ఖర్చుతో కూడుకున్నది
- 3) న్యాయ ప్రక్రియ సామాన్యుడికి అందుబాటులోలేనిది
- 4) పైవన్నీ
- 30. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఎన్‌జేఏసీని ఏ ప్రాతిపదికన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది?
- 1) స్వతంత్ర న్యాయవ్యవస్థ
- 2) ఏకీకృత న్యాయవ్యవస్థ
- 3) న్యాయ సమీక్ష
- 4) జాతీయ సమైక్యత
- 31. ఇటీవలి కాలంలో రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌ని అతిక్రమిస్తున్నాయి?
- 1) 8
- 2) 9
- 3) 10
- 4) 12
- 32. 1/3వ వంతు సభ్యులు పార్టీ ఫిరాయిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రారనే అంశాన్ని తొలగించిన రాజ్యాంగ సవరణ?
- 1) 89
- 2) 92
- 3) 96
- 4) 91
- 33. కింది ఏ కేసులో సుప్రీంకోర్టు క్రియారహితంగా ఉందని చెప్పవచ్చు?
- 1) కామన్‌కాజ్
- 2) ఉన్నికృష్ణన్
- 3) మేనకాగాంధీ
- 4) చంపకదొరైరాజన్ కేసు
- 34. కిందివాటిలో నేషనల్ కమిషన్ టూ రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి సంబంధించి వాస్తవాలు ?
- 1) NCRWC 2000లో నియామకం చేశారు
- 2) NCRWC లో 11 మంది సభ్యులు, 1 చైర్మన్ ఉన్నారు
- 3) NCRWC చైర్మన్‌గా వెంకటాచలయ్య వ్యవహరించారు
- 4) NCRWC నివేదికను 2002, మార్చి 11న అంద చేసింది
- 35. NCRWC భారత న్యాయవ్యవస్థకి సంబంధించి చేసిన సిఫార్సులు ఏవి ? (4)
- 1) సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల పదవి విరమణ వయస్సు 68, 65కి పెంచాలి
- 2) నేషనల్ జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
- 3) తీర్పులు ఇవ్వడంలో హైకోర్టు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
- 4) పైవన్నీ
- 36. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమనే అంశం రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది?
- 1) కిహోతో హోలాన్ కేసు
- 2) ఎస్ఆర్ బొమ్మై కేసు
- 3) కామన్‌కాజ్ కేసు
- 4) పైవేవీకావు
- 37. కింది వాటిలో సరైనదాన్ని ఎంపిక చేయండి?
1. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ద్వారా సభ్యత్వం కోల్పోయిన సభ్యుడిని మంత్రిగా నియమించరాదు
2. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మంత్రుల సంఖ్య సభలోని మొత్తం సభ్యుల్లో 15 శాతం మించరాదు.- 1) 1
- 2) 1, 2
- 3) 2
- 4) 2, 1
- 38. ఏ దేశంలో ప్రభావ వర్గాలు క్రియాశీలకంగా ఉంటాయి?
- 1) ఇండియా
- 2) బ్రిటన్
- 3) యూఎస్ఏ
- 4) చైనా
- 39. సరైనదాన్ని ఎంపిక చేయండి ?
1) ఏ లక్ష్యాలపై ఆధారపడి రాజ్యాంగం రూపొందించబడిందో ఆ లక్ష్యాల్ని రాజ్యాంగ మౌలికాంశాలంటారు.
2) రాజ్యాంగ మౌలికాంశాల్ని న్యాయస్థానాలనుకనుగుణంగా ప్రకటిస్తాయి- 1) 1
- 2) 1, 2
- 3) 2
- 4) ఏవీకావు
- 40. ఏదైనా చట్టంలోని ఒక అంశం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది ఉంటే ఆ మేరకు మాత్రమే ఆ చట్టం చెల్లుబాటు కాదని చెప్పే సిద్ధాంతం ఏది?
- 1) గ్రహణ సిద్ధాంతం
- 2) విభాజక సిద్ధాంతం
- 3) అంతర్లీన అధికార దృక్పథం
- 4) రాయితీ సిద్ధాంతం
- 41. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ఎప్పడు అమల్లోకి వచ్చింది ?
- 1) 1990
- 2) 1989
- 3) 1988
- 4) 1991
- 42. భారత రాజ్యాంగంలో ఏ అధికరణాన్ని మృతపత్రంగా బీఆర్ అంబేద్కర్ అభివర్ణించారు?
- 1) ఆర్టికల్ 352
- 2) ఆర్టికల్ 360
- 3) ఆర్టికల్ 356
- 4) ఆర్టికల్ 32
No comments:
Post a Comment